


Best Web Hosting Provider In India 2024

OTT Horror Adventure Movie: ఓటీటీ, టీవీలోకి ఒకేసారి వస్తున్న తమిళ హారర్ అడ్వెంచర్ మూవీ.. డేట్, టైమ్ ఇదే.. నెల రోజుల్లోనే
OTT Horror Adventure Movie: లేటెస్ట్ తమిళ హారర్ అడ్వెంచర్ మూవీ నెల రోజుల్లోనే ఒకేసారి అటు ఓటీటీ, ఇటు టీవీల్లోకి రానుంది. దీనిపై గురువారం (ఏప్రిల్ 3) అధికారిక ప్రకటన వెలువడింది. జీవీ ప్రకాశ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది.

OTT Horror Adventure Movie: హారర్ అడ్వెంచర్ తమిళ మూవీ కింగ్‌స్టన్ (Kingston) ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే ఓటీటీతోపాటు టీవీలోనూ ఈ సినిమా ఒకే సమయానికి రానుండటం విశేషం. ఈ మధ్యకాలంలో తాను హక్కులు పొందిన సినిమాలను చాలా వరకు ఇలాగే తీసుకొస్తోంది జీ నెట్‌వర్క్. ఇప్పుడీ మూవీ కూడా అటు జీ5 ఓటీటీ, ఇటు జీ తమిళం ఛానెల్ లో ఒకే సమయానికి రానుంది.
కింగ్‌స్టన్ ఓటీటీ రిలీజ్ డేట్
జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన మూవీ హారర్ అడ్వెంచర్ మూవీ కింగ్‌స్టన్. ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో రిలీజై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు జీ తమిళం ఛానెల్లోనూ టెలికాస్ట్ కానుంది. ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ప్రారంభం అవుతుందని ఆ నెట్‌వర్క్ వెల్లడించింది.
“సముద్రం పిలుస్తోంది. అతడు పలికాడు. కింగ్‌స్టన్ ఏప్రిల్ 13న రాబోతున్నాడు. ఇండియాలో తొలి మరైన్ ఫ్యాంటసీ బ్లాక్‌బస్టర్ కింగ్‌స్టన్ ఓటీటీ, టీవీలో ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12 గంటలకు ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో జీ తమిళం ట్వీట్ చేసింది. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.5 కోట్లే వసూలు చేసింది.
కింగ్‌స్టన్ మూవీ ఎలా ఉందంటే?
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ కింగ్‌స్టన్. దివ్యభారతి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించాడు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో దక్షిణాదిలో ప్రేమకథలు చాలా వచ్చాయి. కానీ ఆ సినిమాలకు భిన్నంగా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కింగ్‌స్టన్ మూవీ తెరకెక్కింది.
హారర్, జాంబీ, లవ్‌స్టోరీ, యాక్షన్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ దర్శకుడు కమల్ ప్రకాష్ కింగ్‌స్టన్ మూవీని తెరకెక్కించాడు. ఓ ఊరిని వెంటాడుతోన్న ఆత్మ శాపం.. ఆ మిస్టరీని ఛేదించడానికి సముద్రంపైకి వెళ్లిన హీరో..ఈ పాయింట్‌తో రెండున్నర గంటలు ఆడియెన్స్‌కు థ్రిల్ పంచాడు.
కింగ్‌స్టన్ కోసం దర్శకుడు ఎంచుకున్న కథ క్లిష్టమైనది. ఆడియెన్స్ కన్వీన్సింగ్‌గా ఫీలయ్యేలా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో దర్శకుడు తబడబడిపోయాడు. జీవీ ప్రకాష్ యాక్టింగ్ ఈ సినిమాకు పెద ప్లస్సయింది. రా అండ్ రస్టిక్ రోల్‌కు న్యాయం చేశాడు. అతడి లుక్, గెటప్ కథకు తగ్గట్లుగా కుదిరాయి.
సంబంధిత కథనం