


Best Web Hosting Provider In India 2024

OTT Tamil Comedy Movie: మరో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ కామెడీ మూవీ.. తారుమారైన వారసులు
OTT Tamil Comedy Movie: సూపర్ హిట్ తమిళ కామెడీ మూవీ 50 రోజుల్లోనే రెండో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. అప్పుడే పుట్టిన శిశువులు తారుమారయ్యే ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

OTT Tamil Comedy Movie: తమిళ కామెడీ సినిమాలంటే ఇష్టమా? అయితే మీ కోసమే ఇప్పుడో కామెడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు బేబీ అండ్ బేబీ. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. గతంలోనే ఓ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు రెండో ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెడుతోంది.
బేబీ అండ్ బేబీ ఓటీటీ రిలీజ్ డేట్
జై, సత్యరాజ్ లాంటి తమిళ యాక్టర్స్ నటించిన మూవీ బేబీ అండ్ బేబీ. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమా ఏప్రిల్ 4 నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే సన్ నెక్ట్స్ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. మార్చి 21 నుంచే ఈ మూవీ అందులో స్ట్రీమింగ్ అవుతోంది. నవ్వుల వినోదం పక్కా అంటూ ఆ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ ను కూడా ట్వీట్ చేసింది.
బేబీ అండ్ బేబీ మూవీ స్టోరీ ఏంటంటే?
బేబీ అండ్ బేబీ ఓ తమిళ కామెడీ డ్రామా. జై, సత్యరాజ్ నటించారు. ఈ సినిమా రెండు జంటల చుట్టూ తిరుగుతుంది. వీళ్లు తమకు అప్పుడే పుట్టిన బిడ్డలను వాళ్ల తాతానాన్నమ్మలకు చూపించాలనుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల్లో ఈ ఇద్దరు బిడ్డలు తారుమారవుతారు.
ఆ తర్వాత వాళ్లలో ఒకరిని తమ కోట్ల ఆస్తికి వారసుడిగా ప్రకటిస్తారు. అది చూసి ఆ కుటుంబంలోని ఓ జంట కుళ్లుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లాడిని వారసుడు కాకూడదని వాళ్లు అనుకుంటారు. తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడాలి.
ఈ బేబీ అండ్ బేబీ మూవీలో జై, సత్యరాజ్ తోపాటు యోగి బాబు, ప్రగ్యా నాగ్రా, సాయి ధన్య ముఖ్యమైన పాత్రల్లో నటించారు. యువరాజ్ మూవీని నిర్మించాడు. ఈ బేబీ అండ్ బేబీ సినిమాకు తమిళ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టిన మూవీ.. ఇప్పుడు ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.
సంబంధిత కథనం