




Best Web Hosting Provider In India 2024

Telugu Serial: మామగారు సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుండె నిండా గుడి గంటలు బాలు – పోకిరి లెవెల్ ట్విస్ట్
Telugu Serial: స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న మామగారు సీరియల్‌లోకి గుండె నిండా గుడి గంటలు బాలు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్‌లో బాలు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమోలో బాలు స్టైలిష్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలుగా నటిస్తోన్నాడు విష్ణుకాంత్. కుటుంబ బాధ్యతలను నెరవేర్చేందుకు పాటుపడే సగటు మధ్య తరగతి యువకుడిగా మాస్ యాక్టింగ్‌తో ఇరగదీస్తున్నాడు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న గుండె నిండా గుడి గంటలు టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్‌లో దూసుకుపోతుంది.
గెస్ట్ రోల్….
స్టార్ మాలోనే ప్రసారమవుతోన్న మరో సీరియల్ మామగారులో బాలు గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. బుధవారం నాటి మామగారు సీరియల్ ప్రోమోలో బాలు కనిపించాడు. బాలు పేరుతోనే ఎంట్రీ ఇచ్చాడు. అయితే గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో క్యాబ్ డ్రైవర్‌గా కనిపించిన బాలు…మామగారులో మాత్రం పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించాడు.
స్టైలిష్ ఎంట్రీ…
ప్రోమోలో బాలు స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అతడి చుట్టూ బౌన్సర్లు కనిపించారు. బాలును గంగా గుర్తుపట్టినట్లుగా చూపించారు. ఏయ్ బాలు అని గంగా అనగానే యా అంటూ బాలు ఆన్సర్ ఇచ్చాడు. మీ అత్తగారిపై నీ దాడి విషయంలో పోలీసు ఎంక్వైరీకి ఆదేశించారు కదా అని గంగాను బాలు అడిగాడు. అవును …ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని బాలును గంగా అడిగింది. ఆ ఎంక్వైరీ చేయాల్సిన ఆఫీసర్‌ను నేనే అని బాలు బదులిచ్చాడు.
బాలు సెటైర్లు…
మీ ఇష్టానికి వ్యతిరేకంగా గంగా ఉద్యోగానికి వెళ్లిందని, ఇంట్లో ఆడవాళ్లను ఒకటి చేసింది మీ కడుపులో మంట, అల్సర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ అంటూ తనదైన స్టైల్‌లో చెంగయ్యపై బాలు సెటైర్లు వేయడం ప్రోమోలో కనిపిస్తోంది…దేవమ్మ గారికి అలా జరగడంతో మీకు అవకాశం దొరికింది. ఈ విధంగా ఇకిరించారేమో అంటూ తన ప్రశ్నలపై చెంగయ్యకు బాలు చెమటలు పట్టించినట్లుగా ప్రోమోలో చూపించారు.
గంగను పెళ్లిచేసుకుంటా…
గంగను నేను పెళ్లి చేసుకునే విషయంలో నీ అభిప్రాయం…మా జంట బాగుంటుందా…నువ్వు వేరే వాళ్లను పెళ్లి చేసుకుంటున్నావుగా…గంగను నేను పెళ్లి చేసుకోవడంలో నీకు అభ్యంతరం ఏం లేదుగా అంటూ గంగాధర్‌ను కూడా బాలు కలిసి తికమక పెట్టినట్లుగా ప్రోమోలో కనిపిస్తోంది. బుధవారం నాటి ఎపిసోడ్‌కు ప్రోమో హైలైట్‌గా నిలుస్తుంది. ప్రోమో చూస్తుంటే చెంగయ్యను బాలు రప్ఫాడించబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రోమో సీరియల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇదని ఫ్యాన్స్ అంటోన్నారు.
టీఆర్‌పీ రేటింగ్…
పోలీస్ ఆఫీసర్‌గా బాలుది గెస్ట్ క్యారెక్టర్ అయినా ఐదారు ఎపిసోడ్స్ వరకు కనిపిస్తుందని సమాచారం. మామగారు సీరియల్‌లో సుహాసిని, మైకో విజయ్, సార్థక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుహాసిని స్వయంగా ఈ సీరియల్‌ను నిర్మిస్తోంది. లేటేస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో మామగారు సీరియల్‌కు 5.18 రేటింగ్ రాగా…గుండె నిండా గుడి గంటలు 12.57 రేటింగ్ సొంతం చేసుకున్నది.
సంబంధిత కథనం