


Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 3rd Episode: రుద్రాణి ప్లాన్‌ను తిప్పికొట్టిన కావ్య- యామినికి రాజ్ చురకలు- కొడుకుతో మాట్లాడనున్న అపర్ణ!
Brahmamudi Serial April 3rd Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 3 ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో మాట్లాడిన వీడియోను ఇంట్లో చూపిస్తుంది రుద్రాణి. కాని, కావ్య వచ్చి తను క్లైంట్స్‌తో మాట్లాడుతున్నట్లు నిరూపించి రుద్రాణి ప్లాన్‌ను తిప్పికొట్టి వెర్రిదాన్ని చేస్తుంది. కంట్రోల్ చేయాల్సిన యామినికి చురకలు వేస్తాడు రాజ్.

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ దగ్గరి నుంచి అర్జంట్‌గా వెళ్లాలలని కావ్య వెళ్లిపోతుంది. కళావతి గారు నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతాడు. లేదండి. మీ తప్పేం లేదండి. మీరు జెంటిల్‌మెన్ అని నాకు తెలుసు అని కావ్య అంటుంది.
నీకోసమే చూస్తున్నా
మరేమైంది ఎందుకు అలా వెళ్లిపోతున్నారు అని రాజ్ అడుగుతాడు. అలా ఏం లేదని చెబుతున్నాను. తర్వాత మళ్లీ కలుద్దాం బై అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు యామిని వస్తుంటుంది. కావ్య ఏడుస్తూ కారులో కూర్చుని వెళ్లిపోతుంది. అప్పుడే యామిని కారు వస్తుంది. యామిని కారు దిగి రెస్టారెంట్‌లోకి వెళ్తుంది. కావ్యను చూడదు. ఇక్కడ ఏం చేస్తున్నావ్ బావా అని యామిని అడిగితే.. నీకోసమే చూస్తున్నాను అని రాజ్ అంటాడు.
నేను కాఫీ తాగాను నువ్ తాగేసి వచ్చేయ్ అని రాజ్ అంటే.. ఇది అన్యాయం, నీకోసం వస్తే మధ్యలో వదిలేసి వెళ్తానంటావేంటీ అని యామిని అంటుంది. మధ్యలో కంగారుగా రావాల్సిన అవసరం ఏంటీ. నేనే ఇంటికి వచ్చేవాన్ని కదా అని రాజ్ అంటాడు. దాంతో యామిని ఎమోషనల్ డ్రామా చేస్తుంది. టేబుల్‌పైన రెండు కాఫీ కప్స్ ఉండటంతో యామినికి డౌట్ వస్తుంది. తర్వాత రాజ్, యామిని ఇద్దరూ వెళ్తారు. యామిని గురించి డీటెల్స్ అప్పుకు చెబుతాడు కానిస్టేబుల్.
యామిని తండ్రి రఘునందన్, పదేళ్లుగా ఫారెన్‌లో ఉన్నట్లు, ఆమె డ్రగ్ అడిక్ట్ అని అంతా చెబుతాడు. యామిని కాలేజ్ గురించి అప్పు అడిగితే.. తన గతానికి సంబంధించి ఏం డీటెల్స్ దొరకలేదని కానిస్టేబుల్ చెబుతాడు. యామిని ఇంట్లో వంటవాళ్లు, ఫ్యామిలీ డాక్టర్స్, అందరిని అడగండి. ఏమాత్రం డౌట్ రాకూడదు. యూనిఫామ్‌లో కాకుండా మఫ్టీలో వెళ్లండి. ఇలాంటిది ఒకటి యామిని చుట్టూ జరుగుతుందనే విషయం తనకేమాత్రం అనుమానం రాకూడదు అని అప్పు అంటుంది.
జైలులో కూర్చొబెడతా
నువ్ ఎంత జాగ్రత్తపడిన నా నుంచి తప్పించుకోలేవు యామిని. నువ్ మా అక్కకు చేసిన ద్రోహానికి నిన్ను సెల్‌లో కూర్చొబెట్టకుండా ఉండను అని అప్పు అంటుంది. అపర్ణ ఫ్రూట్స్ తింటుంది. అది చూసి నాకు కాస్తా ధైర్యమచ్చిందని ఇందిరాదేవి అంటుంది. నాకు మాత్రం కావ్య ధైర్యమిచ్చింది. తన మాటలు, నమ్మకం చూస్తుంటే ఎక్కడో ఓ చిన్న ఆశ మొదలైంది అని అపర్ణ అంటుంది. ఇంతలో రుద్రాణి ఎంట్రీ ఇచ్చి దుగ్గిరాల ఇంటి కోడలి విశ్వరూపం అని వెటకారంగా మాట్లాడుతుంది.
