Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 4 సినిమాలు- తెలుగులో 1 స్పెషల్- హారర్, కామెడీ, కోర్ట్ డ్రామా, మెడికల్ థ్రిల్లర్ జోనర్స్

Best Web Hosting Provider In India 2024

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 4 సినిమాలు- తెలుగులో 1 స్పెషల్- హారర్, కామెడీ, కోర్ట్ డ్రామా, మెడికల్ థ్రిల్లర్ జోనర్స్

Sanjiv Kumar HT Telugu
Published Apr 03, 2025 08:28 AM IST

Today OTT Movies Release: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజు 4 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవన్ని ఒక్కోటి ఒక్కో జోనర్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ యాక్షన్, కామెడీ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా, మెడికల్ థ్రిల్లర్ వంటి జోనర్స్‌లో ఉన్న వీటిలో ఒక్కటే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. వాటి ఓటీటీలు చూద్దాం.

ఓటీటీలోకి ఇవాళ 4 సినిమాలు- తెలుగులో 1 స్పెషల్- హారర్, కామెడీ, కోర్ట్ డ్రామా, మెడికల్ థ్రిల్లర్ జోనర్స్
ఓటీటీలోకి ఇవాళ 4 సినిమాలు- తెలుగులో 1 స్పెషల్- హారర్, కామెడీ, కోర్ట్ డ్రామా, మెడికల్ థ్రిల్లర్ జోనర్స్

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరేజే 4 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే, వీటిలో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. అది కూడా ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జోనర్ అయిన హారర్ యాక్షన్, కామెడీ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా, మెడికల్ థ్రిల్లర్స్‌గా ఉన్నాయి. తెలుగులో ఒక్కటి మాత్రమే ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఏ రియల్ పెయిన్ ఓటీటీ

2024 నవంబర్ 1న అమెరికా థియేటర్లలో విడుదలైన హాలీవుడ్ కామెడీ డ్రామా సినిమా ఏ రియల్ పెయిన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జెస్సీ ఐసన్ బర్గ్ ప్రధాన పాత్రతోపాటు దర్శకత్వం వహించాడు. అతనితోపాటు కీరాన్ కుల్కిన్ ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే, జెన్నిఫర్ గ్రే, విష్ షార్ప్, ఎల్లోరా ట్రోషియా ఇతర కీలక పాత్రలు పోషించారు.

3 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఏ రియల్ పెయిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద 24.7 మిలియన్ డాలర్ల్ వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్/జియోహాట్‌స్టార్‌లో ఇవాళ్టీ నుంచి (ఏప్రిల్ 3) ఏ రియల్ పెయిన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇంగ్లీష్ భాషలో సబ్ టైటిల్స్‌తో ఏ రియల్ పెయిన్ ఓటీటీ రిలీజ్ అయింది.

ది బాండ్స్‌మ్యాన్ ఓటీటీ

హారర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఇంగ్లీష్ ఓటీటీ వెబ్ సిరీస్ ది బాండ్స్‌మ్యాన్. హాలీవుడ్ పాపులర్ యాక్టర్ కెవిన్ బాకన్, మ్యాక్స్‌వెల్ జెంకిన్స్, జెన్నిఫర్ నెట్లెస్, జొలెనో పూర్డీ, బెత్ గ్రాంట్ ప్రధాన పాత్రల్లో నటించిన ది బ్యాండ్స్‌మ్యాన్ వెబ్ సిరీస్‌కు గ్రెంగర్ డేవిడ్ రూపొందించారు.

ఒక చినిపోయిన బాంటీ హంటర్ తిరిగి వచ్చి తన డ్యూటీ చేస్తుంటాడు. అతను ఎవరికోసం? వెతుకుతుంటాడు, ఎందుకు? అనేదే ఈ సిరీస్ కథ. యాక్షన్‌కు హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసిన తెరకెక్కించిన ది బ్యాండ్స్‌మ్యాన్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ది బ్యాండ్స్‌మ్యాన్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్ భాషలో, సబ్ టైటిల్స్‌తో ది బ్యాండ్స్‌మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

పల్స్ ఓటీటీ

ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన మరో ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పల్స్. మెడికల్ డ్రామా, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కిన పల్స్ ఓటీటీలోకి వచ్చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ సాయంత్రంలోపు పల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, పల్స్ సిరీస్ మొదటి ఎపిసోడ్‌ను ఇంగ్లీషు భాషలో ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.

ఉద్వేగం ఓటీటీ

2024 నవంబర్ 29న థియేటర్లలో విడుదలైన తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా ఉద్వేగం ది ఫస్ట్ కేస్ ఆఫ్. యంగ్ హీరో త్రిగున్, దీప్సిక ప్రధాన పాత్రల్లో నటించగా.. సీనియర్ హీరో సురేష్, యాక్టర్ శ్రీకాంత్ ఐయ్యంగర్, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, ఐ డ్రీమ్ అంజలి కీలక పాత్రలు పోషించారు. హీరో త్రిగున్ కెరీర్‌లో 25వ సినిమాగా వచ్చిన ఉద్వేగం మూవీకి మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు.

తాజాగా ఇవాళ ఉద్వేగం ఓటీటీలోకి వచ్చేసింది. ఈటీవీ విన్‌లో తెలుగు భాషలో ఉద్వేగం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్‌గా ప్రియదర్శి కోర్ట్ మూవీ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన ఉద్వేగం ఓటీటీ రిలీజ్ కావడం ఆసక్తిగా మారింది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024