



Best Web Hosting Provider In India 2024

Avoid Tomatoes: టమోటోలు అందరూ తినవచ్చు అనుకుంటున్నారా? ఈ వ్యాధి ఉన్నవారు టమోటోలను తింటే ఎంతో ప్రమాదం
Avoid Tomatoes: టమాటోలతో వండిన కూరలు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. బిర్యాని నుంచి చేపల వరకు ప్రతికూరలో టమాటో ముక్క పడాల్సిందే. అయితే టమోటోలు కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు తినకూడదు. చాలా ప్రమాదకరం.

టమోటోలకు భారతీయ ఇళ్లల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి వంటకంలో టమోటోలను వినియోగిస్తూనే ఉంటారు. ఇవి ఆహార రుచిని పెంచడంతోపాటు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. అయితే టమోటోలను కొంతమంది తినకూడదు. వారే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు.
టమోటాలు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి అన్నది నిజమే. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మాన్ని మెరిపించడం, కంటిచూపును మెరుగుపరచడం వంటి విషయాల్లో ఎంతో సహాయపడతాయి. టమోటోలు ప్రతిరోజూ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాదు టమోటాలు తక్కువ ధరకే లభిస్తూ పేదవాడి ఆహారంగా కూడా మారాయి. అయితే కిడ్నీ రోగులు మాత్రం టమోటోలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతూ వస్తోంది. కిడ్నీ రోగులు టమోటోలు తినడం ఎంతో హానికరం. ఎందుకంటే టమోటోలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. మూత్రపిండ రోగులకు ఇది ఎంతో హాని కలిగిస్తుంది. మూత్రపిండ రోగులు శరీరం నుండి అదనపు పొటాషియంను తొలగించలేరు. దీనివల్ల పొటాషియం పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఇలా పొటాషియం పెరగడం వల్ల గుండెకు సమస్యలు వస్తాయి. కాబట్టి కిడ్నీ రోగులు టమోటోలు తినకుండా ఉంటేనే మంచిది.
వీరు కూడా టమాటోలు తినకూడదు
కేవలం కిడ్నీ సమస్యలతో బాధపడుతూనే వారే కాదు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారు కూడా టమోటోలకు దూరంగా ఉండాలి. టమోటాల్లో ఉండే సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్ వంటివి గ్యాస్ట్రిక్ సమస్యను పెంచేస్తాయి. దీన్ని తిన్న తర్వాత ఎసిడిటీ మొదలయిపోతుంది. మీకు గుండెల్లో మంట, పొట్టలో గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతుంటే టమాటోలు వేసిన ఆహారాన్ని దూరం పెట్టండి.
కీళ్ల నొప్పులు
ఆర్థరైటిస్ వంటి కీళ్లనొప్పులకు వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా అధికంగానే ఉన్నారు. కానీ వారికి తెలియకుండానే వారు తమతో తినడం ద్వారా ఆ నొప్పులను పెంచేసుకుంటున్నారు. టమోటోలలో సోలనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తింటే కీళ్ల నొప్పులు పెరిగిపోతాయి. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు పూర్తిగా టమోటోలకు దూరంగా ఉంటే ఉత్తమం. సోలనిన్ శరీరంలో క్యాల్షియం శోషణను తగ్గించేస్తుంది. దీనివల్ల ఎముకలు బలహీన పడతాయి. కీళ్ల నొప్పులు మొదలవుతాయి. కాబట్టి ఎముక సమస్యలు కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు టమోటాలుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
అలెర్జీలు ఉన్నా
టమోటోలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అయితే ఆ ప్రోటీన్లు అందరికీ సరిపడాలన్న నియమం లేదు. కొంతమందిలో అలెర్జీకి కారణం అవుతుంది. టమోటోలు తిన్న వెంటనే మీకు చర్మంపై దద్దుర్లు, దురద వంటివి వస్తే మీకు టమాటో పడడం లేదని అర్థం చేసుకోవాలి. మరికొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే శరీర భాగాల్లో ఎక్కడైనా వాపు కూడా కనిపించవచ్చు. ఇవన్నీ కూడా టమోటోలు మీకు సరిపడడం లేదని చెప్పే సంకేతాలే. ఇలా కనిపించగానే మీరు వైద్యుడు సలహా తీసుకొని తగిన జాగ్రత్తలు పొందాలి. వీలైనంతవరకు టమోటోలను తగ్గించాలి. సమస్య మరీ ఎక్కువగా అనిపిస్తే టమోటాలను పూర్తిగా మానేయడమే మంచిది.
పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టమోటోలను తినక పోవడమే ఉత్తమం, లేదా తగ్గించాలి. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు మాత్రం టమోటోలను ప్రతిరోజూ తినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టమోటోలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది.
టమోటోలోని యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ నుండి మనకు రక్షణ కల్పిస్తుంది. టమోటోల్లో గుండె, మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. మగవారు కూడా ఖచ్చితంగా టమోటోను తినాలి. ఇది ప్రొస్టేట్ గ్రంధి ఆరోగ్యానికి ఎంతో అవసరం. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా టమోటోలు ఉపయోగపడతాయి. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది. ముఖ్యంగా టమాటోలు తినడం వల్ల అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక టమోటాలు తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ కె, పొటాషియం, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ సి వంటివి నిండుగా ఉంటాయి. కాబట్టి టమాటోలను ప్రతిరోజు తినాల్సిన అవసరం ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం