



Best Web Hosting Provider In India 2024

OTT Horror Comedy: ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు హారర్ కామెడీ మూవీ -హీరోగా కోర్ట్ మూవీ యాక్టర్ -స్కూటర్‌లో ఆత్మ
OTT Horror Comedy: తెలుగు హారర్ కామెడీ మూవీ టుక్ టుక్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. హర్ష్ రోషన్, కార్తీకేయ దేవ్, స్టీవెన్ మధుతో పాటు శాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

OTT Horror Comedy: తెలుగు హారర్ కామెడీ మూవీ టుక్ టుక్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. టుక్ టుక్ ఓటీటీ రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ వివరాలు రివీలయ్యాయి. ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. బుధవారం టుక్ టుక్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ ఓటీటీ అఫీషియల్‌గా వెల్లడించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
ఐఎమ్‌డీబీలో…
టుక్ టుక్‌లో కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, కార్తీకేయ దేవ్, స్టీవెన్ మధుతో పాటు శాన్వీ మేఘన, నిహాల్ కోదాటి కీలక పాత్రలు పోషించారు. సుప్రీత్ సీ కృష్ణ దర్శకత్వం వహించాడు. హారర్ కామెడీ అంశాలకు స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన ఓ మెసేజ్‌ను జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. కామెడీ బాగుందనే టాక్ వచ్చినా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో టుక్ టుక్ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఐఎమ్‌డీబీలో మాత్రం 9.7 రేటింగ్‌ను దక్కించుకున్నది.
బండిలో ఆత్మ…
పల్లెటూరికి చెందిన ముగ్గురు స్నేహితులువీడియోలు తీసి బాగా డబ్బులు సంపాదించాలని కలలు కంటారు. కెమెరా కొనడానికి డబ్బులు లేకపోవడంతో వినాయకుడిని నిలబెట్టడానికి చందాలు వసూలు చేస్తారు. దేవుడి ఊరేగింపుకు బండి అవసరం అవుతుంది. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పాత బజాజ్ చేతక్ స్కూటర్‌ను ఆటోలా మైడీఫై చేస్తారు.
ఆ బండి ఊళ్లో ఫేమస్ అవుతుంది. ఏవైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయో లేదో హ్యాండిల్ అటూ ఇటూ ఉపుతూ బండి చెబుతుంటుంది. ఆ బండిలో దేవుడు ఉన్నాడని ముగ్గురు స్నేహితులు అనుకుంటారు. కానీ అందులో ఉన్నది ఓ ఆత్మ అనే నిజం బయటపడుతుంది.
బండిలోని ఆత్మ కారణంగా ముగ్గురు స్నేహితులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? ఆ ఆత్మకు శిల్ప (శాన్వీ మేఘన) అనే అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి? శిల్ప గురించి ఆ ముగ్గురు కుర్రాళ్లు సాగించిన అన్వేషణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ? శిల్ప జీవితంలో నవీన్ (నిహాల్ కోదాటి) పాత్ర ఏమిటి? అన్నదే టుక్ టుక్ మూవీ కథ.
కోర్ట్ మూవీతో బ్లాక్‌బస్టర్…
టుక్ టుక్ కంటే ముందు హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.హీరో నాని నిర్మించిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
టుక్ టుక్‌లో కీలక పాత్ర పోషించిన శాన్వీ మేఘన కుడుంబస్థాన్ మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన కుడుంబస్తాన్ ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
]
సంబంధిత కథనం