


Best Web Hosting Provider In India 2024
TG Indiramma Housing Scheme : ప్రైవేట్ ఇంజనీర్లకు ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యత.. 390 మందికి గ్రీన్ సిగ్నల్!
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఇంజనీర్లకు ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను అప్పగించబోతోంది. గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగులు సరిపడా లేరు. దీంతో ప్రైవేటుపై ఆధారపడాల్సి వస్తోంది.
తెలంగాణలో గృహ నిర్మాణ శాఖ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం అమలుకు కూడా సరిపడా సిబ్బంది లేరు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీర్లకు అప్పగించబోతోంది. మొదట 390 మందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు మ్యాన్‌పవర్ సప్లయర్స్‌కు బాధ్యతను అప్పగించింది.
జీతం రూ.33,800..
దీనికి సంబంధించిన ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. ఈనెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో ఎంపికైనవారు అసిస్టెంట్ ఇంజనీర్ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది. తొలుత ఒక సంవత్సరం కోసం వీరితో గృహనిర్మాణ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. మరో రెండుమూడు వారాల్లో ఈ ప్రైవేట్ ఇంజనీర్లు విధుల్లోకి వచ్చే అవకాశం ఉంది. వీరికి నెలకు రూ.33,800 చొప్పున చెల్లించనున్నట్టు సమాచారం.
గృహ నిర్మాణ శాఖ నిర్వీర్యం..
ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖలో సరిపడా ప్రభుత్వ ఇంజనీర్లు ఉండేవారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఆ సమయంలో సొంత సిబ్బంది సరిపోక.. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కొందర్ని తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వీరిని తొలగించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని కూడా రద్దు చేసింది. ఆ తర్వాత గృహ నిర్మాణ శాఖ క్రమంగా నిర్వీర్యమైంది. దాన్ని రోడ్లు భవనాల శాఖలో కలిపేశారు. అప్పటినుంచి ప్రత్యేకంగా స్టాఫ్ లేరు. గృహ నిర్మాణ సంస్థలోని ఇంజినీర్లను వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాలకు బదిలీ చేశారు.
ఇప్పుడు మళ్లీ అవసరం..
ఇప్పుడు మళ్లీ పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీంతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఇంజనీర్లను తిరిగి గృహ నిర్మాణ సంస్థకు రప్పించారు. ఇప్పుడు 125 మంది ఇంజనీర్లు దీంట్లో పనిచేస్తున్నారు. గృహ నిర్మాణ సంస్థలో 505 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను వినియోగించుకునేలా పోస్టులకు అనుమతి ఉంది. ప్రస్తుతం 125 మందే ఉన్నారు. మిగతావారిని టీజీపీఎస్సీ ద్వారా నియమించుకోవాలి. కానీ ఆ పని మాత్రం చేయడం లేదు.
టీజీపీఎస్సీకి వివరాలు ఇవ్వలేదు..
ఇటీవల తెలంగాణ పబ్లిస్ సర్విస్ కమిషన్ నియామక ప్రక్రియలో.. గృహ నిర్మాణ శాఖ ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో, ఆ వివరాలు ఇవ్వలేదు. ఫలితంగా ఇటీవల గ్రూప్ పరీక్షల్లో వీటిని చేర్చలేదు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకునే వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ నియామకాల్లో చూపలేదన్న వాదన ఉంది. ప్రస్తుతానికి ఔట్ సోర్సింగ్ ఇంజనీర్ల సేవలు వినియోగించుకొని.. తదుపరి నియామక ప్రక్రియలో తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ.. అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంతో తెలియని పరిస్థితి.
సంబంధిత కథనం
టాపిక్