




Best Web Hosting Provider In India 2024

Bollywood Richest Person: బాలీవుడ్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే? 1.5 బిలియన్ డాలర్ల నెట్ వర్త్.. తెలిస్తే షాక్ అవుతారు
Ronnie Screwvala: బాలీవుడ్ లో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే? ఈ ప్రశ్నకు షారుక్ ఖాన్, స్మలాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి హీరోల పేర్లు చెబితే మీరు పప్పులో కాలేసినట్లే. వీళ్ల ముగ్గురి ఉమ్మడి ఆదాయం కంటే అతనొక్కడే సంపాదనే ఎక్కువ. తాజాగా ఫోర్బ్స్ బిలయనీర్ లిస్ట్ లో టాప్ లో నిలిచిన ఆ వ్యక్తి ఎవరంటే?

2025 సంవత్సరానికి సంబంధించిన ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాను బుధవారం (ఏప్రిల్ 2) ఆ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3028 మంది డాలర్ బిలియనీర్లను ఈ జాబితాలో పేర్కొన్నారు, వీరిలో 205 మంది భారతదేశం నుంచి ఉన్నారు. వీళ్లలో బాలీవుడ్ లోని ఏకైక బిలియనీర్, అత్యంత ధనవంతుడు ఎవరో ఇక్కడ చూసేయండి. ఒకప్పుడు టూత్ బ్రష్ లు తయారు చేసిన అతను.. ఇప్పుడు అతిపెద్ద సూపర్ స్టార్ల కంటే ధనవంతుడు.
బాలీవుడ్ లో అత్యంత ధనవంతుడు
ఫోర్బ్స్ ప్రకారం, హిందీ సినిమా రంగంలో ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన ఏకైక వ్యక్తి.. సినిమా మాగ్నేట్, వ్యాపారవేత్త రోనీ స్క్రూవాలా. ఫోర్బ్స్ కొత్త లిస్ట్ ఫ్రకారం.. ఈ మీడియా మొగల్ నికర విలువ 1.5 బిలియన్ డాలర్లు. ఇది ఆయనను ఆ రంగంలోని ప్రతి సూపర్ స్టార్ కంటే ధనవంతుడిని చేసింది,
షారూక్ ఖాన్ (770 మిలియన్ డాలర్లు), సల్మాన్ ఖాన్ (390 మిలియన్ డాలర్లు), ఆమిర్ ఖాన్ (220 మిలియన్ డాలర్లు) కలిపి ఉమ్మడ్ నెట్ వర్త్. 1.38 బిలియన్ డాలర్లు. కానీ ఇది రోనీ స్క్రూవాలా ఒక్కడి అద్భుతమైన సంపద కంటే తక్కువ. గుల్షన్ కుమార్ (సుమారు 900 మిలియన్ డాలర్లు), ఆదిత్య చోప్రా (800 మిలియన్ డాలర్లు) వంటి బాలీవుడ్ లోని ఇతర ధనవంతులైన బాలీవుడ్ సినిమా నిర్మాతలను కూడా రోనీ మించిపోయాడు.
బాలీవుడ్ జర్నీ
1956 లో బొంబాయిలో జన్మించిన స్క్రూవాలా తన వ్యాపార ప్రయాణాన్ని 70 ల చివరిలో టూత్ బ్రష్ లను తయారు చేయడం ద్వారా ప్రారంభించాడు. 80 ల ప్రారంభంలో, ఆసియా క్రీడల ద్వారా భారతదేశంలో కలర్ టీవీ వచ్చినప్పుడు, స్క్రూవాలా భారతీయ మెట్రో నగరాల్లో వీటిని ప్రవేశపెట్టి కేబుల్ టీవీ బూమ్ నుండి లాభం పొందాడు.
1990 రోనీ యూటీవీ (UTV) ని స్థాపించాడు, ఇది తరువాత యూటీవీ మోషన్ పిక్చర్స్ గా మారింది. తరువాతి రెండు దశాబ్దాలలో ఈ నిర్మాణ సంస్థలు స్వదేశ్, రంగ్ దే బసంతి, ఖోస్లా కా ఘోస్లా, జోధా అక్బర్, ఫ్యాషన్, ఢిల్లీ బెల్లి, బర్ఫీ వంటి ఐకానిక్ చిత్రాలను.. శాంతి, హిప్ హిప్ హుర్రే, షక లక బూమ్ బూమ్, ఖిచ్డి. శరారత్ వంటి టీవీ షోలను అందించింది.
2012 లో రోనీ.. యూటీవీని డిస్నీకి బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా అమ్మేశాడు. ఐదు సంవత్సరాల తరువాత ఆర్ఎస్వీపీ మూవీస్ ను ఏర్పాటు చేశాడు. కేదార్నాథ్, ఉరి, ది స్కై ఇస్ పింక్, సామ్ బహదూర్ వంటి చిత్రాలను నిర్మించాడు. 2024 లో స్క్రూవాలా.. షార్క్ ట్యాంక్ ఇండియాలోని షార్క్ లలో ఒకరిగా తెరంగేట్రం చేశాడు.
సినిమా మాత్రమే రోనీ స్క్రూవాలా యొక్క ఏకైక ఆదాయ మార్గం కాదు. 68 ఏళ్ల ఈ వ్యక్తి అనేక ఇతర స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టాడు, వాటిని స్థాపించాడు, ముఖ్యంగా అప్ గ్రేడ్, యునిలేజర్, యుస్పోర్ట్స్. ఈ కంపెనీల విజయం, సినిమా వ్యాపారం రోనీ ఆదాయాన్ని అమాంతం పెంచేశాయి.
సంబంధిత కథనం