




Best Web Hosting Provider In India 2024

AP Bars e-Auction : ఏపీలో 44 బార్లకు ఈ-వేలం, దరఖాస్తు దాఖలకు గడువు ఏప్రిల్ 7- పూర్తి వివరాలివే
AP Bars e-Auction :ఏపీలో 44 బార్లకు ఈ-వేలం వేసేందుకు ఎక్సెజ్ శాఖ నిర్ణయించింది.దరఖాస్తులకు ఏప్రిల్ 7వ తేదీ చివరి తేదీ. రాష్ట్రంలో లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

AP Bar e-Auction : రాష్ట్రంలో 44 బార్లకు ఈ-వేలం వేసేందుకు రాష్ట్ర ఎక్సెజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిర్ణయించింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు గడువు ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సెజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ నిషికాంత్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 44 బార్లను ఈవేలం, ఆన్‌లైన్ లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. బార్ల లైసెన్సులు తీసుకునేందుకు ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఏప్రిల్ 7వ తేదీతో ముగుస్తుంది. అభ్యర్థులు తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుము(నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు)ను ఏప్రిల్ 8లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా వేలం సొంత చేసుకున్న అభ్యర్థికి ఏప్రిల్ 9న బార్‌ను కేటాయిస్తారు.
షెడ్యూల్
1. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రొసెసింగ్ ఫీజు చెల్లింపుకు గడువు- ఏప్రిల్ 7, సాయంత్ర 5 గంటలు
2. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లింపుకు గడువు – ఏప్రిల్ 8, సాయంత్రం 5 గంటలు
3. దరఖాస్తుల పరిశీలన- ఏప్రిల్ 8
4. బిడ్డింగ్ (ఆయా జిల్లాల్లో)- ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
5. రివైజ్డ్ బిడ్డింగ్- ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
జనాభా ఆధారంగా ఫీజు ఇలా ?
1. 50 వేల జనాభా వరకు రూ.5 లక్షలు
2. 50 వేల నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.7.50 లక్షలు
3. ఐదు లక్షలకు పైగా జనాభా ఉంటే రూ.10 లక్షలు
అప్లోడ్ చేయాల్సిన ధృవీకరణ పత్రాలు
1. అప్లికేషన్ ఫీజు చలానా
2. బార్ పెట్టే ప్రాంగణం ప్లాన్
3. ఆధార్ కార్డు
4. ఇటీవలి తీసుకున్న పాస్‌పోర్టు సైజ్ ఫోటో
5. బారు పెట్టే ప్రాంగణం అద్దెకు తీసుకుంటే యజమాని సమ్మతి లేఖ
అన్ని అప్లొడ్ చేసిన తరువాత అప్లికేషన్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తరువాత అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్తుంది.
వేలానికి వీరు అనర్హులు
21 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు వేలంలో పాల్గొనేందుకు అనర్హులు. అలాగే ఎక్సేజ్ కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా అనర్హులే. ఒకరి తరపున మరొకరు బిడ్ చేయడానికి లేదు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వేలం జరుగుతుంది.
రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి?
1. దరఖాస్తు దారుడు, బిడ్డర్ అధికారి వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://apcpe.aptonline.in/CPEBLA/Views/citizen/index.aspx ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది.
2. అందులో E1 ఫారం నింపాలి.
3. అలాగే R1 ఫారంలో రిజిస్ట్రర్ కావాలి.
4. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు చెల్లించాలి.
5. ఒకవేళ ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ బార్లకు వేలంలో పాల్గొనాలంటే, ప్రతి బార్‌కు ఒక అప్లికేషన్ ఫీజు ప్రొసెసింగ్ ఫీజు చెల్లించాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్