




Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దీప – కార్తీక్ కంగారు – కాంచనపై శ్రీధర్ రివేంజ్
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 ఏప్రిల్ 3 ఎపిసోడ్లో శివన్నారాయణ ఇంట్లో దీపకు జరిగిన అవమానాన్ని కాంచన, కార్తీక్‌లకు చెబుతాడు శ్రీధర్. రమ్యకు డబ్బులు ఇచ్చి ఆమె చేత దీప అబద్ధం చెప్పించబోయిందని, కావాలనే జ్యోత్స్న నిశ్చితార్థం చెడగొట్టిందని దీపపై నిందలు వేస్తాడు శ్రీధర్.

Karthika Deepam 2 Serial: కార్తీక్‌ను వెతుక్కుంటూ శ్రీధర్ వస్తాడు. తండ్రిని చూడగానే ఈ దరిద్రాన్ని మనం భరించలేమని, ఇళ్లు ఖాళీ చేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదామని కాంచనతో కార్తీక్ అంటాడు. ఎందుకు అని శ్రీధర్ అడుగుతాడు. మనశ్శాంతి కోసం అని కార్తీక్ బదులిస్తాడు. మనశ్శాంతి కావాలంటే మార్చాల్సింది ఇళ్లు కాదు ఇల్లాలిని అని శ్రీధర్ వెటకారంగా మాట్లాడుతాడు. తండ్రి మాటలతో కార్తీక్ ఫైర్ అవుతాడు.
తండ్రికి కార్తీక్ వార్నింగ్…
ఇంతకుముందు ఇదే మాట ఒక్కసారి అన్నావు. వద్దని పద్దతిగా చెప్పా…మళ్లీ అన్నావు…ఇక్కడితో ఆపేసి తమరు బయలుదేరండి అని తండ్రికి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. రంగుల మీద పడకుండా హోలీ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉంటుందో…దీప లాంటి పెళ్లాన్ని పెట్టుకొని పద్ధతి గురించి మాట్లాడితే అలాగే ఉంటుందని దీపను తక్కువ చేసి మాట్లాడుతాడు శ్రీధర్. తండ్రి మాటలతో కోపం పట్టలేకపోయిన కార్తీక్ అతడి కాలర్ పట్టుకుంటాడు. కాంచన ఆపేస్తుంది.
తాత ఇంటికి వెళ్లింది…
కాలర్ పట్టుకొని ఆగిపోయావేం…కొట్టు అని శ్రీధర్ అంటాడు. సంస్కారం నీకు లేదు నాకు ఉందని కాలర్ వదిలేస్తాడు కార్తీక్. నీకు నిజంగా సంస్కారం ఉంటే నీ పరువు బజారుకు ఈడుస్తున్న నీ పెళ్లాన్ని లాగిపెట్టి కొట్టమని కార్తీక్‌తో అంటాడు శ్రీధర్. నీ పెళ్లాం ఎక్కడికి వెళ్లిందో తెలుసా…నీ తాత ఇంటికి అని నిజాన్ని బయటపెడతాడు. వెళ్లి గొడవ పెట్టుకొని వచ్చిందని చెబుతాడు. వాళ్లు కొట్టడం ఒక్కటే తక్కువ..మర్యాదగా గెంటేశారు అని శ్రీధర్ అంటాడు.
దీప మౌనం…
నువ్వు వాళ్ల ఇంటికి వెళ్లావా అని దీపను కాంచన అడుగుతుంది. శ్రీధర్ చెప్పేది నిజమేనా దీపను కార్తీక్ నిలదీస్తాడు. కానీ దీప మాత్రం సైలెంట్‌గా ఉంటుంది. దీపకు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని భార్యను వెనకేసుకొస్తాడు కార్తీక్.
కొత్తపేట వెళ్లి రమ్యను కలిసిన దీప…ఆమెను దశరథ్ ఇంటికి తీసుకెళ్లడం…ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక్, కాంచనలకు వివరిస్తాడు శ్రీధర్. రమ్య కడుపులో పెరుగుతోన్న బిడ్డకు సత్తి పండే కారణమని, ఆ విషయం ఆమె భర్తే చెప్పాడని శ్రీధర్ అంటాడు.
రమ్యకు డబ్బులు ఇచ్చి దీప అబద్ధం చెప్పమని అన్నదట శ్రీధర్ అంటాడు. తండ్రి మాటలతో కార్తీక్ షాకవుతాడు. నువ్వు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించడం ఏంటి అని దీపను నిలదీస్తాడు కార్తీక్. నేను చెప్పాల్సింది ఇంకా మిగిలే ఉందని శ్రీధర్ అంటాడు. ఇంకా ఏం మిగిలివుంది అని కాంచన అంటుంది.
ఇంటి గడప తొక్కద్దు…
మీ నాన్న, మీ వదిన, పిన్ని…మీ కోడలిని తిట్టారు. నిన్ను కూడా కలిపి తిట్టారు. జీవితంలో మళ్లీ ఇంటి గడప తొక్కద్దని అవమానించి పంపించారని శ్రీధర్ అంటాడు. సత్తిపండు…రమ్య మొగుడు అయినప్పుడు గౌతమ్‌పై నువ్వు వేసిన నింద అబద్ధమేగా…అంటే నువ్వు కావాలనే జ్యోత్స్న నిశ్చితార్థం చెడగొట్టావని శ్రీధర్ అంటాడు. జ్యోత్స్న కూడా నీలాంటి ఆడదేగా…ఇలాంటి పాపపు పనులు చేస్తే ఉసురు తగలదు అని శ్రీధర్ వెటకారంగా అంటాడు.
