


Best Web Hosting Provider In India 2024
CBSE 10th Result : గత 5 ఏళ్లలో సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల ఎప్పుడు వచ్చాయి?
CBSE 10th Result : సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. డిజిలాకర్, ఉమాంగ్ యాప్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఫలితాలు ఎప్పుడు విడుదల అయ్యాయో చూద్దాం..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు 2025 అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in, results.cbse.nic.in విడుదల కానున్నాయి. 2025 ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి.
సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు ఎగ్జామ్ 2025 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18, 2025 వరకు జరిగింది. టెన్త్ పరీక్షలకు 24.12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. డిజిలాకర్, ఉమాంగ్ యాప్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
డిజిలాకర్‌తో ఎలా చెక్ చేయాలి?
మీరు డిజిలాకర్‌లో సీబీఎస్ఈ బోర్డు 10వ ఫలితాలను కూడా తనిఖీ చేయవచ్చు. రిజల్ట్ చెక్ చేసుకోవాలంటే digilocker.gov.in వెళ్లాల్సిందే. దీని తరువాత మీరు లాగిన్ కావాలి. ఆ తర్వాత సీబీఎస్ఈ టెన్త్ రిజల్ట్ విభాగానికి వెళ్లాలి. మీ రోల్ నంబర్, పాఠశాల నంబర్ మొదలైన వివరాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఇప్పుడు మీ రిజల్ట్ మీ స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది.
ఉమాంగ్ యాప్‌లో ఎలా చూడాలి?
మొదట మీరు ప్లేస్టోర్‌కు వెళ్లి ఉమాంగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీని తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో ఖాతాను సృష్టించాలి. ఫలితాలు ప్రకటించిన తర్వాత యాప్‌లో రిజల్ట్ లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. దీని తరువాత ఫలితం మీ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.
ఫలితాలు వచ్చాక ఎలా చెక్ చెయాలి?
ఫలితాలను తనిఖీ చేయడానికి మొదట సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in, results.cbse.nic.in వెళ్లండి.
దీని హోమ్ పేజీలో టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్ లింక్ కనిపిస్తుంది.
ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ రోల్ నెంబర్ సబ్మిట్ చేయండి.
రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
రిజల్ట్ చూశాక స్క్రీన్ షాట్ లేదా ప్రింట్ అవుట్ తీయాలి.
గతంలో ఫలితాల విడుదల తేదీలు
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై సీబీఎస్ఈ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ ఏడాది టెన్త్ ఫలితాల కోసం 24 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. గత 5 సంవత్సరాలలో సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల విడుదల తేదీలు చూద్దాం.. 2024 మే 13, 2023 మే 12, 2022 జూలై, 22 2021 ఆగస్టు 3, 2020 జూలై 15న విడుదల అయ్యాయి. ఈ ఏడాది ఎప్పుడు వస్తాయో చూడాలి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link