Gunde Ninda Gudi Gantalu Serial: బాలు, మీనా రొమాన్స్ -ప్ర‌భావ‌తిని కాపాడిన స‌త్యం -రోహిణి మావ‌య్య‌కు ఊహించ‌ని స్వాగ‌తం

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: బాలు, మీనా రొమాన్స్ -ప్ర‌భావ‌తిని కాపాడిన స‌త్యం -రోహిణి మావ‌య్య‌కు ఊహించ‌ని స్వాగ‌తం

Nelki Naresh HT Telugu
Published Apr 03, 2025 08:16 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 3 ఎపిసోడ్‌లో మ‌లేషియా మావ‌య్య వ‌స్తున్నాడ‌ని తెగ హ‌డావిడి చేస్తుంది ప్ర‌భావ‌తి. అన్ని ప‌నులు మీనాకే చెప్ప‌డం చూసి ప్ర‌భావ‌తిపై సుశీల ఫైర్ అవుతుంది. మ‌రోవైపు బాలు, మీనా గొడుగు ఐడియా ఊళ్లో పాపుల‌ర్ అవుతుంది.

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 3 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 3 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial: మీనాతో ముద్దుముచ్చ‌ట్ల‌కు బామ్మ అడ్డుప‌డుతుండ‌టంతో బాలు కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. బాలు కోపాన్ని కంట్రోల్ చేయ‌డానికి అత‌డి కోసం మీనానే ఇంటి బ‌య‌ట‌కు వ‌స్తుంది. మీనాను చూడ‌గానే క‌విత్వం మొద‌లుపెడ‌తాడు బాలు. కార్లు, ఇంజిన్‌, పంచ‌ర్లు, ఖ‌ర్చులు అని మాట్లాడేమీరేనా ఇంత అందంగా మాట్లాడేది అని మీనా ఆశ్చ‌ర్యంగా అడుగుతుంది. ప‌క్క‌న అంద‌మైన పెళ్లాం, ఎవ‌రులేని ఏకాంతం ఉంటే ఎవ‌రికైనా క‌విత్వం పుట్టుకొస్తుంద‌ని బాలు బ‌దులిస్తాడు.

మీనా కోసం బాలు పాట‌..

బాలు, మీనా ఆరుబ‌య‌ట మంచంపై ప‌డుకుంటారు. మ‌నం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాల‌ని బాలుతో మీనా అంటుంది. ఓ పాట పాడ‌మ‌ని భ‌ర్త‌ను అడుగుతుంది మీనా. భార్య కోసం బాలు జామురాతిరి జాబిల‌మ్మ పాట పాడుతాడు. ఆరు బ‌య‌ట త‌మ‌పై మంచు, ప‌రుగులు ప‌డ‌కుండా మంచానికి గొడుగు అడ్డుగా పెడ‌తాడు బాలు.

ఐడియా పాపుల‌ర్‌…

బాలు, మీనా గొడుగు ఐడియా ఊళ్లో పాపుల‌ర్ అవుతుంది. చాలా మంది ఆడ‌వాళ్లు గొడ‌వ‌లు ప‌ట్టుకొని మీనా, బాలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. నీ గొడుగు ఐడియా అదిరింద‌ని బాలుతో అంటారు. నీ గొంతు బాగుంద‌ని, పాట బాగా పాడ‌వ‌ని బాలుపై పొగుడుతారు. మా భ‌ర్త‌ల‌కు ఇలాంటి ఐడియాలు రావ‌డం లేద‌ని అంటారు. మీరు చేసిన ప‌నికి మ‌న‌ల‌ను చూసి ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి అని భ‌ర్త‌తో అంటుంది మీనా. అంద‌రూ మ‌న‌ల్ని చూసి నేర్చుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని బాలు అంటాడు. ఛీ పొండి అని మీనా సిగ్గుప‌డుతూ అంటుంది.

