




Best Web Hosting Provider In India 2024

Malayalam Movie: తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ
Malayalam Movie: పృథ్వీరాజ్‌సుకుమారన్ హీరోగా నటించిన మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తీర్పు తెలుగులో రిలీజైంది. తీర్పు పేరుతోనే యూట్యూబ్‌లో ఫ్రీగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఇంద్రజీత్ సుకుమారన్, ఇషా తల్వార్ కీలక పాత్రల్లో నటించారు

Malayalam Movie: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తీర్పు తెలుగులో అదే పేరుతో డబ్ అయ్యింది. ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో ఈ మూవీ రిలీజైంది. తీర్పు మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు ఇంద్రజీత్ సుకుమారన్, ఇషా తల్వార్, విజయ్ బాబు కీలక పాత్రల్లో నటించారు. రతీష్ అంబాట్ దర్శకత్వం వహించారు.
థియేటర్లలో డిజాస్టర్…
2022లో థియేటర్లలో రిలీజైన తీర్పు మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయ్ బాబు…డైరెక్టర్ రతీష్ అంబాట్, మ్యూజిక్ డైరెక్టర్ మురళీ గోపీ కలిసి తీర్పు సినిమాను ప్రొడ్యూస్ చేశారు. తీర్పు మూవీకి హీరోయిన్ మమతా మోహన్ దాస్ వాయిస్ ఓవర్ అందించింది.
తీర్పు కథ ఇదే…
అబ్దుల్లా మరక్కర్, రామ్‌కుమార్ నాయర్, కళ్యాణ్ మీనన్, పరమేశ్వరన్ పొట్టి చిన్ననాటి స్నేహితులు.అబ్దుల్లా మరక్కర్ తండ్రిని మిగిలిన ముగ్గురు స్నేహితుల తండ్రులు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసం కారణంగా అబ్దుల్లా మరక్కర్ తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు.
కుటుంబం వీధిపాలవుతుంది.పగతో రగలిపోయిన అబ్దుల్లా తన స్నేహితులతో పాటు వారి కుటుంబాలపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తాను కోల్పోయిన ఆస్తులను తిరిగి ఎలా సొంతం చేసుకున్నాడు? ఈ ప్రతీకారంలో అతడికి సాయం చేసిన డీఐజీ కళ్యాణ్ ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
రియల్ లైఫ్‌లో అన్నదమ్ములు…
తీర్పు మూవీలో హీరోలుగా నటించిన పృథ్వీరాజ్ సుకుమార్, ఇంద్రజీత్ సుకుమారన్ రియల్‌లైఫ్‌లో అన్నదమ్ములు కావడం గమనార్హం. వీరిద్దరి కాంబోలో పోలీస్, ఒరువన్, సిటీ ఆఫ్ గాడ్, బ్యాచ్‌లర్ పార్టీతో పాటు పలు మలయాళ సినిమాలు వచ్చాయి.
హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ…
ఇటీవలే ఎల్2 ఎంపురన్ మూవీతో దర్శకుడిగా ప్రేక్షకులను పలకరించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. మోహన్‌లాల్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ పది రోజుల్లో 250 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మరో మలయాళ హీరో టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. మలయాళం సినీ హిస్టరీలో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. లూసిఫర్ మూవీకి సీక్వెల్‌గా ఎంపురాన్ తెరకెక్కింది.
సంబంధిత కథనం
టాపిక్