Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం.. గంటల తరబడి చర్చ

Best Web Hosting Provider In India 2024


Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం.. గంటల తరబడి చర్చ

HT Telugu Desk HT Telugu
Updated Apr 03, 2025 07:21 AM IST

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. నేడు ఈ బిల్లు రాజ్యసభలో ఓటింగ్‌కు, చర్చకు రానుంది.

లోక్‌సభలో వక్ఫ్ బిల్లు ఆమోదం
లోక్‌సభలో వక్ఫ్ బిల్లు ఆమోదం (ANI)

11 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ గురువారం ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు.

ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభకు వెళ్లనుంది. అక్కడ మరో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం 8 గంటల సమయం కేటాయించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

గత ఏడాది ఆగస్టులో ప్రవేశపెట్టిన బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను పొందుపరిచి, ప్రభుత్వం సవరించిన బిల్లును తీసుకువచ్చింది. ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు 2024 కూడా లోక్‌సభలో ఆమోదం పొందింది. లోక్ సభలో దాదాపు 12 గంటల పాటు చర్చ సాగింది.

విపక్షాలపై కిరణ్ రిజిజు ఫైర్:

బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముస్లిం సమాజంలోని పేదలు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

బిల్లు ముస్లిం వ్యతిరేకమని ప్రతిపక్ష సభ్యులు చేసిన విమర్శలను రిజిజు తోసిపుచ్చారు. హోం మంత్రి అమిత్ షా అన్ని అంశాలపై స్పష్టత ఇచ్చినప్పటికీ కొందరు సభ్యులు నిజాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరని రిజిజు అన్నారు.

బిల్లుకు సంబంధించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కొందరు నేతలు చెబుతున్నారని, అలా ఎలా చెబుతారని ప్రశ్నించారు.

రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కోర్టు ఎందుకు కొట్టేయలేదని ప్రశ్నించారు. ‘రాజ్యాంగ విరుద్ధ పదాలు వాడకూడదు. ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగబద్ధం, రాజ్యాంగ విరుద్ధం అనే పదాలను అంత తేలిగ్గా వాడొద్దు..’ అని హితవు పలికారు.

ఈ బిల్లు 1995 నాటి చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుంది. భారత్ లో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. గత చట్టంలోని లోపాలను అధిగమించి వక్ఫ్ బోర్డుల సామర్థ్యాన్ని పెంచడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం, వక్ఫ్ రికార్డుల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం పాత్రను పెంచడం దీని లక్ష్యం.

HT Telugu Desk

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link