మీనాను బ‌తిమిలాడిన బాలు…

బాలు, రాజేష్ మందు పార్టీ చేసుకోవాల‌ని ప్లాన్ వేస్తారు. వారి మాట‌ల‌ను మీనా వింటుంది. ఏంటి అని బాలువైపు కోపంగా చూస్తుంది. ఏ పెళ్లాలు ఎక్క‌డ ఉన్నా వారి క‌ళ్లు, చెవులు మాత్రం భ‌ర్త‌ల‌పైనే ఉంటాయ‌ని బాలు సెటైర్ వేస్తాడు. బామ్మ‌కు మాత్రం పార్టీ గురించి చెప్పొద్ద‌ని మీనాను బ‌తిమిలాడుతాడు.

ప్ర‌భావ‌తి హ‌డావిడి…

మ‌లేషియా మావ‌య్య వ‌స్తున్నాడ‌ని ప్ర‌భావ‌తి తెగ హ‌డావిడి చేస్తుంది. మీనాకు పెద్ద వంట‌ల లిస్ట్ చెబుతుంది. మీనా వంట‌లు చేస్తే నువ్వు ఏం చేస్తావ‌ని ప్ర‌భావ‌తిని నిల‌దీస్తుంది సుశీల‌. మ‌లేషియా మావ‌య్య‌తో నేను మాట్లాడాలిక‌దా అని ప్ర‌భావ‌తి అంటుంది.

సుస్వాగ‌తం…

మీనా వేసిన ముగ్గుపై ప్ర‌భావ‌తి సెటైర్లు వేస్తుంది. సుస్వాగ‌తం అని రాయ‌మ‌ని అంటుంది. ఇళ్లు మొత్తం తాను చెప్పిన‌ట్లు నీట్‌గా స‌ర్ధ‌లేద‌ని మీనాపై కోప్ప‌డుతుంది ప్ర‌భావ‌తి. ప‌క్క‌నే ఉన్న బ‌కెట్ తీయ‌బోతూ ప్ర‌భావ‌తి కింద‌ప‌డ‌బోతుంది. ఆమెను స‌త్యం వ‌చ్చి ప‌ట్టుకుంటాడు. నేను కింద ప‌డాల‌ని బాలు ఎంతో ఆశ‌గా చూస్తున్నాడ‌ని ప్ర‌భావ‌తి కోపంగా అంటుంది. నేను రావ‌డం ఆల‌స్య‌మైతే బాలు ఆశ తీరేది అని స‌త్యం అంటాడు.

ర‌వికి శృతి సేవ‌లు…

ప‌ల్లెటూళ్లో వేడి త‌ట్టుకోలేక‌పోతున్నాన‌ని, ఇక్క‌డి నుంచి వెళ్లిపోదామ‌ని శృతి అంటుంది. విస‌న‌క‌ర్ర తీసుకొని బాలుకు గాలికి వ‌చ్చేలా విసురుతుంటాడు ర‌వి. సుశీల రూమ్‌లోకి రావ‌డం క‌నిపించ‌డంతో విస‌నక‌ర్ర తీసుకొని శృతి చేతిలో పెడ‌తాడు. శృతినే ర‌వికి సేవ‌లు చేస్తుంద‌ని సుశీల అనుకుంటుంది.ప‌ట్నం పిల్ల‌వే అయినా మ‌ర్యాద‌లు బాగా తెలుసు నీకు అంటూ శృతిపై పొగ‌డ్త‌లు కురిపిస్తుంది.

ప్ర‌భావ‌తి కోపం…

మీనాను ఇళ్లు మొత్తం తుడ‌వ‌మ‌ని ఆర్డ‌ర్ వేస్తుంది. శృతి కాఫీ కావాల‌ని అడ‌గ‌టంతో ఆమెకు కాఫీ ఇవ్వ‌మ‌ని మీనాకు ప‌నుల మీద ప‌నులు చెబుతుంది ప్ర‌భావ‌తి. అది చూసి సుశీల కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. మీనా ఒక్క‌తే ఎన్న‌ని ప‌నులు చేస్తుంది. శృతిని సాయం చేయ‌మ‌ని అంటుంది. శృతికి ఇలాంటి ప‌నులు చేయ‌డం రాద‌ని ప్ర‌భావ‌తి వెన‌కేసుకొస్తుంది. మ‌నోజ్‌, రోహిణి కూడా ఆల‌స్యంగా నిద్ర‌లేస్తారు. వారిపై బాలు సెటైర్లు వేస్తాడు. ప్ర‌భావ‌తి అత‌డిపై కోప్ప‌డుతుంది. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024