అన్ని నిజాలే అయినప్పుడు…
అతడు ఇన్ని మాట్లాడుతుంటే నువ్వు ఒక్కదానికి సమాధానం చెప్పవు ఏంటి దీప అని కార్తీక్ అంటాడు. అన్ని నిజాలే అయినప్పుడు ఏమని సమాధానం చెబుతుంది శ్రీధర్ అంటాడు. నీ కోడలిని రోడ్లు పట్టుకొని తిరగొద్దని చెప్పమని కాంచనకు సలహా ఇస్తాడు శ్రీధర్. దీప కన్నీళ్లు పెట్టుకోవడం చూసి…పాపం భారతదేశంలోని నదులన్నీ దీప కంట్లోనే ప్రవహిస్తున్నట్లు ఉన్నాయి.
ఆ ఇంటి దగ్గర మొదలైన ఏడుపు…ఈ ఇంటికి వచ్చిన ఆగలేదని శ్రీధర్ అంటాడు. శ్రీధర్ ఇంకా మాట్లాడబోతుంటే తండ్రిని వెళ్లిపొమ్మంటాడు కార్తీక్. పరువులు పోయిన పొగరు తగ్గలేదని శ్రీధర్ అంటాడు. పోయిన పరువు ఎలాగూ పోయింది ఉన్నదైనా కాపాడుకొండి అని వెటకారంగా మాట్లాడుతూ వెళ్లిపోతాడు శ్రీధర్
ఏదో తప్పు జరిగింది….
దీప బాధను చూసి తనను ఏం అడగొద్దని తల్లితో అంటాడు కార్తీక్. తనది ఏ తప్పు లేదని నిరూపించుకోవాలని అనుకుంది. కానీ మళ్లీ అక్కడే ఏదో తప్పు జరిగి ఉంటుందని కార్తీక్ అంటాడు. ఇన్నాళ్లు రెండు కలిస్తే బాగుండునని అనుకున్నాను…కానీ ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటే చాలు అనిపిస్తుందని కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇవన్నీ ఎక్కడో ఒక చోట ఆగాలి. ఆపడానికి ఎవరైనా ఒకరు రావాలి అని కాంచన ఆవేదనకు లోనవుతుంది.
కార్తీక్ భయం…
కార్తీక్ చాలా ఆలస్యంగా ఇంటికొస్తాడు. దీపను పిలుస్తాడు. బదులు ఇవ్వకపోవడంతో…ఇళ్లు మొత్తం వెతుకుతాడు. ఎక్కడ కనిపించదు.తండ్రి అన్న మాటలు మనసులో పెట్టుకొని బాధతో దీప ఇళ్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని అనుకుంటాడు. తొందరపడి ఏదైనా అఘాయిత్యం చేసుకోలేదుగా కార్తీక్ భయపడిపోతాడు. గార్డెన్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది దీప.
నా నిజాయితీ ఓడిపోయింది…
నేను నా నిజాయితీని నిరూపించుకోలేకపోయానని కార్తీక్‌తో అంటుంది దీప. తాత రెస్టారెంట్‌కు వచ్చి సాక్ష్యాలు ఉంటే నిరూపించమని గట్టిగా మాట్లాడిన తర్వాత నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని అనుకున్నావని కార్తీక్ బదులిస్తాడు. నన్ను ఏమన్న పడతాను…కానీ మిమ్మల్ని అనే సరికి తట్టుకోలేకపోయాను. అందుకే రమ్యను తీసుకెళ్లి అందరి ముందు నిలబెట్టి నిజం నిరూపించుకోవాలని అనుకున్నాను. కానీ కొన ప్రాణంతో ఉన్న నా నిజాయితీ ఓడిపోయింది. ఇంతకుముందు నిందలు మాత్రమే వేసావు అన్నవాళ్లు ఇప్పుడు మోసాలు మొదలుపెట్టావా అనే తిట్టే పరిస్థితి వచ్చిందని దీప బాధపడుతుంది.
శ్రీధర్ కుట్ర…
రమ్యకు భర్త ఉండటం ఏంటి అని కార్తీక్ అంటాడు. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గౌతమే…కానీ ఈ సత్తిపండు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియడం లేదని దీప అంటుంది. రమ్య నిజం చెప్పకుండా అడ్డుకున్నాడని దీప అంటుంది.
నువ్వు రమ్యను కలవడం, ఆమెను నువ్వు ఆ ఇంటికి తీసుకెళ్లడం ఇంకా ఎవరికో తెలుసునని, వాళ్లే నిజం బయటపడకుండా ఈ ప్లాన్ వేసి ఉంటారని కార్తీక్ అంటాడు. గౌతమ్‌తో కలిసి శ్రీధర్ ఈ కుట్ర పన్ని ఉంటాడని కార్తీక్ అనుమానపడతాడు. నువ్వు శ్రీధర్ రెండో పెళ్లిని బయటపెట్టినందుకే ఈ పని చేసి ఉంటాడని కార్తీక్ అంటాడు.
నీకు నేను ఉన్నా…
నీకు బాధ, కోపం, ఆవేశం ఏది వచ్చిన పంచుకోవడానికి నీకు ఈ భర్త ఉన్నాడని కార్తీక్ అంటాడు. వెళ్లుముందు నాకు ఓ మాట చెబితే సాయంగా వచ్చేవాడిని అని చెబుతాడు. చివరకు ఏమైంది…నువ్వే అబద్ధం చెప్పినట్లు తెలివిగా ఆ గౌతమ్ ప్లాన్ చేసి నిన్ను ఇరికించాడని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం