




Best Web Hosting Provider In India 2024

Best Horror Movies on Aha OTT: ఆహా ఓటీటీలో ఉన్న టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్ ఇవే..
Best Horror Movies on Aha OTT: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన ఆహా వీడియో ఓటీటీలో కొన్ని భయపెట్టే బెస్ట్ హారర్ మూవీస్ ఉన్నాయి. వాటిలో టాప్ 5 మూవీస్ ఏవో ఇక్కడ చూడండి.

Best Horror Movies on Aha OTT: హారర్, హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ తెలుగులో ఆహా వీడియో ఓటీటీలో ఇలాంటి మూవీస్ ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని నేరుగా వచ్చినవి కాగా.. మరికొన్ని వివిధ భాషల డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. మరి వాటిలో మస్ట్ వాచ్ హారర్ మూవీస్ ఏవో చూసేయండి.
ఆహా వీడియో ఓటీటీలోని హారర్ మూవీస్
105 మినట్స్
హన్సిక నటించిన సింగిల్ క్యారెక్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆహా వీడియోతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులో ఉంది. ఈ సింగిల్ క్యారెక్టర్ మూవీకి రాజు దుస్సా దర్శకత్వం వహించాడు. జాను (హన్సిక) అనుకోని పరిస్థితుల్లో ఓ అదృశ్య శక్తి కారణంగా తన ఇంట్లోనే బందీగా మారుతుంది. జానును చంపాలని ఆ అదృశ్య శక్తి ఎందుకు ప్రయత్నిస్తుంది? జానుపై ఆ శక్తి పగ పట్టడానికి కారణం ఏమిటి? ఆ అదృశ్య శక్తి బారి నుంచి జాను తప్పించుకుందా? లేదా అన్నదే ఈ మూవీ కథ.
కాజల్ కార్తీక
కాజల్ కార్తీకను ఓ ఆంథాలజీ హారర్ మూవీగా దర్శకుడు డీకే తెరకెక్కించాడు. మొత్తం ఆరు కథలతో ఈ హారర్ మూవీ సాగుతుంది. ఈ కథలన్నీ చాలా వరకు లాక్‌డౌన్ నేపథ్యంలోనే సాగుతాయి. ఈ కథల్లో కొన్నింటిని సీరియస్ హారర్ ఎలిమెంట్స్ తో నడిపించాడు డైరెక్టర్. భవిష్యత్తును ఊహించే శక్తి ఉన్న కార్తీక ను ఊరి ప్రజలే ఎందుకు చంపేశారు? తన మరణానికి కారణమైన అప్పలనాయుడుపై కార్తీక ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది అన్నదే కాజల్ కార్తీక మూవీ కథ.
భార్గవి నిలయం
ఓ ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ రచయిత ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడన్నదే భార్గవి నిలయం మూవీ కథ. ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్టరీని బషీర్ ఎలా బయటపెట్టాడు? భార్గవి, శివకుమార్ ప్రేమ విఫలం కావడానికి నారాయణన్ అలియాస్ నాన్ కుట్టీకి ఎలాంటి సంబంధం ఉంది? తనకు జరిగిన అన్యాయంపై భార్గవి ఎలా రివేంజ్ తీర్చుకుంది అన్నదే భార్గవి నిలయం కథ.
పిండం
పాడుబడిన పాత ఇంట్లోకి హీరో ఫ్యామిలీ రావడం, అందులో ఆత్మలు ఉండటం, వాటి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం అన్నది హారర్ సినిమాల్లో ఎవర్‌గ్రీన్ ఫార్ములా. పిండం ఆ కోవకు చెందిన సినిమానే. ఇందులో ఆంథోనీ పాత్రలో శ్రీరామ్ నటించాడు. తన కుటుంబంతో కలిసి ఓ ఇంట్లోకి దిగిన ఆంథోనీ ఫ్యామిలీని ఆత్మలు ఆవహిస్తాయి. దీనికి కారణం ఏంటి? అందులో నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడుతుందన్నదే ఈ పిండం స్టోరీ.
మసూద
కొత్త పాయింట్‌తో రియలిస్టిక్ హారర్ థ్రిల్లర్ సినిమాగా దర్శకుడు సాయికిరణ్ మసూద కథను రాసుకున్నాడు. మసూద కోసం దర్శకుడు ఇస్లాం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం బాగుంది. హారర్ సినిమాలు ఎక్కువగా హిందు, క్రిస్టియన్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంటాయి. అదే మసూద సినిమాకు ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చింది.
ఇవే కాకుండా ఆహా వీడియో ఓటీటీలో తంత్ర, 7/జీ, కళింగ, తరువాత ఎవరు, లిసా, రేయికి వేయికళ్లులాంటి ఇతర హారర్ సినిమాలు కూడా ఉన్నాయి.
సంబంధిత కథనం