




Best Web Hosting Provider In India 2024

Raghavendra Rao: ఆ హీరోయిన్ అంటే అల్లు అర్జున్ మూవీలో ఎమ్మెల్యే గుర్తొస్తుంది.. డైరెక్టర్ రాఘవేంద్రరావు కామెంట్స్
Director Raghavendra Rao On Catherine Tresa In Fani Launch: డైరెక్టర్ కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఫణి మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మూవీలోని ఓ హీరోయిన్ కేథరిన్ ట్రేసాపై రాఘవేంద్ర రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Raghavendra Rao On Catherine Tresa In Fani Launch: టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న గ్లోబల్ మూవీ “ఫణి”. ఈ థ్రిల్లర్ సినిమాను ఓఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, ఏయు అండ్ ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు.
ప్రపంచ భాషల్లో
ఫణి సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్ ట్రేసా లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. అలాగే, మహేశ్ శ్రీరామ్ కీ రోల్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో ఫణి సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఏప్రిల్ 2న హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈవెంట్‌లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా “ఫణి” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
నాకు ఇష్టమైన వాడు
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడు అన్ని దేశాల్లో ఉదయిస్తాడు. అలా ఫణి సినిమాను గ్లోబల్ మూవీగా రూపొందిస్తున్నారు వీఎన్ ఆదిత్య. ఆదిత్య నా దగ్గర పనిచేయలేదు. కానీ, నాకు ఇష్టమైన వాడు. ప్రియమైన శిష్యుడు. అతను కొత్త వాళ్లతో సినిమా చేయగలడు, స్టార్స్‌తోనూ రూపొందించగలడు” అని అన్నారు.
ఆసక్తి కలిగిస్తోంది
“వారి (వీఎన్ ఆదిత్య) సోదరి మీనాక్షి నిర్మాణంలో ఫణి సినిమా చేస్తున్నాడు. ఇక కేథరీన్ అంటే సరైనోడు (అల్లు అర్జున్ మూవీ)లో ఎమ్మెల్యే గుర్తొస్తుంది. ఇప్పుడు ఫణి సినిమాలో చేస్తుంది. అసలే ఎమ్మెల్యేతో పెట్టుకోలేం. ఫణి అంటే పాము. మరి ఏ పాముతో ఆడుకుందో. ఈ సినిమాలో ఎలాంటి రోల్‌లో కనిపిస్తుందనే అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూవీ టీమ్ అందిరికీ ఆల్ ది బెస్ట్. ఫణి సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా” అని కె రాఘవేంద్ర రావు తెలిపారు.
అల్లు అర్జున్ మూవీలో ఎమ్మెల్యేగా
ఇదిలా ఉంటే, కేథరిన్ ట్రేసా తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్‌గా అలరించింది. అల్లు అర్జున్ మాస్ లుక్‌లో నటించిన సరైనోడు మూవీలో హీరోయిన్‌గా చేసిన కేథరిన్ ట్రేసా ఎమ్మెల్యెగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్రతో కేథరిన్ ట్రేసా చాలా వరకు గుర్తుండిపోయింది. అందుకే ఎమ్మెల్యే అంటూ కేథరిన్ ట్రేసాపై డైరెక్టర్ రాఘవేంద్ర రావు అలా ఫన్నీ కామెంట్స్ చేశారు.
అనుబంధం ఏర్పడింది
ఇక ఫణి మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ ప్రెజెంటర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. “ఫణి సినిమా మేకింగ్ టైమ్‌లో మా టీమ్ అందరిలో ఒక మంచి అనుబంధం ఏర్పడింది. మిగతా ఏ సినిమాకూ దొరకని సంతోషం ఈ చిత్రంతో కలిగాయి. మా మీనాక్షిగారు మిగతా టీమ్ అంతా హ్యాపీగా మూవీ చేశాం. ఫణి సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. త్వరలోనే థియేటర్స్ ద్వారా ఘనంగా మీ ముందుకు తీసుకొస్తాం” అని పేర్కొన్నారు.
డల్లాస్‌లో
కో ప్రొడ్యూసర్ శాస్త్రి అనిపిండి మాట్లాడుతూ.. “ఓఎంజీ ప్రొడక్షన్స్‌లో కో ప్రొడ్యూసర్‌గా వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పినట్లు డల్లాస్‌లో మా ప్రొడక్షన్‌ను అనౌన్స్ చేశాం. మూవీ ప్రొడక్షన్ ఎక్సిపీరియన్స్ సంతోషంగా ఉంది. మా బ్యానర్‌లో మరిన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం” అని వెల్లడించారు.
సంబంధిత కథనం