Arts courses : క్లాస్​ 12 తర్వాత ఏం చేయాలి? ఇంజినీరింగ్​ ఒక్కటే కాదు, ‘ఆర్ట్స్’​లో కూడా అద్భుత అవకాశాలు..

Best Web Hosting Provider In India 2024


Arts courses : క్లాస్​ 12 తర్వాత ఏం చేయాలి? ఇంజినీరింగ్​ ఒక్కటే కాదు, ‘ఆర్ట్స్’​లో కూడా అద్భుత అవకాశాలు..

Sharath Chitturi HT Telugu
Published Apr 05, 2025 06:11 AM IST

క్లాస్​ 12 తర్వాత ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా? ఆర్ట్స్​వైపు వెళ్లాలని ప్లాన్​ చేస్తున్నారా? మరి క్లాస్​ 12 తర్వాత ఆర్ట్స్​ స్ట్రీమ్​లో ఉండే అవకాశాలేంటి? ఆ తర్వాత ఉద్యోగాలు ఎలా ఉంటాయి? పూర్తి లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

క్లాస్​ 12 తర్వాత ఏం చేయాలి?
క్లాస్​ 12 తర్వాత ఏం చేయాలి? (Unsplash)

సైన్స్​, కామర్స్​తో పోల్చితే ఒకప్పుడు క్లాస్​ 12 ఆర్ట్స్​ అండ్​ హ్యుమానిటీస్​కి పెద్దగా ఆదరణ లభించేది కాదు. అందులో కెరీర్​ ఉండదని చాలా మంది భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విద్యార్థికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) వంటి సాంప్రదాయ కోర్సులు ఇప్పటికీ అత్యంత ప్రాచుర్యం పొందిన ఆప్షన్​గా ఉన్నప్పటికీ, వారు అన్వేషించగల అనేక ఇతర అవకాశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో చాలా కోర్సులు కేవలం ఆర్ట్స్​కే పరిమితం కాకుండా ఇతర స్ట్రీమ్ ల విద్యార్థులు కూడా అర్హతను బట్టి వాటిని అభ్యసించవచ్చు. ఈ నేపథ్యంలో క్లాస్​ 12 తర్వాత ఆర్ట్స్​లో కనిపిస్తున్న అవకాశాల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి. కెరీర్​ని బిల్డ్​ చేసుకునేందుకు ఉపయోగపడతుంది.

క్లాస్​ 12 తర్వాత ఆర్ట్స్​ కోర్సులు..

బ్యాచిలర్​ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ)

ఉద్యోగావకాశాలు: గ్రాఫిక్ డిజైనర్, ఇలస్ట్రేటర్, యానిమేటర్, ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ టీచర్, ఆర్ట్ క్రిటిక్, ఫొటోగ్రాఫర్, డిజైనర్​, ఎగ్జిబిషన్ డిజైనర్, విజువలైజర్, సెట్ డిజైనర్.

బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (బీజేఎంసీ)

ఉద్యోగావకాశాలు: జర్నలిస్ట్, రిపోర్టర్, న్యూస్ అనలిస్ట్, న్యూస్ ఎడిటర్, ఫీచర్ రైటర్, కాపీ రైటర్, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్, అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్, కంటెంట్ రైటర్, స్క్రిప్ట్ రైటర్, రేడియో జాకీ, వీడియో జాకీ, న్యూస్ యాంకర్, కరస్పాండెంట్.

బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడీఎస్)

ఉద్యోగావకాశాలు: ఫ్యాషన్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, యూజర్ ఎక్స్​పీరియన్స్ (యూఎక్స్) డిజైనర్, వెబ్ డిజైనర్, ఇండస్ట్రియల్ డిజైనర్, ఎగ్జిబిషన్ డిజైనర్, ప్రొడక్ట్ డిజైనర్, విజువల్ మర్కండైజర్, టెక్స్​టైల్ డిజైనర్

బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ (బీఎస్​డబ్ల్యూ)

ఉద్యోగావకాశాలు: సోషల్ వర్కర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎన్జీవో వర్కర్, కౌన్సిలర్, రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్, ఫ్యామిలీ సపోర్ట్ వర్కర్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, పాలసీ అనలిస్ట్, రీసెర్చర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, యూత్ వర్కర్.

బ్యాచిలర్​ ఆఫ్​ లైబ్రెరీ సైన్స్​ (బీ. ఎల్​ఐబీ. ఎస్​సీ)

ఉద్యోగావకాశాలు: లైబ్రేరియన్, లైబ్రరీ అసిస్టెంట్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, ఆర్కివిస్ట్, రికార్డ్ మేనేజర్, నాలెడ్జ్ మేనేజర్, కంటెంట్ మేనేజర్, రీసెర్చర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్.

బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)

ఉద్యోగావకాశాలు: టీచర్, ఎడ్యుకేషన్ కౌన్సెలర్, ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్, కరిక్యులమ్ డెవలపర్, ఎడ్యుకేషనల్ కంటెంట్ డెవలపర్, ఎడ్యుకేషన్ రీసెర్చర్, ఇన్ స్ట్రక్షన్ డిజైనర్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్.

బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీ (బీఫిల్)

ఉద్యోగావకాశాలు: రిసెర్చ్ అసిస్టెంట్, రైటర్, ప్రొఫెసర్, క్రిటిక్, థింక్ ట్యాంక్ స్పెషలిస్ట్, పాలసీ అనలిస్ట్, సోషల్ వర్కర్, పొలిటికల్ అనలిస్ట్, డిప్లొమాట్, ఫిలాసఫర్.

