





Best Web Hosting Provider In India 2024
ISRO Recruitment 2025 : ఇస్రోలో అప్రెంటిస్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభం- పూర్తి వివరాలు..
ఇస్రో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఇస్రో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ని ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు isro.gov.in ఇస్రో అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ- 2025 ఏప్రిల్ 21 అని గుర్తుపెట్టుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 75 పోస్టులను ఇస్రో భర్తీ చేయనుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదివి తెలుసుకోండి..
ఇస్రో రిక్రూట్మెంట్ 2025- అప్రెంటిస్ ఖాళీల వివరాలు..
1. ఇస్రో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ: 46 పోస్టులు
2. డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ: 15 పోస్టులు
3. డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్: 5 పోస్టులు
4. ట్రేడ్ ఐటీఐ: 9 పోస్టులు
అర్హత ప్రమాణాలు..
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
2. డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ: సంబంధిత రంగంలో గుర్తింపు పొందిన స్టేట్ బోర్డు అందించే డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
3. డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్: సంబంధిత రంగంలో గుర్తింపు పొందిన స్టేట్ బోర్డ్ ఇచ్చే డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్.
4. ట్రేడ్ ఐటీఐ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
2022, 2023, 2024 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లేదా ఇంజనీరింగ్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్, ఐటీఐ/ ట్రేడ్ డిప్లొమా హోల్డర్లు మాత్రమే అప్రెంటిస్షిప్ పొందడానికి అర్హులని గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు అప్లై చేయకూడదు.
దరఖాస్తుల పరిశీలన / స్క్రీనింగ్ చేసిన తర్వాత అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ / ఇంటర్వ్యూకు పిలుస్తారు. డిగ్రీ / డిప్లొమా స్థాయిలో అకాడమిక్ స్కోర్లు, ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా ప్యానెల్ డ్రా చేస్తారు. ఖాళీగా ఉన్న ట్రైనింగ్ పోస్టులకు అప్రెంటిస్‌లను ప్యానెల్లో వారి స్థానాన్ని బట్టి చేర్చుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా మాత్రమే సమాచారం అందిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ట్రావెల్ అలవెన్స్‌కు అనర్హులు.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ని చూడాల్సి ఉంటుంది.
వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link