Iron Tablets in Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి సరైన పద్ధతి ఏంటి?

Best Web Hosting Provider In India 2024

Iron Tablets in Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి సరైన పద్ధతి ఏంటి?

Ramya Sri Marka HT Telugu
Published Apr 03, 2025 04:00 PM IST

Iron Tablets in Pregnancy: గర్భధారణ సమయంలో ప్రతిరోజూ కాల్షియం, ఐరన్ మాత్రలు వేసుకోమని వైద్యులు సూచిస్తారు. అయితే వాటిని వేసుకున్నామా లేదా అన్నట్లుగా కాకుండా సరిగ్గా వేసుకుంటే ప్రయోజనాలను పొందగలరు. గర్భధారణ సమయంలో ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి సరైన పద్ధతి ఏంటో తెలుసుకుందా రండి.

ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఐరన్ ట్యాబ్లెట్లను ఎలా వేసుకోవాలి
ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఐరన్ ట్యాబ్లెట్లను ఎలా వేసుకోవాలి

గర్భధారణ సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తొమ్మిది నెలల పాటు ఉండే ప్రెగ్నెన్సీలో ఆహారంపై, నిద్ర, వంటి అన్ని రకాల విషయంలో శ్రద్ధ వహించడం చాలా అవసరం. ముఖ్యంగా తల్లీ బిడ్డా ఆరోగ్యం కోసం కడుపులోని బిడ్డ ఎదుగుదల కోసం సరైన పోషకాలను తీసుకోవడం చాలా అవసరం. ప్రెగ్నెన్సీ అన్నింటికన్నా ముఖ్యంగా ఐరన్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు.

ఎందుకంటే హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్(ఇనుము) చాలా అవసరం. ఇది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. తల్లి ఆరోగ్యం, బిడ్డ అవయవాల ఎదుగుదల, కణజాలాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడంలో ఐరన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే వైద్యులు గర్భిణీ స్త్రీలకు ఇనుము లభించే ఆహారాలను ఎక్కువగా తినాలిని, ఐరన్ ట్యాబ్లెట్లను తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు.

డాక్టర్ సలహా మేరు చాలా మంది స్త్రీలు ఐరన్ ట్యాబ్లెట్లను తరచుగా వేసుకుంటారు. కానీ వాటిని వేసుకోవడంలో సరైన పద్ధతిని పాటించరు. దీని వల్ల మందుల వేసుకోవడం వల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందలేరు. గర్భధారణలో ఇనుము మాత్రలు తీసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏంటి, వీటిని వేసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

ఐరన్ లోపం వల్ల కలిగే సమస్యలు:

  • తలనొప్పి, చక్రం తిప్పడం
  • బలహీనత, అలసట
  • బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం
  • ప్రాక్లాంప్సియా, ప్రీమేచ్యూర్ బర్త్

ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు

1. రక్తహీనత నివారణ

గర్భధారణలో రక్త పరిమాణం పెరుగుతుండంతో శరీరానికి ఐరన్ అవసరం కూడా పెరుగుతుంది. ఐరన్ తగినంత లేకపోతే రక్తహీనత ఏర్పడి బలహీనత, తలనొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి.

2. ఆక్సిజన్ సరఫరా మెరుగుపరచడం

ఐరన్ అనేది హీమోగ్లోబిన్ ఉత్పత్తికి చాలా అవసరం. ఇది రక్తంలో ఆక్సిజన్‌ను బిడ్డకు సరఫరా చేస్తుంది.ఐరన్ సరిపోకపోతే బిడ్డకు ఆక్సిజన్ తక్కువగా అందుతుంది.

3. బిడ్డ అభివృద్ధి (Fetal Development)

ఐరన్ బిడ్డ మస్తిష్క అభివృద్ధి, అవయవాల పెరుగుదల, రోగనిరోధక శక్తి కోసం అవసరం.సరైన ఐరన్ లేకపోతే బిడ్డలో ప్రాక్లాంప్సియా, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు రావచ్చు.

4. శక్తి స్థాయిలను పెంచడం

ఐరన్ తక్కువగా ఉంటే అలసట, బలహీనత ఎక్కువగా కనిపిస్తుంది. సరిపడా ఐరన్ ఉన్నప్పుడు తల్లి శక్తివంతంగా ఉంటుంది.బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు.

5. ప్రిమేచ్యూర్ బర్త్, గర్భస్రావం నివారణ

ఐరన్ లోపం వల్ల ప్రాక్లాంప్సియా, ప్రీమేచ్యూర్ బర్త్ ప్రమాదం పెరుగుతుంది. ఐరన్ టాబ్లెట్లు ఈ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి.

6. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం

ఐరన్ రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఐరన్ చాలా ముఖ్యం.

7. ప్రసవం తర్వాత త్వరగా కోలుకోవడం (Faster Postpartum Recovery)

ప్రసవం తర్వాత స్త్రీలకు భారీగా రక్త నష్టం జరుగుతుందనేది వాస్తవం. ఐరన్ రక్తనష్టాన్ని పూరించడంలో సహాయపడుతుంది. తల్లి ఆరోగ్యాన్ని త్వరగా మెరుగుపరిచేలా చేస్తుంది.

మంచి ఫలితాల కోసం ఐరన్ ట్యాబెట్లను ఎలా వేసుకోవాలి?

నిజానికి అన్ని మందులను వైద్యులు సూచించిన విధంగావేసుకోవాలి. వారి ప్రకారం.. ఐరన్ ట్యాబ్లెట్లను ఎప్పుడూ తినడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు లేదంటే తిన్న తర్వాత గంట దాటాకనే తీసుకోవాలి.

ఇనుము మాత్రలు వేసుకున్నప్పుడు ఏమి త్రాగాలి?

  • ఐరన్ ట్యాబ్లెట్లను వేసుకున ఒక గ్లాసు నీరు లేదా పండ్ల రసంతో తీసుకోవచ్చు.
  • పాలు, టీ, కాఫీ వంటి పానీయాలను నివారించండి. ఈ పానీయాలు ఇనుము శోషణలో సమస్యలను సృష్టించవచ్చు.
  • విటమిన్ సి ఇనుము శోషణను పెంచుతుంది, కాబట్టి మీ ఇనుము మందులను విటమిన్ సి ఉన్న పానీయాలతో తీసుకోండి. ఉదాహరణకు, ఒక గ్లాసు నారింజ రసం వంటివి తీసుకోండి.

ఇనుము మాత్రల పూర్తి ప్రయోజనం పొందడం ఎలా?

  1. ఇనుము ఖాళీ కడుపుతో ఉత్తమంగా శోషించబడుతుంది.
  2. ఐరన్ ట్యాబ్లెట్ వేసుకునే సమయంలో 2 గంటల మందు, తర్వాత ఏమీ తినకూడదు. కనీసం పాలు లేదా కాఫిన్ ఉన్న పానీయాలను కూడా త్రాగకూడదు.
  3. ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్లను ఎప్పుడూ ఒకేసారి తీసుకోకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024