



Best Web Hosting Provider In India 2024

Catherine Tresa Snakes: ఒకసారి పాము నా ముఖానికి దగ్గరిగా ఉంది.. తెలుగు హీరోయిన్ కేథరీన్ ట్రెసా కామెంట్స్
Catherine Tresa About Snakes In Phani Motion Poster Launch: తెలుగు హీరోయిన్ కేథరీన్ ట్రెసా నటించిన కొత్త తెలుగు థ్రిల్లర్ మూవీ ఫణి. సీనియర్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఫణి మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో పాము గురించి కేథరీన్ ట్రెసా ఆశ్చర్యకర విషయాలు చెప్పింది.

Catherine Tresa About Snakes In Phani Movie Launch: తెలుగులో చమ్మక్ చల్లో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కేథరీన్ ట్రెసా. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, పైసా, సరైనోడు, గౌతమ్ నందా, నేనే రాజు నేనే మంత్రి, బింబిసార వంటి అనేక సినిమాల్లో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేసింది.
ఫణి మోషన్ పోస్టర్ లాంచ్
తాజాగా కేథరీన్ ట్రెసా హీరోయిన్‌గా నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఫణి. టాలీవుడ్ సీనియర్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ గ్లోబల్ మూవీ ఫణిలో మహేశ్ శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఫణి మోషన్ పోస్టర్ లాంచ్ రీసెంట్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కేథరీన్ ట్రెసా ఆశ్చర్యకర విషయాలు చెప్పింది.
అలా చేయాలని రిక్వెస్ట్ చేశాను
హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ.. “ఫణి సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్. ఆయన మా టీమ్‌ను ప్రోత్సహించేందుకు ఇక్కడికి వచ్చారు. ఫణి సినిమా కోసం ఆదిత్య గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పాములంటే నాకు భయం, పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన సరే అన్నారు” అని చెప్పింది.
హీరోయిన్ భయపడినట్లు
“అయితే షూటింగ్ చివరలో పాము కాంబినేషన్‌లో నాతో సీన్స్ చేయించారు. అది నిజమైన పాము. ఒకసారి సీన్ కంప్లీట్ అయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. నా ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి” అని పాము చూసి తాను భయపడిన సంఘటనను పంచుకుంది హీరోయిన్ కేథరీన్ ట్రెసా.
వివిధ దేశాల ఆర్టిస్టులు
“వీఎన్ ఆదిత్య గారు ప్రతిసారీ జానర్ మార్చి కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి తరహా సినిమా నేను ఇప్పటిదాకా చేయలేదు. మా సినిమాలో వివిధ దేశాల ఆర్టిస్టులు నటించారు. ప్రొడ్యూసర్ మీనాక్షి గారికి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నా. మే నెలలో మా ఫణి చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని కేథరీన్ ట్రెసా చెప్పుకొచ్చింది.
ప్రకృతిది కూడా
రైటర్ పద్మ మాట్లాడుతూ.. “ఫణి సినిమా కోసం వీఎన్ ఆదిత్య గారు పిలిచినప్పుడు రోమ్ కామ్ స్టోరీ గానీ లవ్ స్టోరీగాని చెబుతారని అనుకున్నా. కానీ, ఆయన పాము కథ వినిపించారు. ఈ కథలో ఒక బ్యూటిఫుల్ ఇంటెన్షన్ ఉంది. ఈ భూమి మనదే కాదు ప్రకృతిది కూడా అనే మంచి పాయింట్ ఈ కథలో చెబుతున్నాం. కేథరీన్ అందంగా ఉండటమే కాదు అందంగా నటించింది. మా టీమ్ అందరూ ఫణి సినిమా కోసం ప్యాషనేట్‌గా వర్క్ చేశారు” అని తెలిపారు.
ఫణి నటీనటులు
ఇదిలా ఉంటే, ఫణి సినిమాలో కేథరీన్ ట్రెసా, మహేశ్ శ్రీరామ్‌తోపాటు నేహా కృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, రంజిత, యోగిత, ప్రశాంతి హారతి, సాన్య, ఆకాష్, అనిల్ శంకరమంచి, కిరణ్ గుడిపల్లి, బాల కర్రి, దయాకర్, తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం