



Best Web Hosting Provider In India 2024

Hebah Patel: నేను ఎక్కువగా జైలులో కనిపిస్తాను.. తమన్నాపై హీరోయిన్ హెబ్బా పటేల్ కామెంట్స్
Hebah Patel About Odela 2 Movie And Tamannaah Bhatia: తమన్నా భాటియా, హెబా పటేల్ నటించిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీ సంపత్ నంది విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వం వహించారు. తాజాగా ఓదెల 2, తమన్నాపై హెబ్బా పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Hebah Patel About Odela 2 Movie And Tamannaah Bhatia: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా నటించిన తెలుగు సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. ఎప్పడు కనిపించని కొత్త విధంగా ఇందులో తమన్నా కనిపించనుంది. తమన్నాతోపాటు ఓదెల 2 సినిమాలో హీరోయిన్ హెబ్బా పటెల్ కూడా యాక్ట్ చేసింది.
ఏప్రిల్ 17న ఓదెల 2 రిలీజ్
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఓదెల రైల్వె స్టేషన్ మూవీకి ఓదెల 2 సీక్వెల్‌గా తెరకెక్కింది. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్‌లో ఓదెల 2 మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 17న థియేటర్లలో ఓదెల 2 రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా సినీ విశేషాలను బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ పంచుకుంది.
ఓదెల రైల్వే స్టేషన్ సినిమా చేసినప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుందని అనుకున్నారా?
–ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైంలో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది.
-ఓదెల సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు. కరోనా సమయంలో ఒక చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన ఓదెల ఘనవిజయాన్ని అందుకొని, ఇప్పుడు ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ ఓదెల 2ని ప్రేక్షకులకు ముందు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.
ఓదెల 1కి ఓదెల 2కి డిఫరెన్స్ ఏంటి?
-ఓదెల1 అవుట్ అండ్ అవుట్ మర్డర్ మిస్టరీ. ఓదెల 2 సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 మచ్ బిగ్గర్. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్‌కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
తమన్నా గారితో మీ కాంబినేషన్ సీన్స్ ఎలా ఉంటాయి?
-ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్‌లో కనిపిస్తాను. ఫస్ట్ పార్ట్‌లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్‌లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.
-కుమారి 21ఎఫ్ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది. ఓదెల సినిమా యాక్టర్‌గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
సంబంధిత కథనం