



Best Web Hosting Provider In India 2024

AP TG Weather Updates : ఏపీలో భిన్న వాతావరణం…. ఈ 3 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు హెచ్చరికలు..!
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఏపీలో ఈ మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఎండలు కూడా ఉంటాయని… రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉందని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఈ మూడు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మోస్తారు నుంచి భారీ వర్ష సూచన…
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ,రేపు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కాకినాడలో మోస్తారు వర్షాలు పడుతాయని వివరించింది. సోమవారం అల్లూరి,కాకినాడ,తూర్పుగోదావరి,ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు చెట్లు క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. గురువారం 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయని అలాగే 23 ప్రాంతాల్లో 50మిమీ పైగా వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మన్యం జిల్లాలోని జియ్యమ్మవలసలో 39.9°C అధిక ఉష్ణోగ్రత నమోదైందని వివరించింది.
తెలంగాణలో తేలికపాటి వర్షాలు:
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కూడా ఇదే మాదిరి వాతావరణం ఉండొచ్చని అంచనా వేసింది.
ఇక ఏప్రిల్ 7వ తేదీ నుంచి మళ్లీ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది. ఏప్రిల్ 10వ తేదీ వరకు తేలికపాటి జల్లులు కురుస్తాయని ప్రకటించింది.
టాపిక్