




Best Web Hosting Provider In India 2024

Romantic Comedy OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ – గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో ప్రియుడు బందీ అయితే!
OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఈ తెలుగు మూవీలో అంకిత్ కొయ్య, శ్రియా కొంతం హీరోహీరోయిన్లుగా నటించారు.

Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్, ప్రమోషన్స్ లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి తెలుగు ఆడియెన్స్‌ను ఈ మూవీ సర్‌ప్రైజ్ చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.
మెసేజ్ విత్ కామెడీ…
14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో మూవీలో అంకిత్ కొయ్య, శ్రియా కొంతం హీరోహీరోయిన్లుగా నటించారు. వెన్నెలకిషోర్, ఇంద్రజ కీలక పాత్రల్లో నటించారు. శ్రీహర్ష మన్నే దర్శకత్వం వహించాడు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను నేటితరం యువత ఎలా మిస్‌యూజ్ చేస్తున్నారనే సందేశానికి కామెడీని జోడించి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్…
మార్చి ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం డిసపాయింట్ చేసింది. కామెడీ బాగుందనే టాక్ వచ్చినా కాన్సెప్ట్ అంతగా వర్కవుట్ కాకపోవడంతో 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో బందీగా…
సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు హర్ష. క్రియేటివ్ కిసెస్ యూట్యూబ్ ఛానెల్‌లో పనిచేస్తుంటాడు. డేటింగ్ యాప్‌లో అహాన అనే అమ్మాయితో హర్షకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. పేరేంట్స్ ఓ పెళ్లి కోసం ఊరికి వెళ్లడంతో హర్షను తన ఇంటికి ఆహ్వానిస్తుంది అహాన. పెళ్లి క్యాన్సిల్ కావడంలో అహాన పేరెంట్స్ సడెన్‌గా తిరిగొస్తారు. తల్లిదండ్రుల కంట పడకుండా హర్షను తన రూమ్‌లో దాచేస్తుంది అహాన.
అదే టైమ్‌లో కరోనా అనే అనుమానంతో అహానతో పాటు ఆమె ఫ్యామిలీని అధికారులు ఐసోలేషన్ సెంటర్‌కు పంపిస్తారు. ఇంటికి లాక్ చేయడంతో హర్ష ఇంట్లోనే బంధీ అవుతాడు.ఆ తర్వాత ఏమైంది? 14 రోజులు ఇంట్లోనే లాక్ అయిన హర్ష ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? హర్ష, ఆహాన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ మూవీ కథ.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ…
నాగచైతన్య మజిలీ మూవీతో యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అంకిత్ కొయ్య. అశ్వత్థామ, జోహార్, తిమ్మరుసుతో పాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అయ్, మారుతి నగర్ సుబ్రహ్మణం కామెడీ ప్రధాన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు.
ప్రస్తుతం బ్యూటీ, సింపుల్ సంతోష్ సినిమాల్లో హీరోగా నటిస్తోన్నాడు. సినిమాలే కాకుండా 9 అవర్స్, మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్‌సిరీస్‌లలో నటించాడు అంకిత్ కొయ్య. నాని హీరోగా నటించిన గ్యాంగ్‌లీడర్ మూవీలో శ్రియా కొంతం ఓ కీలక పాత్రలో కనిపించింది.