




Best Web Hosting Provider In India 2024

Masala onion Rings: కరకరలాడే మసాలా ఆనియన్ రింగ్స్‌ను పది నిమిషాల్లో తయారు చేసేయచ్చు.. ఇదిగోండి రెసిపీ!
Masala onion Rings: ఉల్లిపాయలతో పకోడీలు కాకుండా మసాలా ఆనియన్ రింగ్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంట్లో పిల్లలు ఉంటే వీటిని తప్పకుండా చేయాల్సిందే. వీటిని తిన్నారంటే బయట కొనుక్కుని తినడం మానేస్తారు. కరకరలాడే మసాలా ఆనియన్ రింగ్స్‌ను తయారు చేయడం కూడా చాలా సులువు.

కరకరలాడే మసాలా ఆనియన్ రింగ్స్
ఎప్పుడూ ఉల్లిపాయ పకోడీయేనా మమ్మీ వెరైటీగా ఏదైనా చేయచ్చు కదా అనే పిల్లలు మీ ఇంట్లో కూడా ఉంటే ఈ రెసిపీ మీ కోసమే. ఉల్లిపాయలు, శనగపిండితో కేవలం పది నిమిషాల్లో తయారు చేయగల ఆనియన్ రింగ్స్ మీ పిల్లలనే కాదు ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఫుల్‌గా సాటిస్ఫై చేస్తాయి. వీటిని రుచి చూశారంటే ఎవ్వరైనా మెచ్చుకోవాల్సిందే. సాయంత్రం పూట అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథులకు కూడా వీటిని ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ పదార్థాలతో సింపుల్‌గా కరకరలాడే మసాలా ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి.
మసాలా ఆనియన్ రింగ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
- ఉల్లిపాయలు – 5(పెద్దవి)
- శనగపిండి- ఒక కప్పు
- ఉప్పు- రుచికి తగినంత
- చాట్ మసాలా- అర టీ స్పూన్
- పసుపు – అర టీ స్పూన్
- కారం పొడి- రెండు టీ స్పూన్లు
- జీలకర్ర పొడి- ఒక టీ స్పూన్
- కసూరీ మేతీ- అర టీ స్పూన్
- కొత్తిమీర – గుప్పెడు
- నీరు- అరకప్పు
- బ్రెడ్ క్రంప్స్- రెండు కప్పులు
- నూనె డీప్ ఫ్రైకి సరిపడా
మాసాలా ఆనియన్ రింగ్స్ తయారీ విధానం:
- మసాలా ఆనియన్ రింగ్స్ తయారు చేయడం కోసం పెద్ద పెద్ద ఉల్లిపాయలను తీసుకుని పొట్టు తీయండి.
- తర్వాత వీటిని శుభ్రంగా కడిగి గుండ్రంగా కత్తిరించండి.కత్తిరించిన తర్వాత రింగులన్నింటినీ ఒక్కొక్కటిగా విడదీసి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని పొడి చేసి ఒక బౌల్‌లో పెట్టి ఉంచండి.
- తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి, రుచికి తగినంత ఉప్పు, చాట్ మసాలా, పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి వేయండి.
- తరువాత కసూరీ మేతీని చేత్తో నలిపి వేయండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కైడా వేయండి.
- అన్నీ బాగా కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లోనే కొద్ది కొద్దిగా నీరు పోస్తూ చిక్కటి పేస్టులా తయారు చేసుకోండి.
- ఇప్పుడు పిండి రుచి చూసి దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకన్న ఆనియన్ రింగ్స్ వేసి మసాలన్నీ పట్టేలా నెమ్మదిగా కలపండి.
- ఉల్లిపాయ రింగులకు మసాలన్నీ బాగా పట్టిన తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ లో వీటిని ముంచండి.
- ఇలా అన్ని రింగులకు బ్రెడ్ పౌడర్ పట్టించి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోయండి.
- నూనె బాగా వేడెక్కిన తర్వాత మసాలాలు పట్టించి, బ్రైడ్
- పౌడర్‌లో ముంచి ఉంచిన ఉల్లిపాయ రింగులను వేయండి.
- స్టవ్ మీడియం నుంచి హై ఫ్లేమ్ లోకి మార్చుకుంటూ రింగులు చక్కగా బంగారు రంగులోకి మారేంత వరకూ తిప్పుతూ వేయించండి.
- అంతే కరకరలాడే రుచికరమైన మసాలా ఆనియన్ రింగ్స్ రెడీ అయినట్టే.
వీటిని టమాటో సాస్ లేదా పెరుగుతో నంచుకుని తిన్నారంటే యమ్మీ అనకుండా ఉండలేరు. రెసిపీ చాలా సింపుల్ గా ఉంది కదా.. రుచి కూడా అదిరిపోతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి.
సంబంధిత కథనం
టాపిక్