బ్యాచిలర్ ఆఫ్ లా (ఎల్ఎల్​బీ)

ఉద్యోగావకాశాలు: లాయర్, లీగల్ అడ్వైజర్, లీగల్ కన్సల్టెంట్, లీగల్ అనలిస్ట్, లీగల్ జర్నలిస్ట్, లా ప్రొఫెసర్, కార్పొరేట్ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, లీగల్ రీసెర్చర్, మేజిస్ట్రేట్, జడ్జి.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ హిస్టరీ

ఉద్యోగావకాశాలు: చరిత్రకారుడు, ఆర్కివిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్, కంటెంట్ డెవలపర్, టీచర్, మ్యూజియం క్యూరేటర్, హెరిటేజ్ స్పెషలిస్ట్, ఆర్కియాలజిస్ట్, రైటర్, పాలసీ అనలిస్ట్, డిప్లొమాట్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ జాగ్రఫీ

ఉద్యోగావకాశాలు: కార్టోగ్రాఫర్, జియోగ్రాఫర్, జీఐఎస్ స్పెషలిస్ట్, సర్వేయర్, అర్బన్ ప్లానర్, ఎన్విరాన్మెంటల్ అనలిస్ట్, డెమోగ్రాఫర్, ట్రావెల్ అండ్ టూరిజం కన్సల్టెంట్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పొలిటికల్ సైన్స్

ఉద్యోగావకాశాలు: పొలిటికల్ అనలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్పెషలిస్ట్, పొలిటికల్ కన్సల్టెంట్, పబ్లిక్ అఫైర్స్ స్పెషలిస్ట్, లాబీయిస్ట్, డిప్లొమాట్, క్యాంపెయిన్ మేనేజర్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సోషియాలజీ

ఉద్యోగావకాశాలు: సోషల్ వర్కర్, హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, కమ్యూనిటీ సర్వీస్ మేనేజర్, కౌన్సిలర్, నాన్ ప్రాఫిట్ అడ్మినిస్ట్రేటర్, పాలసీ అనలిస్ట్, అర్బన్ ప్లానర్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్

ఉద్యోగావకాశాలు: ఎడిటర్, రైటర్, కంటెంట్ డెవలపర్, కాపీ రైటర్, టెక్నికల్ రైటర్, టీచర్/లెక్చరర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ట్రాన్స్​లేటర్, జర్నలిస్ట్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్

ఉద్యోగావకాశాలు: ఎకనామిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, స్టాటిస్టీషియన్, కన్సల్టెంట్, పబ్లిక్ పాలసీ అనలిస్ట్, బడ్జెట్ అనలిస్ట్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఆంత్రపాలజీ

ఉద్యోగావకాశాలు: ఆర్కియాలజిస్ట్, కల్చరల్ రిసోర్స్ మేనేజర్, మ్యూజియం క్యూరేటర్, లాభాపేక్ష లేని అడ్మినిస్ట్రేటర్, సోషల్ రీసెర్చర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్, హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్, ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఆర్కియాలజీ

ఉద్యోగావకాశాలు: ఆర్కియాలజిస్ట్, హెరిటేజ్ మేనేజర్, మ్యూజియం క్యూరేటర్, కల్చరల్ రిసోర్స్ మేనేజర్, ఆర్ట్ హిస్టారియన్, హిస్టారికల్ సైట్ మేనేజర్, రీసెర్చర్, కన్జర్వేటర్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

ఉద్యోగావకాశాలు: గవర్నమెంట్ ఆఫీసర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్, హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్, అర్బన్ ప్లానర్, పాలసీ అనలిస్ట్, నాన్ ప్రాఫిట్ అడ్మినిస్ట్రేటర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, సోషల్ వర్కర్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ జెండర్ స్టడీస్

ఉద్యోగావకాశాలు: జెండర్ రీసెర్చర్, జెండర్ అడ్వైజర్, ఉమెన్ రైట్స్ అడ్వకేట్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ లింగ్విస్టిక్స్

ఉద్యోగావకాశాలు: ట్రాన్స్​లేటర్, లాంగ్వేజ్ ఎడ్యుకేటర్, స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజిస్ట్, టెక్నికల్ రైటర్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్

ఉద్యోగావకాశాలు: యాక్టర్​, డైరక్టర్​, నిర్మాత, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్, స్టేజ్ మేనేజర్, మ్యూజిషియన్, నాటక రచయిత, సెట్ డిజైనర్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ మ్యూజిక్

ఉద్యోగావకాశాలు: మ్యూజిక్ కంపోజర్, మ్యూజిషియన్, మ్యూజిక్ టీచర్, మ్యూజిక్ థెరపిస్ట్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, సౌండ్ ఇంజనీర్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ థియేటర్

ఉద్యోగావకాశాలు: యాక్టర్​, డైరక్టర్​, నాటక రచయిత, స్టేజ్ మేనేజర్, థియేటర్ క్రిటిక్, థియేటర్ ఎడ్యుకేటర్.

ఫిల్మ్ స్టడీస్​లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్

ఉద్యోగావకాశాలు: ఫిల్మ్ క్రిటిక్, ఫిల్మ్ మేకర్, స్క్రీన్ ప్లే రైటర్, ఫిల్మ్ డైరెక్టర్, ఫిల్మ్ ఎడిటర్, ఫిల్మ్ రీసెర్చర్, ఫిల్మ్ హిస్టారియన్.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ విజువల్ ఆర్ట్స్

ఉద్యోగావకాశాలు: ఆర్టిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్, ఆర్ట్ హిస్టారియన్, క్యూరేటర్, ఆర్ట్ థెరపిస్ట్.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link