




Best Web Hosting Provider In India 2024

Salaar Release Collection: సలార్ మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్ – సాలిడ్ కలెక్షన్స్‌తో కుమ్మేసిన రెబల్ స్టార్ సినిమా
Salaar Release Collection: ప్రభాస్ సలార్ మూవీ రీ రిలీజ్‌లోనూ అదరగొట్టింది. ఓవరాల్‌గా రీ రిలీజ్ ద్వారా ఈ మూవీకి 4.35 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా సలార్ నిలిచింది.

ప్రభాస్ సలార్ మూవీ మార్చి 21న థియేటర్లలో రీ రిలీజైంది. మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్ లాంటి కొత్త సినిమాల పోటీని తట్టుకుంటూ రీ రిలీజ్‌లోనూ సలార్ బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. రీ రిలీజ్ ద్వారా సలార్ మూవీ ఓవరాల్‌గా 4.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
ఫస్ట్ డే రికార్డ్స్…
మొదటిరోజునే ప్రభాస్ మూవీ మూడు కోట్ల ఇరవై లక్షల వరకు వసూళ్లను రాబట్టింది. తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. సెకండ్ డే నుంచి థియేటర్లను భారీగా తగ్గించారు. అయినా మంచి వసూళ్లనే ఈ మూవీ సొంతం చేసుకున్నది.
తెలుగులో ఇదే హయ్యెస్ట్….
ఓవరాల్‌గా ఫుల్ థియేట్రికల్ రన్‌లో 4.35 కోట్ల గ్రాస్‌తో తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా సలార్ నిలిచింది. అత్యధికంగా ఆంధ్రాలో కోటి డెబ్బై ఐదు లక్షలు, నైజాంలో కోటి డెబ్బై లక్షల వరకు ఈ సినిమాకు వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఓవర్‌సీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో యాభై లక్షల వరకు వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
ఏడో సినిమా…
సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. కన్నడ మూవీ ఉగ్రమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన సలార్ 700 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. 2023లో తెలుగులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా ఇండియా వైడ్‌గా హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఏడో సినిమాగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది.
యాక్షన్ ఎపిసోడ్స్…
సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా….పృథ్వీరాజ్‌సుకుమారన్, జగపతిబాబు, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్, అతడిపై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఎలివేషన్లు బాగున్నా…ప్రశాంత్ నీల్ స్టోరీ, టేకింగ్‌పై మాత్రం విమర్శలొచ్చాయి.
ఎన్టీఆర్‌తో సినిమా…
సలార్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్‌కు సలార్ 2 శౌర్యంగపర్వం అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తోన్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా పూర్తయిన తర్వాతే సలార్ 2 షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. వీటితో పాటు కల్కి 2 లో నటిస్తోన్నాడు.
సంబంధిత కథనం