




Best Web Hosting Provider In India 2024

Best Crime Thriller Movies on Aha OTT: ఆహా ఓటీటీలో ఉన్న బెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే..
Best Crime Thriller Movies on Aha OTT: ఆహా వీడియో ఓటీటీలో కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నేరుగా తెలుగులో వచ్చినవి కాగా.. మరికొన్ని వివిధ భాషల రీమేక్స్ లేదా డబ్బింగ్ వెర్షన్లు. మరి వీటిలో బెస్ట్ ఏవో చూడండి.

Best Crime Thriller Movies on Aha OTT: క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెలుగుతోపాటు పలు ఇతర సౌత్ ఇండియా భాషల్లో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని ఆహా వీడియో ఓటీటీలో ఉన్నాయి. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళం డబ్బింగ్, రీమేక్స్ కూడా ఈ ఓటీటీలో చూడొచ్చు. వీటిలో బెస్ట్ అనిపించే టాప్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలేంటో చూడండి.
ఆహా వీడియో ఓటీటీలోని బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్
రేఖాచిత్రమ్
మలయాళం మూవీ రేఖాచిత్రమ్ తెలుగు వెర్షన్ ఈ ఆహా వీడియో ఓటీటీలో ఉంది. 40 ఏళ్ల కిందటి ఓ మర్డర్ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఆ చనిపోయింది ఓ అమ్మాయి కావడంతో ఆమె ఎవరు? ఆమెను చంపిన వాళ్లలో ప్రధాన నిందితుడు ఎవరు? అతన్ని ఎలా పట్టుకుంటారన్నది ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలో చూడొచ్చు.
జీబ్రా
సత్యదేవ్ నటించిన ఈ మూవీ గతేడాది నవంబర్ 22న రిలీజ్ కాగా.. డిసెంబర్ 20 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీబ్రా మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఇందులో సత్యదేవ్ బ్యాంకు ఉద్యోగిగా నటించాడు. బ్యాంకు అకౌంట్లో పొరపాటున పడిన రూ.5 కోట్లు.. దాని చుట్టే ఈ మూవీ కథ తిరుగుతుంది.
తెప్ప సముద్రం
తెప్ప సముద్రం మిస్సయిన కొందరు బాలికల కథ. ఓ ఆటో డ్రైవర్, ఓ క్రైమ్ రిపోర్టర్, మరో పోలీస్ ఆఫీసర్ కలిసి ఈ కేసును ఎలా పరిష్కరిస్తారన్నదే ఈ సినిమా స్టోరీ. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటితోపాటు సీనియర్ నటుడు రవిశంకర్ కీలకపాత్రల్లో నటించారు.
శాఖాహారి
శాఖాహారి కన్నడ మూవీ. తెలుగులో డబ్ అయింది. చేయని తప్పుకు దోషిగా మారిన ఓ యువకుడు.. కుటుంబ బాధ్యతలకు, వృత్తి నిర్వహణకు మధ్య నలిగిపోయే ఓ పోలీస్ ఆఫీసర్.. ఎలాంటి బాదరబందీ లేకుండా ఓ చిన్న హోటల్‌ను నిర్వహించే ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి.. ముగ్గురు జీవితాల నేపథ్యంలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా దర్శకుడు సందీప్ సుంకడ్ ఈ సినిమాను తెరకెక్కించారు.
పొలిమేర 2
మా ఊరి పొలిమేర 2 మూవీ చేతబడి, క్షుద్రపూజల చుట్టే తిరుగుతుంది. ఈ మూవీలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవివర్మ, రాఖేందుమౌళి కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది.
కోటబొమ్మాళి పీఎస్
కోటబొమ్మాళి పీఎస్ మూవీలో శ్రీకాంత్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా మలయాళంలో వచ్చిన నాయట్టుకి రీమేక్. తప్పుడు కేసులో ఇరుక్కున్న ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు పరారవుతారు. వాళ్ల జీవితాలు తర్వాత ఏమవుతాయన్నది ఈ సినిమాలో చూడొచ్చు. మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. తెలుగులోనూ ఓ మోస్తరు సక్సెస్ సాధించింది.
మై నేమ్ ఈజ్ శృతి
హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాఫికింగ్ అనే కాన్సెప్ట్‌తో యశోద, టెడ్డీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. కానీ ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా స్కిన్ ట్రేడింగ్ అండ్ గ్రాఫ్టింగ్ అనే పాయింట్‌తో దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మై నేమ్ ఈజ్ శృతి కథను రాసుకున్నాడు. ఈ కొత్త పాయింట్‌కు మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో హన్సిక లీడ్ రోల్లో నటించింది.
సంబంధిత కథనం