


Best Web Hosting Provider In India 2024

Girl Child Parenting: ఆడపిల్లల తల్లిదండ్రులారా..! ఈ 5 విషయాల్లొ పొరపాటున కూడా నోరు జారకండి!
Girl Child Parenting: చాలా మంది తల్లిదండ్రుడు తెలియకుండానే ఆడపిల్లలను కొన్ని రకాల మాటలతో బాధపెడుతుంటారు. ఇవి వారి మానసిక ఆరోగ్యంపై, భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. మీరు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులే అయితే ఈ 5 విషయాల్లో ఎప్పుడూ నోరు జారకుండా చూసుకోండి. మంచి తల్లిదండ్రులుగా మిగిలిపోండి.

పిల్లలను సరిగ్గా పెంచడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఇది చాలా బాధ్యతాయుతమైనది కూడా. ఎందుకంటే పేరెంటింగ్ అనేది సమయంతో పాటు వేగంగా మారుతున్న అంశం. అందుకే తల్లిదండ్రులు కాలానుగుణంగా వారి ప్రవర్తను మార్చుకోవడం, నిరంతరం నేర్చుకోవడం అవసరం. ముఖ్యంగా మీరు ఆడపిల్లకు తల్లిదండ్రులు అయినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. కుమార్తెను పెంచుతున్నప్పుడు అమ్మానాన్మలుగా మీ బాధ్యత మరింత పెరుగుతుంది.
నిజానికి అమ్మాయిలు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయం అయినా వారి హృదయంపై లోతైన ముద్ర వేస్తుంది. అందరూ పిల్లలను చక్కగానే పెంచాలని అనుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తెలియకుండానే తమ పెంపకంలో పొరపాట్లు చేస్తుంటారు. వారికి తెలియకుండానే అనేక సార్లు తమ కుమార్తెల మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతారు. వారికి మంచి చెప్పబోయి మనసును నొప్పిస్తారు. మీరు కూడా ఆడపిల్ల తల్లిదండ్రులే అయితే ఈ పొరపాటు మీరు చేయకుండా చూసుకోండి. కుమార్తెలతో మాట్లాడే ముందు ఈ విషయాల్లో నోరు జారకండి.
1. కొడుకుతో ఎల్లప్పుడూ పోల్చడం
కొడుకు అయినా, కుమార్తె అయినా, ఇద్దరికీ వేరువేరు ప్రాముఖ్యత ఉంది. అందుకే ఎప్పుడూ పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చకూడదు. ముఖ్యంగా పితృస్వామ్య ఆలోచన కలిగిన మన సమాజంలో ఇలా ఎక్కువగా జరుగుతుంది. మీరు మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే మాత్రం మీరు ఈ పొరపాటును ఎప్పుడూ చేయకండి. వాడి లాగా నువ్వు ఎందుకు ఉండవు, వాడి లాగా ఎందుకు అలా చేయలేవు అంటే ప్రతిసారి అబ్బాయితే అమ్మాయిని పోల్చకండి. ఇలా తరచూ అనడం వల్ల ఆడపిల్ల మనస్సులో అపకీర్తి అభివృద్ధి చెందుతుంది. ఇది వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
2. ఆడపిల్లలు పని చేయాల్సిందే అనడం
చాలా ఇళ్లలో కుమార్తెలను ఎల్లప్పుడూ తక్కువగా చేసి మాట్లాడుతుంటారు. అమ్మాయిలు అంటే ఇంటి పనులు చేయాలి, ఆడపిల్లలంటే వంట చేయాలి, బట్టలు ఉతకాలి వంటి మాటలు తరచూ అంటుంటారు. మీరు సరదాగా అన్నా సీరియస్ గా అన్నా కూడా ఇలాంటి మాటలు మీ కుమార్తెల మనస్సులో స్థిరపడతాయి. ఇలాంటి మాటల వల్ల వారి మనస్సు ఎంతో బాధపడుతుంది. అపకీర్తితో నిండుతుంది. మీరు కొడుకుకీ, కూతురికీ మధ్య తేడా చూపుతున్నారని భావిస్తారు. సరైన మార్గం ఏమిటంటే, కుమారుడు అయినా, కుమార్తె అయినా, ఇద్దరినీ ఇంటి పనులు నేర్చుకోమని చెప్పండి. ఇది అందరికీ తెలియవలసిన విషయం.
3. అమ్మాయిలా ఉండటం నేర్చుకోమని చెప్పడం
వయస్సు పెరిగే కొద్దీ మీ కుమార్తెలతో పదే పదే అమ్మాయిలా ఉండటం నేర్చుకోమని చెప్పడం కూడా వారి మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి ఆడపిల్లలను అమ్మాయిలా ఉండమని పదే పదే చెప్పడం వల్ల వారు మరీ సున్నితంగా, అతి జాగ్రత్తగా తయారవుతారు. ఇది వారి మానసిక బలాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే సామర్థ్యం కోల్పోతారు. వారి వ్యక్తిత్వం కొంతమేరకు దెబ్బతింటుంది.
4. సహించడం నేర్చుకోమనడం
చాలా ఇళ్లల్లో అమ్మాయిలంటే గట్టిగా మాట్లాడకూడదు, ఎదురు సమాధానం చెప్పకూడదు. ఎదుటివారిది తప్పు అయినా సరే సహించడం నేర్చుకోవాలి అని చెబుతుంటారు. కానీ మారుతున్న కాలంతో పాటు విషయాలలో మార్పు వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలు తప్పులకు వ్యతిరేకంగా గొంతు వినిపించడం చాలా అవసరం. కానీ ఇప్పటికీ చాలా మంది సంస్కారం పేరుతో అమ్మాయిలను మౌనంగా ఉండమని నేర్పుతున్నారు, ఇది సరైనది కాదు. మీరు మీ బిడ్డ విషయంలో ఈ పొరపాటు చేయకండి.
5. ఆడపిల్లలంటే అక్కడి పిల్లలు అనడం
కొందరు తల్లిదండ్రులకున్న చెడ్డ అలవాటు ఏమిటంటే తమ కుమార్తెలతో ఎప్పుడూ.. ఏదో ఒక రోజు నువ్వు వేరే ఇంటికి వెల్లేదానివే అంటుంటారు. నువ్వు ఈ ఇంటికి చెందిన దానివి కాదని పదే పదే గుర్తు చేస్తుంటారు. ఇది వాస్తవమే అయి ఉండచ్చు, దీని నుండి ఎవరూ తప్పించుకోలేకపోవచ్చు. కానీ ఇలా కూతురిని ప్రతిసారి అనడం వల్ల వారి మనస్సు బాధతో నిండిపోతుంది. వారిపై మీకు ఎటువంటి హక్కు లేదని, వారు ఒంటరిగా ఉన్నారని భావన కలుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్