ఆవిడ గారి నటన చూడాలంటే బిగ్ స్క్రీన్ కరెక్ట్ అని టీవీకి మొబైల్ కనెక్ట్ చేస్తుంది. అందులో రాజ్‌తో కావ్య మాట్లాడినట్లు ప్రాక్టీస్ చేసింది చూపిస్తుంది రుద్రాణి. అది చూసి అంతా షాక్ అవుతారు. ఇంతలో కావ్య వస్తే.. మన హీరోయిన్ కూడా వచ్చేసింది. నీ నటనకు వాళ్లు ఏం రివ్యూ ఇస్తారో, ఎన్ని స్టార్స్ ఇస్తారో అని రుద్రాణి అంటుంది. కావ్య షాక్ అవుతుంది. రుద్రాణి మాటలకు అపర్ణ ఏడుస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏం చెబుతారో అని అడుగుతుంది రుద్రాణి.
అపర్ణ ఏం మాట్లాడలేక వెళ్లిపోతుంది. వదినకు మొత్తం విషయం అర్థమైపోయింది. అందుకే తట్టుకోలేక వెళ్లిపోయింది. ఇంకా కావ్య మాటలు నమ్మడానికి ఎవరైనా ఉన్నారా. కావ్య 30 రోజులు గడువు అడిగింది. ఇప్పుడు కూడా తను చెప్పినట్లు ఆగుతారు. లేదా మానసిక రోగుల చికిత్సాకేంద్రానికి పంపిద్దామా అని రుద్రాణి అంటుంది. దాంతో కావ్య ఫైర్ అవుతుంది. నాకు తెలియకుండా వీడియో తీసి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటారు అని అంటుంది.
పిచ్చిదాన్ని అనుకుంటున్నారు
ఇక్కడ పాయింట్ నువ్ ఒక్కదానివే రాజ్ ఉన్నట్లు ఊహించుకుని మాట్లాడటం అని రుద్రాణి అంటుంది. నేను ఊహించుకుని ఎక్కడ మాట్లాడాను. ఫోన్‌లో మాట్లాడాను అని చెవిలో బ్లూటూత్ ఉంది. చూడండి నా చెవిలో బ్లూటూత్ ఉందని వీడియో పాజ్ చేసి చూపిస్తుంది కావ్య. దాంతో అంతా షాక్ అవుతారు. అయితే, రుద్రాణి, రాహుల్‌ను రెస్టారెంట్‌లో చూసిన కావ్య నన్ను ఫాలో అవుతూ వచ్చారా అనుకుని. వీళ్లు ఎలాగో పిచ్చిదాన్ని అనుకుంటున్నారుగా. అలాగే నటిస్తే వెళ్లిపోతారుగా అని కావ్య కావాలనే అలా నటిస్తుంది.
దానికి ముందు చెవిలో బ్లూటూత్ పెట్టుకుని కావాలనే చేస్తుంది. అలా రుద్రాణి, రాహుల్‌ను వెర్రివాళ్లను, పిచ్చోళ్లను చేస్తుంది కావ్య. నేను క్లైంట్స్‌తో మాట్లాడుతూ రెస్టారెంట్‌కు వెళ్లి త్వరగా రండి అని చెబుతుంటే.. అది వీడియో తీసి నన్ను పిచ్చిదాన్ని అని నిరూపిద్దామనుకున్నారు. ఇంకో ఐదు నిమిషాలు ఉండుంటే క్లైంట్స్ వచ్చేవాళ్లు. మొత్తం విషయం అర్థమయ్యేది అని కావ్య అంటుంది. ఇదేంటీ మంచి యాక్షన్ సినిమా తీశామని అనుకుంటే కామెడీ అయిపోయిందని రాహుల్ అనుకుంటాడు.
ఇక మా మామ్ కావ్యకు బలైపోయినట్లే. నేను తప్పించుకోవడం మంచిది అని రాహుల్ అనుకుంటాడు. మీరెవరు నన్ను ఫాలో అయి రావడం, వీడియో తీయడం ఏంటీ అని కావ్య అడిగితే.. నేను కావాలని రాలేదు. అనుకోకుండా వచ్చాను అని రుద్రాణి అబద్ధం చెబుతుంది. చాలు. నేనిప్పుడు అప్పుడు చెబుతున్నాను. మా ఆయన బతికే ఉన్నారు. నువ్ నమ్మితే నమ్ము లేకుంటే లేదు. ఇంకోసారి ఇలాంటివి చేస్తే అస్సలు ఊరుకోను అని కావ్య వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
కంట్రోల్ చేస్తున్నావా
ఏంటీ అత్త నువ్ తీసిని అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక నీకు పోస్టర్లే గతి. వెళ్లి అతికించుకో బతకాడానికి డబ్బులైన వస్తాయి అని స్వప్న కౌంటర్స్ వేస్తుంది. మరోవైపు యామిని, రాజ్ ఇంటికి వెళ్తారు. నువ్ ఇంకోసారి ఒంటరిగా వెళ్లకు. నాకు అదోలా ఉంటుంది. నేను కూడా వస్తాను. నేను ఇంట్లో ఖాళీగా ఉంటాను. నీతో వస్తే టైమ్ పాస్ వస్తుంది. జస్ట్ ఇన్ఫార్మ్ చేయి చాలు అని యామిని అంటే.. సరే చూస్తాను అని రాజ్ అంటాడు. చూస్తాను కాదు బావా చెప్పాల్సిందే. నువ్ అలా ఒంటరిగా వెళ్లడం నాకు ఇష్టంలేదు అని యామిని అంటుంది.
