




Best Web Hosting Provider In India 2024

Revenge Thriller Movie: జబర్ధస్థ్ యాంకర్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ -హీరోగా తెలుగు సీరియల్ యాక్టర్
Revenge Thriller Movie: జబర్ధస్థ్ యాంకర్ సిరి హనుమంతు హీరోయిన్‌గా నటించిన నరసింహాపురం గురువారం యూట్యూబ్‌లో రిలీజైంది. రివేంజ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సీరియల్ యాక్టర్ నందకిషోర్ హీరోగా నటించాడు.

Revenge Thriller Movie: జబర్ధస్థ్ యాంకర్ సిరి హనుమంతు హీరోయిన్‌గా నటించిన నరసింహాపురం మూవీ గురువారం యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగు సీరియల్ యాక్టర్ నందకిషోర్ ధూళిపాళ హీరోగా నటించగా…విజయ్‌కుమార్, కళ్యాణమాధవి, రంగధామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రీరాజ్ బళ్లా దర్శకత్వం వహించాడు.
2021లో రిలీజ్…
2021లో నరసింహాపురం మూవీ థియేటర్లలో రిలీజైంది. సిస్టర్ సెంటిమెంట్‌కు రివేంజ్, లవ్ డ్రామాను జోడించి దర్శకుడు శ్రీరాజ్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో గ్లామర్ ప్రధాన పాత్రలో సిరి హనుమంతు కనిపించింది. నరసింహాపురం సినిమాతోనే సీరియల్ యాక్టర్ నందకిషోర్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నరసింహాపురం మూవీ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
నందా అంటే ప్రాణం…
నందాకు చెల్లెలు అంటే ప్రాణం. నందా కళ్ల ముందే అతడి చెల్లెలిని కొందరు దారుణంగా హత్య చేస్తారు. చెల్లెలి మరణంతో నందా పిచ్చివాడైపోతాడు. అతడిని సిరి చేరదీస్తుంది. సిరి ప్రేమ కారణంగా పిచ్చివాడైన నందా తిరిగి మామూలు మనిషిగా మారతాడు. సిరి కూడా చంపాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. వారికి నందా ఎలాంటి శిక్ష విధించాడు? నందా చెల్లెలి చావుకు కారకులు ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న సిరి హనుమంతు ఫైనల్ చేరుకున్నది. ఫోర్త్ రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన సిరి హనుమంతు పలు సినిమాలు, టీవీ షోస్‌లో కనిపించింది. నరసింహాపురంతో పాటు జోరుగా హుషారుగా, తెల్లవారితే గురువారం, గీతాంజలి మళ్లీ వచ్చిందితో పాటు మరికొన్ని సినిమాల్లో విభిన్నమైన క్యారెక్టర్స్ చేసింది. పులిమేక వెబ్‌సిరీస్‌లో నటించింది.
జబర్ధస్థ్‌కు గుడ్‌బై…
జబర్ధస్థ్ కామెడీ షోకు కొంతకాలం యాంకర్‌గా పనిచేసింది సిరి హనుమంతు. తన గ్లామర్ తళుకులతో ఈ షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అనూహ్యంగా జబర్ధస్థ్‌కు ఇటీవలే గుడ్‌బై చెప్పేసి అందరికి షాకిచ్చింది సిరి హనుమంతు.
సీరియల్ యాక్టర్…
మరోవైపు తెలుగులో సీనియర్ సీరియల్ యాక్టర్‌గా కొనసాగుతోన్నాడు నందకిషోర్. చిలసౌ స్రవంతి, ఉప్పెనతో పాటు పలు సీరియల్స్ చేశాడు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాడు.
సంబంధిత కథనం