




Best Web Hosting Provider In India 2024

Jagtial District : జగిత్యాల జిల్లాలో దారి తప్పిన ప్రధానోపాధ్యాయుడు – విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన, పోక్సో కేసు నమోదు
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్ధులతో పాటు పేరెంట్స్ కలెక్టరేట్ కు చేరికుని విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో… ప్రధానోపాద్యాయుడు గంగారెడ్డిపై పొక్సో కేసు నమోదు చేశారు.

జగిత్యాల జిల్లా కల్లెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయుడు కె.గంగారెడ్డి వ్యవహార శైలి వివాదస్పదంగా మారింది. పాఠశాలలో విద్యార్ధినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు ప్రైవేట్ భాగాలను టచ్ చేస్తూ కులం గురించి ఆరా తీయడంపై విసిగిపోయిన విద్యార్ధులతోపాటు పెరెంట్స్ ఆందోళనకు దిగారు.
కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా విద్యాశాఖ అధికారి రాముకు ఫిర్యాదు చేశారు. కులమతాల గురించి ఆరా తీసి లైంగికంగా వేదిస్తున్నాడని విద్యార్ధులతోపాటు పెరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానోపాద్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పిల్లలను బడికి పంపమని హెచ్చరించారు. వెంటనే స్పంధించిన విద్యాశాఖ అధికారి విచారణకు ఆదేశించారు.
హైస్కూల్ విద్యార్ధినిల పట్ల ప్రధానోపాద్యాయులు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారని విద్యార్ధులతోపాటు పేరెంట్స్ తెలిపారు. స్పెషల్ అకేషన్ సందర్బంగా స్కూల్ కు అమ్మాయిలు స్కూల్ డ్రెస్ కాకుండా సివిల్ డ్రెస్ వేసుకుని వస్తే నీ డ్రెస్ బాగుందని, ఈ డ్రెస్ లో నీవు బాగున్నావని టచ్ చేసే ప్రయత్నం చేస్తాడని ఆరోపించారు.
తమ బాధలు చెప్పుకోలేక గత కొంతకాలంగా కుమిలిపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సార్ తమకు వద్దని అతనిపై చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు. మరోవైపు తమ పిల్లలకు రక్షణ కల్పించాలని రాత పూర్వకంగా డీఈవోతోపాటు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
హెచ్ఎంపై పొక్సో కేసు….
పిల్లలతోపాటు పేరెంట్స్ కలెక్టరేట్ కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్లెడ జడ్పీ హైస్కూల్ ప్రధానోపాద్యాయుల తీరుపై విద్యాశాఖ అదికారి విచారణకు ఆదేశించగా పేరెంట్స్ ఫిర్యాదుతో జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదు విచారణ చేపట్టినట్లు జగిత్యాల రూరల్ సిఐ కృష్ణారెడ్డి తెలిపారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. హెచ్ఎం గంగారెడ్డి మాత్రం అందుబాటులో లేకుండా పోయాడు. అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్