ఏంటీ నన్ను నీ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నావా అని రాజ్ అంటాడు. నువ్ నా బాధ్యత. నా భవిష్యత్ అనుకుని బతుకుతున్నాను. నువ్ కంట్రోల్ అనుకో ఏమన్న అనుకో అది నాకు అనవసరం. నువ్ నాకు చెప్పే తీరాలి. లేకపోతే నేను ఒప్పుకోను అని యామిని అంటుంది. నేను గతం మర్చిపోవచ్చు. కోమా నుంచి నిన్న మొన్న బయటకు రావచ్చు. అలా అని నా ఆలన పాలన చూసుకోడానికి నేను పేషంట్‌ను కాదు. నువ్ నా గార్డియన్ కాదు అని రాజ్ అంటాడు.
నేను ఎక్కడికి వెళ్లాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని నాకు తెలుసు. నేను గతం మర్చిపోవచ్చు కానీ, పెంచుకున్న జ్ఞానం కాదు. డాక్టర్ గారు చెప్పింది నేను కూడా విన్నాను. నాకు ఆ క్లారిటీ ఉంది. ఇలా ఇబ్బంది పెడితేనే నాకు ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. నాకోసం ఎవరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. నువ్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తే తోడుగా వచ్చినట్లు లేదు. నీడలా వెంటాడుతున్నట్లు ఉంది. అలా నాకు అనిపించే పరిస్థితి తీసుకు రాకు. నన్ను నన్నులా ఉండని. నాకు కాస్తా ప్రైవేసీ ఇవ్వు అని రాజ్ వెళ్లిపోతాడు.
వెన్నపూస రాసినట్లుగా
తనను ఇలాగే వదిలేయాలా. వాళ్ల ఫ్యామిలీ చూస్తే అని యామిని అంటుంది. అందుకుని బలవంతంగా నీ కనుసన్నలో ఉంచాలనుకుంటే ఉంటాడు అనుకుంటున్నావా. నీ మీద విరక్తితో నీకు మాకు చెప్పకుండా శాశ్వతంగా వెళ్లిపోతాడు. మన మాట వినడానికి ఇష్టపడాలని లేనప్పుడు మనం ఆవేశపడకూడదు. మన దారికి తెచ్చుకోవాలనప్పుడు మన ప్రవర్తన గాయం వెన్నపూస రాసినట్లు హాయిగా ఉండాలి. ప్రేమగా లాలించాలి. బుజ్జగించాలి. మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. అర్థమైందా అని వైధైహి కూతురుకి పాఠాలు చెబుతుంది.
మరోవైపు అపర్ణ ఏం తాగకుండా ఉంటుంది. ఇందిరాదేవి వచ్చి ఏమైందని అడుగుతుంది. నమ్మకం చచ్చిపోయింది. కావ్య చెప్పిన మాటలు విని నా కొడుకు బతికే ఉన్నాడన్న ఆశలు నాలో రేగాయి. కానీ, రుద్రాణి చూపించిన వీడియోలో కావ్య ప్రవర్తించిన తీరు చూసి నాలో నమ్మకం చచ్చిపోయింది అని అపర్ణ ఏడుస్తూ చెబుతుంది. వాన్ని ఊహించుకుంటూ కావ్య ఏం చేసుకుంటుందో అని భయం. రుద్రాణిలా కఠువుగా చెప్పలేను. ఆస్పత్రికి పంపించి పిచ్చిదాన్ని చేయలేను. దాని జీవితం దానికి తిరిగి ఇచ్చే పరిస్థితిలో కూడా లేను అని అపర్ణ అంటుంది.
కావ్యకు రాజ్ ఫోన్
ఆస్తుల సమస్యలు, మనవడు జైలు నుంచి వచ్చాడు. అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకున్నాను. కానీ, ఎవరు సంతోషంగా లేకుండా చేశాడు. ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత హాల్లో కావ్య ఫోన్ చార్జింగ్ పెట్టి వెళ్లిపోతుంది. కావ్యకు తలనొప్పు అని చెప్పింది ఎలా ఉందో అని రాజ్ కాల్ చేస్తాడు. అపర్ణ కాల్ వస్తుందని చెబితే.. ఎవరో చూడమని అంటుంది కావ్య. అందులో శ్రీవారు అని ఉంటుంది. ఇంతలో కావ్యకు గుర్తుకు వచ్చి షాక్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం