




Best Web Hosting Provider In India 2024

OTT Romantic Comedy: మరో ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Romantic Comedy: ఒరు జాతి జాతకం చిత్రం మరో ఓటీటీలోకి వచ్చింది. మరో పాపులర్ ప్లాట్‍ఫామ్‍లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..

మలయాళ నటుడు వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఒరు జాతి జాతకం చిత్రం ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మిక్స్డ్ వచ్చింది. కానీ లోబడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఈ చిత్రానికి ఎం.మోహనన్ దర్శకత్వం వహించారు. ఒరు జాతి జాతకం చిత్రం ఇటీవలే ఓ ఓటీటీలోకి రాగా.. తాజాగా మరో ప్లాట్‍ఫామ్‍లోనూ ఎంట్రీ ఇచ్చింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఒరు జాతి జాతకం సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ ఇటీవలే మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులోకి వచ్చింది. రెండు ఓటీటీల్లో మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఒరు జాతిజాతకం చిత్రంలో వినీత్ శ్రీనివాసన్‍తో పాటు మృధుల నాయర్, పీపీ కునికృష్ణన్, అమల్, ఇందు థంపీ, నిఖితా విమల్, కాయదు లోహర్, బాబీ ఆంటోనీ కీలకపాత్రలు పోషించారు. ఓ అమ్మాయి జాతకం చెప్పినట్టే ఓ వ్యక్తి జీవితంలో జరగడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రాన్ని కామెడీ ప్రధానంగా తెరకెక్కించారు డైరెక్టర్ మోహనన్.
ఒరు జాతిజాతకం కలెక్షన్లు
ఒరు జాతిజాతకం చిత్రం సుమారు రూ.4.55 కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనా. ఈ సినిమా దాదాపు రూ.7.23 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. మిక్స్డ్ టాక్ దక్కించుకున్న బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ సక్సెస్ సాధించింది.
ఒరు జాతి జాతకం సినిమాను వర్ణచిత్ర బిగ్‍స్క్రీన్స్ పతాకంపై మహా సుబైర్ ప్రొడ్యూజ్ చేశారు. గుణ బాలసుబ్రమణియం సంగీతం అందించిన ఈ చిత్రానికి విశ్వజిత్ ఒడుక్కతిల్ సినిమాటోగ్రఫీ చేశారు.
ఒరు జాతి జాతకం స్టోరీలైన్
జయేశ్ (వినీత్ శ్రీనివాసన్) పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలకు రకరకాల డిమాండ్లు పెడుతూ ఉంటాడు. దీంతో ఏ సంబంధం కూడా సెట్ అవదు. 38 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. అయినా పెళ్లి కుదరదు. ఈ క్రమంలో సునీత (నిఖిల విమల్)ను పెళ్లి చూపులు చూసేందుకు వెళతాడు. ఆ సమయంలో జయేశ్ చేతిరేఖలను చూసి జాతకం చెబుతుంది సునీత. ఇబ్బందుల్లో పడతావని చెప్పేస్తుంది. అలాగే జయేశ్ సమస్యల్లో చిక్కుకుంటాడు. సవాళ్లు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జయేశ్‍కు ఏం జరిగింది? అతడి జీవితం ఎలా మారింది? సునీత్ ఏం చెప్పింది? మొత్తానికి అతడికి పెళ్లయిందా? అనే విషయాలు ఒరు జాతి జాతకం సినిమాలో ఉంటాయి.
సంబంధిత కథనం