




Best Web Hosting Provider In India 2024

OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సినవి ఇవే.. తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, నాలుగు సినిమాలు
OTT Weekend Watch: ఓటీటీలో ఈవారం ఎన్నో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. మరి వీటిలో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన కొన్ని సినిమాలు, సిరీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

OTT Weekend Watch: నెట్ఫ్లిక్స్, ఆహా వీడియో ఓటీటీ, ఈటీవీ విన్, జియోహాట్స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. వీటిలో రెండు మలయాళం సినిమాలు, రెండు తెలుగు వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. మరి ఆ మూవీస్, సిరీస్ ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
హోమ్ టౌన్ వెబ్ సిరీస్ – ఆహా వీడియో ఓటీటీ
గతంలో ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన #90’s వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడదే కోవలో మరో వెబ్ సిరీస్ తెలుగులో వస్తోంది. ఈ సిరీస్ పేరు హోమ్ టౌన్. ఈ సిరీస్ ఆహా వీడియో ఓటీటీలో శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వస్తున్న మరో వెబ్ సిరీస్ ఇది. తన కొడుకు యూఎస్ వెళ్లాలని కలలు కనే ఓ తండ్రి, ఆ కలను నెరవేర్చలేక తంటాలు పడే ఓ కొడుకు, అతని స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది.
టచ్ మి నాట్ – జియోహాట్స్టార్
టాలీవుడ్ సీనియర్ నటుడు నవదీప్, కన్నడ హీరో దీక్షిత్ శెట్టి కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ టచ్ మి నాట్. శవాలను ముట్టుకొని అసలు ఆ క్రైమ్ ఎలా జరిగిందో చెప్పే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. జియోహాట్స్టార్ ఓటీటీలో శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఉద్వేగం – ఈటీవీ విన్ ఓటీటీ
గతేడాది థియేటర్లలో రిలీజై నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ ఉద్వేగం. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఈటీవీ విన్ ఓటీటీలో గురువారం (ఏప్రిల్ 3) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓ గ్యాంగ్ రేప్, ఆ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి గురించి ఓ క్రిమినల్ లాయర్ కేసు వాదించడం ఈ మూవీలో చూడొచ్చు.
టెస్ట్ – నెట్ఫ్లిక్స్ ఓటీటీ
నయనతార, మాధవన్, సిద్ధార్థ్ నటించిన తమిళ మూవీ టెస్ట్ (Test) శుక్రవారం (ఏప్రిల్ 4) నేరుగా నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. గొప్ప క్రికెటర్ కావాలని ఒకరు, తన రీసెర్చ్ దేశానికి ఉపయోగపడాలని మరొకరు, తల్లి కావాలని ఇంకొకరు ఇలా ముగ్గురు కలలు, వాళ్లు ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ సాగే మూవీ ఈ టెస్ట్.
ఒరు జాతి జాతకం, మాచంటే మాలఖ – మనోరమ మ్యాక్స్
మనోరమ మ్యాక్స్ ఓటీటీలో వీకెండ్ కోసం రెండు కొత్త మలయాళం సినిమాలు సిద్ధంగా ఉండబోతున్నాయి. వీటిలో ఇప్పటికే ఒరు జాతి జాతకం మూవీ స్ట్రీమింగ్ కు రాగా.. మరొకటి మాచంటే మాలఖ శుక్రవారం (ఏప్రిల్ 4) రానుంది. ఇవి రెండూ కామెడీ జానర్ సినిమాలే. అయితే కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఇవి రానున్నాయి.
సంబంధిత కథనం