




Best Web Hosting Provider In India 2024

OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత వస్తున్న మలయాళం థ్రిల్లర్.. 650 కోట్ల వసూళ్ల మూవీ టైటిల్‌తోనే..
OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. 2023లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.650 కోట్లు వసూలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ టైటిలే ఈ మూవీ టైటిల్ కావడం విశేషం.

OTT Malayalam Thriller Movie: మలయాళం థ్రిల్లర్ మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఏడాదిన్నరగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ దొరక్క డిజిటల్ ప్రీమియర్ కు నోచుకోని ఈ సినిమా పేరు జైలర్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ సమయంలోనే ఈ మూవీ కూడా రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ మూవీని.. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకోలేదు. ఏడాదిన్నర తర్వాత మనోరమ మ్యాక్స్ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకొని స్ట్రీమింగ్ తేదీని బుధవారం (ఏప్రిల్ 2) వెల్లడించింది. సక్కిర మడతిల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
జైలర్ మూవీ స్టోరీ ఏంటంటే?
ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ జైలర్ ఓ నిజ జీవిత కథ. 1950లలోని కేరళలో ఓ జైలర్ జీవితం ఆధారంగా రూపొందించారు. హత్య కేసుల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవించే ఖైదీలకు పునరావాసం కల్పించే జైలర్ కథ ఇది. ఈ క్రమంలో ఆ జైలర్ ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివో ఈ సినిమా చూపించే ప్రయత్నం చేసింది.
స్టోరీ, లీడ్ యాక్టర్ ధ్యాన్ శ్రీనివాసన్ నటనకు ప్రశంసలు దక్కినా.. ఈ స్టోరీని తెరపై చూపించిన విధానం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో మూవీ బోల్తా పడింది. ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్ తోపాటు మనోజ్ కే జయన్, శ్రీజిత్ రవి, బిను అడిమాలి, నవస్ వల్లికున్ను, తిజు మాథ్యూ, ఉన్ని రాజా, దివ్య పిళ్లైలాంటి వాళ్లు నటించారు.
జైలర్ వర్సెస్ జైలర్
ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ జైలర్ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ రిలీజ్ సమయంలోనే థియేటర్లలోకి వచ్చింది. రజనీ మూవీ రూ.650 కోట్లు వసూలు చేయగా.. ఈ జైలర్ మాత్రం ఫ్లాపయింది. నిజానికి రజనీ జైలర్ కంటే ముందే ఈ మలయాళం జైలర్ తన టైటిల్ ను రిజిస్టర్ చేసుకుంది.
దీంతో రజనీకాంత్ మూవీ టైటిల్ ను కనీసం మలయాళంలో అయినా మార్చాలని ఆ మూవీ మేకర్స్ కోరారు. కానీ దానికి వాళ్లు అంగీకరించలేదు. ఇద్దరూ కోర్టు మెట్లెక్కారు. చివరికి మలయాళం జైలర్ మేకర్స్ దిగి వచ్చారు. కోర్టు బయట సెటిల్మెంట్ కు అంగీకరించారు. రజనీకాంత్ జైలర్ రిలీజైన వారం తర్వాత ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది.
అయితే అప్పటికే రజనీకాంత్ జైలర్ బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ జైలర్ కు థియేటర్లు కరవయ్యాయి. ఉన్న కాసిన్ని థియేటర్లు కూడా ఈ మూవీ ప్రేక్షకులు మెచ్చకపోవడంతో తీసేశాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆగస్ట్ 18, 2023న థియేటర్లలో రిలీజైన ఈ జైలర్ మూవీకి ఓ మోస్తరు రివ్యూలు వచ్చాయి. మొత్తానికి ఇప్పుడీ సినిమా ఏప్రిల్ 4 నుంచి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం