Release Date: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న అచ్చ తెలుగు అమ్మాయి – రాక్‌స్టార్‌తో ప్రేమ‌లో ప‌డ్డ ఉమ‌

Best Web Hosting Provider In India 2024

Release Date: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న అచ్చ తెలుగు అమ్మాయి – రాక్‌స్టార్‌తో ప్రేమ‌లో ప‌డ్డ ఉమ‌

Nelki Naresh HT Telugu
Published Apr 04, 2025 10:04 AM IST

Release Date: అచ్చ తెలుగు అమ్మాయి సుమ‌య‌రెడ్డి డియ‌ర్ ఉమ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్‌గానే కాకుండా ఈ సినిమాకు రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా సుమ‌య రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తోంది. డియ‌ర్ ఉమ మూవీ ఏప్రిల్ 18న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది.

డియర్ ఉమ మూవీ
డియర్ ఉమ మూవీ

Dear Uma Movie: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు చ‌క్క‌టి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నారు. హీరోయిన్లుగా విజ‌యాల‌ను అందుకుంటూ అద‌ర‌గొడుతోన్నారు. తాజాగా మ‌రో తెలుగు అమ్మాయి సుమ‌య రెడ్డి డియ‌ర్ ఉమ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్‌గానే కాకుండా ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా, రైట‌ర్‌గా కూడా సుమ‌య‌రెడ్డి వ్య‌వ‌హ‌రించింది.

పృథ్వీ అంబ‌ర్ హీరో…

డియ‌ర్ ఉమ మూవీలో పృథ్వీ అంబర్ హీరోగా న‌టిస్తోన్నాడు. ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ అందించారు. . ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రధ‌న్ ఈ ఇనిమాకు సంగీత దర్శకుడిగా పని చేశారు.

మిలియ‌న్ వ్యూస్‌…

డియ‌ర్ ఉమ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఏప్రిల్ 18న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఇప్ప‌టికే డియర్ ఉమ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఈ టీజ‌ర్ యూట్యూబ్‌లో వ‌న్ మిలియ‌న్‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. ఓ రాక్‌స్టార్‌కు సాధార‌ణ యువ‌తికి మ‌ధ్య ప్రేమ ఎలా మొద‌లైంది? వారిద్ద‌రు మ‌ధ్య అపోహ‌ల‌కు కార‌ణం ఏమిటి? క‌ష్టాల్లో ఉన్న ప్రియురాలిని కాపాడేందుకు ఆ యువ‌కుడు ఏం చేశాడు? అనే అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఫీల్‌గుడ్ ల‌వ్‌స్టోరీ…

ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు మ‌హిళా సాధికార‌త‌కు సంబంధించి చ‌క్క‌టి సందేశాన్ని ఇచ్చేలా ఈ మూవీ ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా అంశాల క‌ల‌బోత‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీ ఉంటుంద‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు. .

క‌మ‌ల్ కామ‌రాజు…

డియ‌ర్ ఉమ మూవీలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. క‌న్న‌డ సినిమాల‌తో కెరీర్‌ను ప్రారంభించాడు పృథ్వీ అంబ‌ర్‌. క‌న్న‌డంలో దియా, భైరాగి, క‌ర్వ‌, షుగ‌ర్‌లెస్‌తో పాటు ప‌లు సినిమాలు చేశాడు. తెలుగులో అర్జున్‌రెడ్డి, హుషారు, ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంతో పాటు ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌కు ర‌ధ‌న్ మ్యూజిక్ అందించాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024