




Best Web Hosting Provider In India 2024

OTT Movies: హారర్ థ్రిల్లర్, హిస్టారికల్ నుంచి కామెడీ వరకు.. ఈనెలలో ఓటీటీల్లో టాప్-5 బాలీవుడ్ చిత్రాలు
OTT Hindi releases in April: ఓటీటీల్లో ఈనెల అదిరిపోయే హిందీ సినిమాలు రానున్నాయి. ఐదు చిత్రాలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. ఛావా మూవీ కూడా ఇదే నెలలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ హారర్ థ్రిల్లర్ నేరుగా ఎంట్రీ ఇవ్వనుంది.

ఈనెల (ఏప్రిల్)లో ఓటీటీల్లో హిందీలో సినిమాలు చూడాలనుకునే వారికి అదిరిపోయే ఆప్షన్లు రానున్నాయి. వివిధ జానర్లలో ఐదు బాలీవుడ్ చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. బ్లాక్‍బస్టర్ మూవీ ఛావా కూడా ఓటీటీలోకి వచ్చేయనుంది. రెండు చిత్రాలు డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈనెల ఓటీటీల్లోకి రానున్న టాప్-5 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
చోరీ 2
హిందీ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘చోరీ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన చోరీ చిత్రానికి సీక్వెల్‍గా ఇది వస్తోంది. చోరీ 2 సినిమాలో నుష్రత బరుచా, సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. దుష్టశక్తి నుంచి తన కూతురిని తల్లి కాపాడాలనుకునే ప్రయత్నాలు చుట్టూ ఈ మూవీ సాగుతుంది. చోరీ 2 చిత్రాన్ని ఏప్రిల్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
లవ్‍యాపా
రొమాంటిక్ కామెడీ మూవీ లవ్‍యాపా సినిమా ఏప్రిల్‍లోనే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 4న జీ5 ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ హీరోయిన్‍గా నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన లవ్‍యాపా మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలై డిజాస్టర్ అయింది. తమిళ మూవీ లవ్ టుడేకు హిందీ రీమేక్‍గా ఈ సినిమా తెరకెక్కింది.
ఛావా
బ్లాక్‍బస్టర్ పీరియడ్ యాక్షన్ మూవీ ‘ఛావా’ కూడా ఏప్రిల్‍లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ రెండో వారంలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. డేట్‍పై ప్రకటన రావాల్సి ఉంది. ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఛావా చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ రూ.780కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. ఈనెలలోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది.
జువెల్ థీఫ్
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన జువెల్ ఆఫ్ థీఫ్ చిత్రం ఏప్రిల్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డైరెక్ట్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఓ వజ్రం దొంగతనం చుట్టూ ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సాగుతుంది. జువెల్ థీఫ్ మూవీకి కూకీ గులాటీ, రాబీ గరేవాల్ దర్శకత్వం వహించారు.
సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్
సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమా ఏప్రిల్‍లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇంకా స్ట్రీమింగ్ డేట్ ఖరారు కాలేదు. ఆదర్శ్ గౌరవ్, వినీత్ కుమార్ సింగ్, శశాంక్ అరోరా, అనూజ్ సింగ్ లీడ్ రోల్స్ చేసిన ఈ కామెడీ డ్రామా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను డైరెక్టర్ రీమా కగ్టి తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెలలోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. త్వరలోనే డేట్ వెల్లడయ్యే అవకాశం ఉంది.
సంబంధిత కథనం