




Best Web Hosting Provider In India 2024

Malayalam Comedy OTT: ఓటీటీలోకి మలయాళం కామెడీ మూవీ.. భార్యా బాధితుడి కష్టాలు చూస్తారా?
Malayalam Comedy OTT: ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన మలయాళం కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మంజుమ్మెల్ బాయ్స్ మూవీలో నటించిన సౌబిన్ షాహిర్ లీడ్ రోల్లో, భార్యా బాధితుడిగా నటించిన సినిమా ఇది.

Malayalam Comedy OTT: మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో హిట్స్ కంటే డిజాస్టర్లే ఎక్కువ. అలాంటి డిజాస్టర్ కామెడీ మూవీయే మాచంటే మాలఖ (Machante Maalakha). ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.
మాచంటే మాలఖ ఓటీటీ రిలీజ్ డేట్
మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఈ మాచంటే మాలఖ. ఈ మూవీ ఏప్రిల్ 4 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ప్రైమ్ వీడియో, సైనా ప్లేలలో మూవీ వస్తుందని భావించినా.. మనోరమ మ్యాక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.
కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 27న రిలీజ్ కాగా.. ఇప్పుడు సుమారు నెలన్నర రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.
మాచంటే మాలఖ మూవీ స్టోరీ ఇదీ..
మాచంటే మాలఖ మూవీలో సజీవన్ అనే ఓ బస కండక్టర్ పాత్రలో సౌబిన్ షాహిర్ నటించాడు. ఓ భార్య బాధితుడి పాత్ర ఇది. అతడు తన బస్ లోనే తరచూ ప్రయాణించే అమ్మాయినే పెళ్లి చేసుకొని కష్టాలు పడుతుంటాడు. తన పెళ్లి, ఆ తర్వాత జీవితం గురించి ఎన్నో కలలు కనే అతడు.. ఆ కలలు కల్లలవడంతో షాక్ తింటాడు.
తరచూ తనతో గొడవలు పడే భార్య దొరకడంతో అతని పరిస్థితి దారుణంగా మారుతుంది. అసలు వీళ్ల మధ్య గొడవలకు కారణమేంటి? వాళ్ల జీవితంలోకి లాయర్ గా వచ్చిన వ్యక్తి ఎవరు? ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నదే ఈ మూవీ స్టోరీ.
మాచంటే మాలఖ మూవీలో సౌబీన్ షాహిర్‌తో పాటు నమితా ప్రమోద్, ధ్యాన్ శ్రీనివాసన్, దిలీష్ పోతన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు బోబన్ శామ్యూల్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మలయాళం మూవీ నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకున్నది. సౌబీన్ షాహిర్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
సంబంధిత కథనం