




Best Web Hosting Provider In India 2024

Horror OTT: ఒకేరోజు రెండు ఓటీటీలలో రిలీజైన తమిళ హారర్ -దయ్యాల కోసం యూట్యూబర్ల అన్వేషణ – ఐఎమ్‌డీబీలో 7.5 రేటింగ్
Horror OTT: తమిళ హారర్ మూవీ ముర్‌ముర్ ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు టెంట్‌కోట ఓటీటీలలో ఈ మూవీ స్ట్రీమింగ్. ఫౌండ్ ఫుటేజ్ హారర్ కాన్సెప్ట్‌తో ప్రయోగాత్మకంగా ఈ సినిమా రూపొందింది.

Horror OTT: తమిళ హారర్ మూవీ ముర్‌ముర్ ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైంది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌తో పాటు టెంట్‌కోట ద్వారా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ముర్‌ముర్ ఓటీటీలోకి రావడం గమనార్హం.
ప్రయోగాత్మకంగా…
ఫౌండ్‌ఫుటేజ్ కాన్సెప్ట్‌తో ప్రయోగాత్మకంగా ముర్‌ముర్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు హేమంత్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ద్వారా పలువురు కొత్త యాక్టర్స్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రిచీకపూర్, దేవరాజ్ ఆర్ముగం, సుగణ్య షణ్ముగం, యువిక రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు.
ఐఎమ్‌డీబీలో..
టెక్నికల్‌గా ముర్‌ముర్ మూవీ బాగుందనే కామెంట్స్ వచ్చినా కమర్షియల్‌గా మాత్రం యావరేజ్‌గా నిలిచింది. కానీ బడ్జెట్ తక్కువ కావడంతో నిర్మాతలకు ఈ హారర్ మూవీ లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. ముర్‌ముర్ మూవీకి ఐఎమ్‌డీబీలో 7.5 రేటింగ్ వచ్చింది.
నలుగురు యూట్యూబర్లు…
మెల్విన్, రిషి, అంకిత, జెనిఫర్ యూట్యూబర్లు. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తుంటారు. అడవి మధ్యలో ఉన్న సప్త కన్నిగల్ అనే ప్రాంతాన్ని మంగం అనే దయ్యం పట్టి పీడిస్తుందనే పుకారు ఉంటుంది. ఆ ప్రాంతం గురించి నిజాలను వెలికితీయాలని అడవిలోకి అడుగుపెడతారు. అక్కడ వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? నలుగురు స్నేహితులు అదృశ్యం కావడానికి కారణం ఏమిటి? వారి కెమెరాలలోరికార్డ్ అయిన వీడియోల ద్వారా ఈ ప్రాంతం గురించి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అన్నదే మురుముర్ మూవీ కథ.
హాలీవుడ్‌లో ఫేమస్…
ఫౌండ్ ఫుటేజ్ హారర్ కాన్సెప్ట్ హాలీవుడ్‌లో చాలా ఫేమస్. ఆ కాన్సెప్ట్‌తో వచ్చిన పారానార్మల్ యాక్టివిటీ, రెక్‌తో పాటు పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఆ హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ముర్‌ముర్ మూవీని తెరకెక్కించారు దర్శకుడు. విజువల్స్, సౌండ్స్‌తోనే ఆడియెన్స్‌ను భయపెట్టించాడు.
ఐదు కోట్ల కలెక్షన్స్…
ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ముర్‌ముర్ థియేటర్లలో ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. తొలిరోజు ఈ మూవీకి పది లక్షలు మాత్రమే వసూళ్లు వచ్చాయి. మౌత్ టాక్ బాగుండటంతో మూడో రోజు కోటిన్నర వరకు వసూళ్లను దక్కించుకున్నది.
సంబంధిత కథనం