Dil Raju 60th Movie: దిల్ రాజు ప్రొడక్షన్‌లో 60వ మూవీ.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్ స్టోరీ.. హీరో ఎవరో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Dil Raju 60th Movie: దిల్ రాజు ప్రొడక్షన్‌లో 60వ మూవీ.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్ స్టోరీ.. హీరో ఎవరో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Published Apr 03, 2025 09:03 AM IST

Dil Raju Production 60th Movie With Ashish: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్, స్టార్ ప్రొడ్యూర్‌గా దిల్ రాజు పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రొడక్షన్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో 60వ మూవీని అనౌన్స్‌మెంట్ చేశారు. ఎస్‌వీసీ బ్యానర్ మైల్ స్టోన్ మూవీగా వస్తోన్న ఈ సినిమాలో హీరో ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

దిల్ రాజు ప్రొడక్షన్‌లో 60వ మూవీ.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్ స్టోరీ.. హీరో ఎవరో తెలుసా?
దిల్ రాజు ప్రొడక్షన్‌లో 60వ మూవీ.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్ స్టోరీ.. హీరో ఎవరో తెలుసా?

Dil Raju Production 60th Movie With Ashish: ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్‌ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్‌ని సూచిస్తుంది. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా దిల్ రాజు సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు.

రౌడీ బాయ్ మూవీతో

ఈ సమయంలో తన ప్రొడక్షన్స్‌లో 60వ మూవీగా వచ్చే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు బ్యానర్ 60వ సినిమాలో రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఆశిష్ హీరోగా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో కొత్త దర్శకుడు ఆదిత్యరావు గంగాసాని డెబ్యు డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు.

ఇంటెన్సివ్ లుక్

ఈ 60వ మూవీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఆశిష్ లోకల్ బాయ్‌గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యం కథకు రగ్గడ్ అండ్ గ్రిట్టీ ఎట్మాస్పియర్‌తో ఇంటెన్సివ్ లుక్‌లో ఆశిష్ కనిపించనున్నాడట. ఇప్పటికే తన మునుపటి పాత్రలలో వెర్సటాలిటీని ప్రజెంట్ చేసిన ఆశిష్ ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ కానున్నారు. మరింత ఇంటెన్స్, మాస్-ఓరియెంటెడ్ లుక్‌లో కనిపించబోతున్నారు.

నటీనటుల కోసం ప్రకటన

డెబ్యు డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని ఈ సినిమా కోసం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో అద్భుతమైన కథని రెడీ చేశారు. ఎగ్జయిట్‌మెంట్‌ని మరింత పెంచుతూ నిర్మాతలు న్యూ ట్యాలెంట్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ యాసని ఫ్లూయంట్‌గా మాట్లాడే వారి కోసం కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేశారు. ఈ నటీనటుల ఎంపిక అన్ని వయసుల నటులకు ఓపెన్‌గా ఉంటుంది.

దిల్ రాజు సోదరిడి కుమారుడిగా

అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ గల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరోసారి హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్ గల చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. ఇదిలా ఉంటే, దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ అని తెలిసిందే. రౌడీ బాయ్స్‌ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఆశిష్ లవ్ మీ అనే యూనిక్ హారర్ మూవీతో అలరించాడు.

డిజాస్టర్‌గా గేమ్ ఛేంజర్

హీరోగా నిలదొక్కుకునే సమయంలోని రీసెంట్‌గా ఆశిష్ ఇంటివాడు అయ్యాడు. అద్విత రెడ్డిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత ఆశిష్ చేస్తున్న తొలి సినిమా ఇది. ఇక దిల్ రాజు వరుసపెట్టి సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. అయితే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

బ్లాక్ బస్టర్‌గా సంక్రాంతికి వస్తున్నాం

సౌత్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం దాదాపుగా రూ. 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024