

Best Web Hosting Provider In India 2024
AP Medical Jobs 2025 : అనంతపురం జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు – దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలివే
అనంతపురం జిల్లాలోని ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 16 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఏప్రిల్ 10వ తేదీ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా లాస్ట్ గ్రేడ్ సర్వీస్(గ్రేడ్-4) ఉద్యోగాలు 08 ఉన్నాయి. క్లినికల్ సైకాలజిస్ట్ – 01 ఆడియోలజిస్ట్/స్పీచ్ థెరపిస్ట్ – 01, ఫార్మసీ ఆఫీసర్ – 01 డేటా ఎంట్రీ ఆపరేటర్ 04, అప్టొమెట్రిస్ట్ -1 పోస్టు ఉంది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో… మిగతా ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను అనుసరించి అర్హతలను నిర్ణయించారు. ఫార్మసీ పోస్టుకు డీ ఫార్మీసీ, బీ ఫార్మసీ నిర్ణయించారు. మరికొన్ని పోస్టులకు ఎం.ఫిల్, ఎంఏ సైకాలజీలో పాసై ఉండాలి. ఈ వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు.
2025 జనవరి 1 నాటికి వయస్సు 42 ఏళ్లలోపు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వయస్సు దాటకూడదు. అప్లికేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 150, దివ్యాంగ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. “District Medical & Health Officer, Ananthapuramu” పేరుపై డీడీ తీయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ – దరఖాస్తు ప్రాసెస్
ఎంపిక ప్రక్రియలో 100 మార్కులు ఉంటాయి. అందులో విద్యా అర్హతలోని సబ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభవానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడాది ఒక మార్కు కేటాయిస్తారు. అలా గరిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు. అనుభవానికి సంబంధించి మార్కులను కూడా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు. పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు. ఆరు నెలల కంటే తక్కువ ఉన్నసర్వీసుకు ఎలాంటి వెయిటేజ్ ఇవ్వరు. కొవిడ్ సర్వీస్ విషయంలో ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. ఎంపికైన వారు ఏడాది కాలానికిగాను పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెన్యూవల్ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
దరఖాస్తు ఫారమ్ ను అధికార వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వివరాలను పూర్తి చేసి… విద్యార్హతలు, ఉద్యోగ అనుభవాలతో కూడిన జిరాక్స్ కాపీ సెట్‌ను ” DM&HO అనంతపురం కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 10వ తేదీన సాయంత్రం 5.30 గంటలలోపు ఇవ్వాలి.
ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తిస్థాయి నోటిఫికేషన్ తో పాటు దరఖాస్తు ఫామ్ ను కూడా పొందవచ్చు….
టాపిక్