Daily Watermelon: ప్రతిరోజూ సగం పుచ్చకాయ తినేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఇవే

Best Web Hosting Provider In India 2024

Daily Watermelon: ప్రతిరోజూ సగం పుచ్చకాయ తినేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఇవే

Haritha Chappa HT Telugu
Published Apr 02, 2025 06:30 PM IST

Daily Watermelon: వేసవిలో పుచ్చకాయ తినడం చాలా అవసరం. పుచ్చకాయ తినడం వల్ల మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంతేకాదు శరీరానికి ఇంకెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ప్రతిరోజూ సగం పుచ్చకాయ తింటే ఎంతో ఆరోగ్యం
ప్రతిరోజూ సగం పుచ్చకాయ తింటే ఎంతో ఆరోగ్యం (Pixabay)

పుచ్చకాయలు వేసవికాలంలో మాత్రమే దొరుకుతాయి. కాబట్టి మీరు కచ్చితంగా వేసవిలో తినాల్సిన పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.

మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడేలా యాంటీ ఆక్సిడెంట్లను, ఖనిజాలను, విటమిన్లను అందిస్తుంది. ముఖ్యంగా పుష్కలంగా నీటిని ఇస్తుంది. అందుకే పుచ్చకాయను తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండడమే కాదు. అనేక వ్యాధుల నుండి కూడా రక్షణ లభిస్తుంది.

పుచ్చకాయను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. మీడియం సైజ్ లో ఉండే ఒక పుచ్చకాయను తెచ్చి అందులో సగం ముక్కను ఒకరోజులో తినేయవచ్చు. ఇలా ప్రతిరోజు పుచ్చకాయలో సగం ముక్క తినడం వల్ల మీ శరీరంలో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో, ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి.

వడదెబ్బ తగలదు

పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. ఇది శరీరంలో హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది. అంటే శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. మీకు వేసవిలో నీరు తాగాలనిపించకపోతే వెంటనే అర ముక్క పుచ్చకాయను తినేయండి. వడదెబ్బ తగలదు. పైగా నీటి అవసరం తీరిపోతుంది. శరీరంలో నీటి కొరత కూడా ఏర్పడదు. అంతేకాదు శరీరంలో ఉన్న విషాలను, వ్యర్ధాలను బయటకు పంపడంలో పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది.

రక్తపోటును తగ్గిస్తుంది

రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతి రోజూ పుచ్చకాయను తింటే ఎంతో మంచిది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడానికి సహాయపడతాయి. వేసవిలో వీలైనంతవరకు ప్రతిరోజూ పుచ్చకాయ ముక్కలు ఎక్కువగా తినేందుకు ప్రయత్నించండి. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని అదనపు సోడియంను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ఎప్పుడైతే సోడియం తగ్గుతుందో శరీరంలో పేర్కొన్న నీరు మొత్తం బయటికి పోతుంది.

ప్రతిరోజూ అరముక్క పుచ్చకాయను తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పుచ్చకాయలో విటమిన్ సి, కెరటనాయిడ్లు, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరకణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. ఇక పుచ్చకాయ లోపల ఎరుపు రంగు వచ్చేది లైకోపీన్ అనే సమ్మేళనం వల్ల. ఈ లైకోపీన్ అనేది గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశం వరకు తగ్గుతుంది.

మధుమేహం ఉన్నవారు

అయితే పుచ్చకాయలు సహజ చక్కెరను కలిగి ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్న వ్యక్తులు అధికంగా తినకూడదు. రోజుకు రెండు ముక్కలు తినడం వల్ల ఎలాంటి సమస్యా రాదు. అంతకుమించి ఎక్కువ తింటే ఆ చక్కెరలు వారిలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేస్తాయి.

గుండెపోటు, ఆస్తమా, క్యాన్సర్ వంటివన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. ఈ వ్యాధుల ప్రమాదం తగ్గాలంటే ప్రతిరోజు పుచ్చకాయను తినేందుకు ప్రయత్నించండి. ఇక పుచ్చకాయను తినడం వల్ల చర్మం కూడా మెరిసిపోతుంది. చర్మాన్ని అందంగా ఉంచడంలో పుచ్చకాయలోని పోషకాలు ముందుంటాయి. ఇవి శరీరాన్ని కూడా శుద్ధి చేస్తాయి. వ్యాయమం చేసిన తర్వాత కండరాలు నొప్పి పెడుతూ ఉంటాయి. ఆ కండరాల నొప్పి తగ్గాలంటే పుచ్చకాయను తినాలి.

ఇక జీవక్రియను మెరుగుపరచడంలో పుచ్చకాయ ముందుంటుంది. దీనిలో నీరు అధికంగా ఉంటుంది. కాబట్టి జీవక్రియ కూడా సవ్యంగా సాగుతుంది. పుచ్చకాయ రసంలో కేలరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి బరువు పెరుగుతామన్న భయం కూడా లేదు. హ్యాపీగా దీన్ని తినవచ్చు.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024