




Best Web Hosting Provider In India 2024

Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విచారణ ముగింపు దశకు, తృటిలో ప్రాణాలతో బయటపడిన మరో వీడియో వైరల్
Pastor Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు కీలక దశకు చేరుకుంది. పూర్తిస్థాయి నివేదికతో రేపు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మీడియాకు సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్ కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. ట్రక్ ను తప్పించబోయి పడిపోయిన వీడియో వెలుగులోకి వచ్చింది.

Pastor Praveen Pagadala : హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమహేంద్రవరం సమీపంలో అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయలుదేరిన ఆయన రాజమండ్రి సమీపంలో రోడ్డు పక్కన విగతజీవిగా పడిఉన్నారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం పలువురి నుంచి అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే మార్గంలో ప్రవీణ్ పగడాల ఎక్కడెక్కడ ఆగారు…ప్రయాణానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు కీలకంగా మారాయి. ప్రయాణ మార్గంలో ఆయన పలుమార్లు ప్రమాదానికి గురయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది. పూర్తిస్థాయి నివేదికలతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రేపు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఫోరెన్సిక్ ఆధారంగా పోస్టుమార్టం రిపోర్టును పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్ లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఆసుపత్రి సూపరింటెండెంట్ అందజేశారు. ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సుమారు 200 సీసీ కెమెరాలు నుంచి సేకరించిన 13 గంటల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.
సోషల్ మీడియోలో వీడియోలు వైరల్
అయితే పాస్టర్ ప్రవీణ్ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మద్యం దుకాణంలో ప్రవీణ్ ను పోలినటువంటి వ్యక్తి లిక్కర్ కొనుగోలు చేయడం, బైక్ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై పోలీసులు స్పందించలేదు. పాస్టర్ ను హత్య చేశారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీరికి పోలీసులు నోటీసులు ఇచ్చి, ఆధారాలు ఉంటే ఇవ్వాలని విచారణకు పిలుస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్ద ఇటీవల పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీకెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు ఓ అంచనాకు రానున్నారు. అయితో పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేశారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సహా పలువురు పాస్టర్ ను బహిరంగంగా విమర్శలు చేశారు. వీరికి పోలీసులు నోటీసులు ఇచ్చి, ఆధారాలు ఉంటే తమ దర్యాప్తునకు సహకరించాలని కోరారు. అయితే వీరి నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. ప్రవీణ్ పగడాల మృతిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తించామని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ చెప్పారు. వారందరికీ నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తున్నామన్నారు.
మరో వీడియో వైరల్-తృటిలో తప్పిన ప్రమాదం
పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో పాస్టర్ ప్రవీణ్ ఓ లారీ ట్యాంకర్ ను ఢీకొట్టబోయి కిందపడిపోయాడు. ఈ ఘటనలో పాస్టర్ ప్రవీణ్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ట్యాంకర్ వెనుక టైర్ కింద పడబోయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదాల దృశ్యాలు, స్థానికులు వచ్చి ఆయనను పక్కకు తీయడం సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోతో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం అయ్యాయనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ పాస్టర్ల సంఘం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇవాళ వీరు హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు.
సంబంధిత కథనం
టాపిక్