



Best Web Hosting Provider In India 2024
Mohammed Shami Sister In Fraud Case: షాక్.. మహ్మద్ షమి సిస్టర్ అంత పని చేసిందా?.. ఆ స్కీమ్ లో ఫ్రాడ్.. ఎంక్వైరీలో నిజాలు
Mohammed Shami Sister In Fraud Case: ఓ వైపు సీనియర్ పేసర్ మహ్మద్ షమి ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నాడు. మరోవైపు అతని సోదరి, ఆమె అత్త కుటుంబం ఫ్రాడ్ కేసులో చిక్కుకుంది.

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి సిస్టర్, ఆమె అత్త చేసిన పని షాక్ కలిగిస్తోంది. షమి సోదరి కుటుంబం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటోంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ చట్టం (ఎమ్ఎన్ఆర్ఈజీఏ)లో ఈ ఫ్యామిలీ ఫ్రాడ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ లో వెల్లడించింది.
ఉపాధి హామీ స్కీమ్
గ్రామాల్లో ప్రజలకు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం గురించి అందరికీ తెలిసిందే. ఈ పథకంలో భాగంగా పనికి వెళ్లే కూలీలకు వేతనాలు చెల్లిస్తారు. కానీ మహ్మద్ షమి సిస్టర్, ఆమె అత్త కుటుంబం మాత్రం పనికి వెళ్లకుండానే అక్రమంగా డబ్బు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలోని గ్రామ సర్పంచ్ అయిన మహ్మద్ షమి సోదరి అత్త గులే ఆయిషా ఈ మోసానికి ప్రధాన సూత్రధారి అని పీటీఐ తెలిపింది.
కూలీకి వెళ్లకుండానే
ఎమ్ఎన్ఆర్ఈజీలో అక్రమాలపై జిల్లా స్థాయి దర్యాప్తులో షమి బంధువులు సహా అనేక మందిని అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఎమ్ఎన్ఆర్ఈజీ వేతనాల అక్రమ చెల్లింపుల ఆరోపణలను నిజమే అని తేలినట్లు జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) నిధి గుప్తా వట్స్ ప్రకటించారు. ఎమ్ఎన్ఆర్ఈజీ కార్మికుల జాబితా రూపొందించిన వాళ్లను సస్పెండ్ చేయాలని, పోలీస్ రిపోర్ట్ రెడీ చేయాలని, పంచాయతీ రాజ్ చట్టం కింద శాఖాత్మక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
“స్థానిక అధికారుల దర్యాప్తులో 18 మంది ఎలాంటి పని చేయకుండానే ఎమ్ఎన్ఆర్ఈజీ వేతనాలు అందుకున్నారని తేలింది. అందులో మహ్మద్ షమి సోదరి షబీనా, షబీనా భర్త ఘజ్నవి, షబీనా ముగ్గురు బావలు ఆమిర్ సుహైల్, నస్రుద్దీన్, షేఖు.. గ్రామ సర్పంచ్ గులే ఆయిషా కుమారులు, కుమార్తెలు ఉన్నారు” అని డీఎం నిధి గుప్తా వట్స్ తెలిపారు.
2021 నుంచి
2021 జనవరిలో ఎమ్ఎన్ఆర్ఈజీ ఉద్యోగ కార్డులలో అక్రమ ఎంట్రీలు నమోదు చేశారు. వీళ్లు ఎలాంటి పని చేయకుండానే 2024-25 ఆగస్టు వరకు వారి బ్యాంక్ ఖాతాలలో వేతనాలు జమ అయ్యాయి అని డీఎం తెలిపారు. దీంతో దుర్వినియోగమైన నిధులను తిరిగి వసూలు చేయడానికి, గ్రామ సర్పంచ్ ఖాతాలను జప్తు చేయడానికి డీఎం ఆదేశించారు.
అక్రమాల గురించి ఇటీవల మీడియా నివేదికలు వచ్చిన తరువాత దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో అప్పటి గ్రామ అభివృద్ధి అధికారి (వీడీఓ), సహాయక కార్యక్రమ అధికారి (ఏపీఓ), ఆపరేటర్, గ్రామ సర్పంచ్ తదితరులు ఈ ఫ్రాడ్ లో భాగమయ్యారని తేలింది. దీనిపై మరింత దర్యాప్తు జరుగుతోంది.
షమి ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న భారత జట్టులోనూ అతనున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link