TV Directors: టీవీలో డిఫరెంట్ షోలు చేశాం- జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది, సినిమా అలా కాదు: జబర్దస్త్ డైరెక్టర్స్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

TV Directors: టీవీలో డిఫరెంట్ షోలు చేశాం- జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది, సినిమా అలా కాదు: జబర్దస్త్ డైరెక్టర్స్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Apr 03, 2025 10:16 AM IST

Jabardasth Directors Nithin Bharath On Akkada Ammayi Ikkada Abbayi: జబర్దస్త్ కామెడీ షోతో టెలివిజన్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న నితిన్, భరత్ సినిమాకు దర్శకత్వం వహించారు. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా దీపికా పిల్లి హీరోయిన్‌గా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ విశేషాలను పంచుకున్నారు.

టీవీలో డిఫరెంట్ షోలు చేశాం- జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది, సినిమా అలా కాదు: జబర్దస్త్ డైరెక్టర్స్ కామెంట్స్
టీవీలో డిఫరెంట్ షోలు చేశాం- జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది, సినిమా అలా కాదు: జబర్దస్త్ డైరెక్టర్స్ కామెంట్స్

Akkada Ammayi Ikkada Abbayi Directors About TV Shows: టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.

హీరోయిన్‌గా దీపికా పిల్లి

యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో బుల్లితెర బ్యూటి, యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించింది.

ఏప్రిల్ 11న రిలీజ్

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకులు నితిన్, భరత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

ఈ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

-మేము టెలివిజన్‌లో డిఫరెంట్ షోస్ చేశాం. అప్పటినుంచి ప్రదీప్ గారు పరిచయం. ఆయన ఫస్ట్ సినిమాకి చివర్లో ఒక ప్రమోషన్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. అది మాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ప్రదీప్ గారితో చాలా క్రియేటివ్ థాట్స్ షేర్ చేసుకుంటాం. ఒకసారి ఈ ఐడియా చెప్పాము. బావుందన్నారు. తర్వాత బౌండ్ స్క్రిప్ట్ చేసి మొత్తం నరేషన్ ఇచ్చాం. ఆయనకు నచ్చింది. అలా ఈ మూవీ స్టార్ట్ అయింది.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కల్యాణ్ గారి టైటిల్ కదా.. ఈ సినిమాకి ఎంత జస్టిఫికేషన్‌గా ఉంటుంది?

-ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్ అవుతుంది కాబట్టే తీసుకున్నాను. ఇది పవన్ కల్యాణ్ గారి టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుంది. అయితే యాప్ట్‌గా ఉండడం వల్లనే ఈ టైటిల్‌ని తీసుకోవడం జరిగింది.

టీవీ నుంచి సినిమాలకి రావడం ఈ జర్నీ ఎలా ఉంది?

-ఇది బ్యూటిఫుల్ జర్నీ. టెలివిజన్ డిఫరెంట్, మూవీ డిఫరెంట్. ఫిక్షన్‌కి నాన్ ఫిక్షన్‌కి చాలా తేడా ఉంటుంది. మేము ఫిక్షన్‌కి అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా కూడా పనిచేయలేదు. నాన్ ఫిక్షన్‌లో జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది. కానీ, సినిమా అలా కాదు.. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పరిస్థితిలో షూట్ చేయాల్సి వస్తుంది. దాన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయినంత వరకు అర్థం కాదు.

-అయితే మాకు చాలా మంచి టీం ఉంది. మా డీవోపీ బాల్ రెడ్డి గారు, మ్యూజిక్ రదన్ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచి టీం వర్క్‌తో సినిమాని అద్భుతంగా చేశాం.

బుల్లితెర షోలకు దర్శకులుగా

ఇదిలా ఉంటే, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు డైరెక్టర్స్‌గా పరిచయం అవుతున్న నితిన్, భరత్ బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌తో బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, సినిమా చూపిస్తా మావ వంటి తదితర షోలకు దర్శకులుగా పని చేశారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024