




Best Web Hosting Provider In India 2024

Most Watched Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ సంచలనం.. వ్యూస్‌లో సరికొత్త రికార్డు
Most Watched Web Series: నెట్‌ఫ్లిక్స్ లో క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన సిరీస్ ల జాబితాలో టాప్ 10లోకి దూసుకురావడం విశేషం.

Most Watched Web Series: కేవలం నాలుగు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఒకటి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది. ఈ క్రైమ్ డ్రామా సిరీస్ పేరు అడొలెసెన్స్ (Adolescence). ఈ ఓటీటీలో ఇప్పటి వరకూ ఎంతో పేరుగాంచిన రెండు వెబ్ సిరీస్ లను తాజాగా ఈ అడొలెసెన్స్ వెనక్కి నెట్టింది. వ్యూయర్‌షిప్ పరంగా స్ట్రేంజర్ థింగ్స్ 3, బ్రిడ్జర్టన్ సీజన్ 2 కిందికి పడిపోయాయి.
అడొలెసెన్స్ రికార్డు వ్యూస్
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ అడొలెసెన్స్. ఈ సిరీస్ ఇప్పటికే 96.7 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ ఆల్ టైమ్ బెస్ట్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ 9వ స్థానానికి దూసుకురావడం విశేషం. దీంతో 94.3 మిలియన్ల వ్యూస్ తో స్ట్రేంజర్ థింగ్స్ 10వ స్థానానికి పడిపోగా.. బ్రిడ్జర్టన్ సీజన్ 2 93.8 మిలియన్ల వ్యూస్ తో 11వ స్థానానికి చేరింది.
అంతేకాదు అడొలెసెన్స్ వెబ్ సిరీస్ కేవలం 17 రోజుల్లోనే ఈ 96.7 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. నిజానికి నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో ఉన్న వెబ్ సిరీస్ లలో 91 రోజుల వ్యూస్ రికార్డు చేసినవే. ఆ లెక్కన అడొలెసెన్స్ వెబ్ సిరీస్ కు మరో రెండు నెలలకుపైగా సమయం ఉంది. ఈ క్రమంలో ఆ సిరీస్ మరే స్థాయికి చేరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లిష్ కేటగిరీలో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ వెడ్నస్‌డే సీజన్ 1. ఈ సిరీస్ కు ఏకంగా 252 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.
అడొలెసెన్స్ వెబ్ సిరీస్ గురించి..
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అడొలెసెన్స్ వెబ్ సిరీస్ లో కేవలం నాలుగే ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే ఒక ఎపిసోడ్ మొత్తాన్ని సింగిల్ టేక్ లోనే షూట్ చేయడం విశేషం. అంటే సిరీస్ మొత్తం ఎలాంటి కట్స్, ఎడిటింగ్ లేకుండా ఒకే షాట్ లో అలా సాగుతూ వెళ్తుంది. ఈ ప్రత్యేకతతోనే అడొలసెన్స్ వెబ్ సిరీస్ ను చూసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఈ సిరీస్ ఓ 13 ఏళ్ల స్టూడెంట్ జేమీ మిల్లర్ (ఓవెన్ కూపర్) చుట్టూ తిరుగుతుంది. అతడు తన క్లాస్‌మేట్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అవుతాడు. తాను ఏ నేరం చేయలేదని అతడు వాదిస్తాడు. కానీ సాక్ష్యాధారాలు మాత్రం అతనికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఈ కేసు నుంచి బయటపడతాడా? అతని తల్లిదండ్రుల పోరాటం ఏంటి? సమాజం నుంచి వాళ్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారన్నది ఇందులో చూడొచ్చు.
మిగిలిన వెబ్ సిరీస్ లకు భిన్నంగా ఇది కేవలం నాలుగు ఎపిసోడ్లతోనే వచ్చింది. ఒక్కో ఎపిసోడ్ ను ఒకే షాట్ లో తీయడం అంటే మాటలు కాదు. అందులోని నటీనటులంతా దీనికి తగినట్లుగా అద్భుతంగా నటించారు. ఈ సిరీస్ లో కెమెరా ఎప్పుడూ ప్రతి పాత్రనూ ఫాలో అవుతూనే ఉంటుంది.
సంబంధిత కథనం