



Best Web Hosting Provider In India 2024
దక్షిణాది రాష్ట్రాల ఐక్యత ఇప్పుడు చాలా అవసరం.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు
దక్షిణాది రాష్ట్రాల ఐక్యత ఇప్పుడు మరింత అవసరమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. హిందీని బలవంతంగా రుద్దడం, నియోజకవర్గాల పునర్విభజన వంటి భాషా, రాజకీయ ముప్పుల నేపథ్యంలో దక్షిణాది ఐక్యత ఇప్పుడు చాలా అవసరమని పేర్కొన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు దక్షిణాది రాష్ట్రాల ఐక్యత అవసరం ఎప్పుడూ ఇంతగా లేదని, ఇప్పుడు అవసరం ఎంతో ఉందని అన్నారు. ATM నుండి డబ్బులు తీసుకోవడంపై RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆయన అభ్యంతరం తెలిపారు.
ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు స్టాలిన్ తెలుగు, కన్నడ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, దక్షిణాది ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పారు. మన హక్కులు, గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అందరూ ఏకం కావాలని కోరారు.
‘ఉగాది పండుగ సందర్భంగా ఆశ, ఉత్సాహంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్న నా తెలుగు, కన్నడ సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
‘హిందీని బలవంతంగా రుద్దడం, నియోజకవర్గాల పునర్విభజన వంటి భాషా, రాజకీయ ముప్పుల నేపథ్యంలో దక్షిణాది ఐక్యత ఇప్పుడు ఎంతో అవసరం. మన హక్కులు, గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు మనం ఏకం కావాలి. ఈ ఉగాది ఐక్యత భావాన్ని రేకెత్తిస్తుంది’ అని ఆయన అన్నారు.
RBIపై ఆగ్రహం
ఏటీఎం నుంచి నెలవారీ పరిమితికి మించి మన డబ్బులు మనం ఉపసంహరించుకుంటే బ్యాంకులు రూ.23 వరకు చార్జీలు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చిన RBI నిర్ణయాన్ని స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘కేంద్ర ప్రభుత్వం అందరూ బ్యాంక్ ఖాతాలు తెరవాలని కోరింది. ఆ తర్వాత నోట్ల రద్దు చేసింది. ఇప్పుడు డిజిటల్ ఇండియా పేరుతో డిజిటల్ లావాదేవీలపై చార్జీలు, తక్కువ బ్యాలెన్స్‌కు జరిమానాలు విధిస్తూ వచ్చింది. ఇప్పుడు నెలవారీ పరిమితి కంటే ఎక్కువగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటే రూ. 23 వరకు చార్జీలు వసూలు చేయడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. దీనివల్ల పేదల ఆర్థిక లక్ష్యం ధ్వంసం అవుతుంది’ అని ఆయన అన్నారు.
‘మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ యాక్ట్ (MGNREGA) లబ్ధిదారులు ఇప్పటికే డబ్బుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. మన పథకాల ద్వారా నగదు బదిలీ పొందుతున్న పేదలు ఎక్కువగా దెబ్బతింటారు.’ ‘ఇది డిజిటలైజేషన్ కాదు. ఇది సంస్థాగత దోపిడీ. పేదలను దోచుకుంటారు. ధనవంతులకు లాభం జరుగుతుంది..’ అని ఆయన అన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link