




Best Web Hosting Provider In India 2024

Home Town Review: హోమ్ టౌన్ రివ్యూ.. రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ ఆహా ఓటీటీ తెలుగు ఫ్యామిలీ కామెడీ సిరీస్ ఎలా ఉందంటే?
Home Town Web Series Review In Telugu And Rating: ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ హౌమ్ టౌన్ స్ట్రీమింగ్ అవుతోంది. నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ భార్యాభర్తలుగా నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ హౌమ్ టౌన్ ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో నేటి హౌమ్ టౌన్ రివ్యూలో తెలుసుకుందాం.

OTT Web Series Home Town Review In Telugu: ఆహా ఓటీటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సరికొత్త ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ హౌమ్ టౌన్. పాపులర్ యాక్టర్ రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ భార్యాభర్తలుగా నటించిన హౌమ్ టౌన్‌కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు.
ఈటీవీ విన్ ఓటీటీ బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ మేకర్స్ నుంచి వచ్చిన హోమ్ టౌన్‌ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. రాజీవ్ కనకాల, ఝాన్సీతోపాటు ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి, అభయ్ నవీన్ తదితరులు నటించారు. ఏప్రిల్ 4 నుంచి ఆహాలో హౌమ్ టౌన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ తెలుగు సిరీస్ ఎలా ఉందో నేటి హౌమ్ టౌన్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ప్రసాద్ (రాజీవ్ కనకాల)ది మధ్యతరగతి కుటుంబం. జ్యోతి అనే ఫొటో స్టూడియో రన్ చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో భార్య, పిల్లలను పోషిస్తుంటాడు. కొడుకు శ్రీకాంత్ (ప్రజ్వల్ యాద్మ)ను పై చదువుల కోసం ఫారెన్ పంపించాలని, విదేశాల్లో బాగా సెటిల్ కావాలని, కూతురు జ్యోతి (యానీ)కి మంచివాడితో పెళ్లి చేయాలని కలలు కంటూ ఉంటాడు. అందుకోసం కష్టమైన సరే పాలసీలు తీసుకుంటాడు.
ట్విస్టులు
అయితే, శ్రీకాంత్ మాత్రం చదవుకుండా ఫ్రెండ్స్‌తో ఊరిలో తిరుగుతుంటే, జ్యోతి మాత్రం బాగా చదువుతుంది. మరి ఈ క్రమంలో ప్రసాద్ కన్న కలలు ఎలా తీరాయి? తండ్రి కలను శ్రీకాంత్ నెరవేర్చాడా? కూతురుకి పెళ్లి చేయాలనుకుంటే ఏమైంది? స్నేహితులతో శ్రీకాంత్ చేసిన పనులేంటీ? వంటి సీన్లతో సాగే తెలుగు వెబ్ సిరీసే హౌమ్ టౌన్.
విశ్లేషణ:
హౌమ్ టౌన్ అంతా 2000 కాలంలో జరుగుతుంటుంది. అప్పటి సమయంలో మనుషుల ప్రవర్తన, ఫ్రెండ్స్, జరిగిన సన్నివేశాలతో తీర్చిదిద్దారు. అయితే, 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్ అలాంటి ఫీలింగ్‌నే క్రియేట్ చేసిన దానికి మించి అనేలా పేరు తెచ్చుకోలేకపోయింది. ఇదివరకు చూసిన సీన్లలా రొటీన్‌గా ఉన్నప్పటికీ మాత్రం చూడాలనిపిస్తుంది.
ఎందుకంటే అవి మన జీవితంలో జరిగిన సంఘటనలే. మన స్నేహితులతో, తల్లిదండ్రులతో, ఇంట్లో చేసిన పనులనే హౌమ్ టౌన్‌లో చూపించారు. ఒక్కో స్టోరీని ఒక్కో ఎపిసోడ్‌లో చూపించారు. వాటికి ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, లవ్ ట్రాక్ వంటివి జోడించారు. హౌమ్ టౌన్ మొత్తం 5 ఎపిసోడ్స్‌తో సుమారుగా 30 నిమిషాల రన్ టైమ్‌తో సాగుతుంది. అప్పట్లో ఎల్ఐసీ పాలసీల గురించి మధ్యతరగతి వాళ్లు ఎలా ఆలోచించేవారో రెండు సీన్లతో బాగా చూపించారు.
ఒక్కో ఎపిసోడ్ అలా
అయితే, ఒక్కో ఎపిసోడ్‌ను క్రికెట్ వరల్డ్ కప్, వీక్లీ మ్యాగజైన్, లవ్, ఫేస్‌బుక్, ఫ్లై వంటి టైటిల్స్‌తో ఒక్కో కథ చెబుతూ ఫన్, భావోద్వేగాలతో తెరకెక్కించారు. అప్పట్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, ఇండియా ఓటమి, ఆస్ట్రేలియా చీట్ చేసి గెలిచిందనే పుకార్లు, క్రికెట్ కిట్స్, ఊరందరిని పోగేసి టీవీలో మ్యాచ్ చూపించడం, బెట్టింగ్ వాటితో మొదటి ఎపిసోడ్ రూపొందించారు.
ఇక స్వాతి మ్యాగజైన్‌కు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేదని తెలిసిందే. అందులో వచ్చే మిడిల్ పేజ్ కోసం ఎక్కువ మంది ఎవరికీ తెలియకుండా స్వాతి మ్యాగజైన్ కొనేవారు అనేది చూపించారు. ఈ ఎపిసోడ్ కాస్తా ఫ్యామిలీతో చూడరాకుండా ఉంటుంది. మరి బోల్డ్ సీన్స్ ఉండవు గానీ కాస్తా ఇబ్బంది తెప్పిస్తుంది.
ఆకట్టుకునే సంగీతం
ఇక లవ్ ట్రాక్, ఫేస్‌బుక్‌ను మొదట్లో యువత అనుకున్న తీరు, విదేశాలకు శ్రీకాంత్ వెళ్లడం వంటివి బాగానే చూపించారు. అయితే, టెన్త్ తర్వాత డైరెక్ట్ ఇంటర్‌కు, విదేశాలకు వెళ్లడం జంప్ చేసినట్లుగా అనిపించింది. కొన్ని ట్విస్టులు ముందుగానే ఊహించేలా ఉన్నాయి. క్లైమాక్స్ పర్వాలేదు. బీజీఎమ్ బాగుంది. ప్రతి ఎపిసోడ్ మొదట వచ్చే పాట బాగుంది. రొటీన్ సీన్స్ అయిన చూసేలా తెరకెక్కించారు డైరెక్టర్.
ఫైనల్‌గా చెప్పాలంటే..
ఇక రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ నటన బాగుంది. ప్రజ్వల్ యాద్మ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. యానీకి చివర్లో ప్రాధాన్యత దక్కినట్లు అనిపించింది. మిగతా పాత్రలు బాగానే చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే సొంతూరు, పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ఆహా ఓటీటీ ఒరిజినల్ వెబ్ సిరీస్ హౌమ్ టౌన్‌ను ఓసారి చూడొచ్చు.రేటింగ్: 2.5/5
సంబంధిత కథనం
టాపిక్