



Best Web Hosting Provider In India 2024
IPL 2025 LSG Coach Langer: ప్రెస్ కాన్ఫ్‌రెన్స్‌లో రిపోర్టర్‌కు అమ్మ కాల్..అప్పుడు లక్నో కోచ్ ఏం చేశాడంటే? వీడియో వైరల్
IPL 2025 LSG Coach Langer: ముంబయి ఇండియన్స్ పై విజయం తర్వాత ప్రెస్ కాన్ఫ్‌రెన్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ చేసిన పని వైరల్ గా మారింది. ఓ రిపోర్టర్ ఫోన్ కు అమ్మ నుంచి కాల్ వచ్చింది. అప్పుడు లాంగర్ ఏం చేశాడో ఇక్కడ తెలుసుకోండి.

ఐపీఎల్ 2025 లో శుక్రవారం (ఏప్రిల్ 4) ముంబయి ఇండియన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ విక్టరీ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫ్‌రెన్స్‌లో లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ రిపోర్టర్లతో మాట్లాడాడు. అదే సమయంలో ఓ రిపోర్టర్ కు తల్లి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు ఆ ఫోన్ తీసుకున్న లాంగర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.
అమ్మ ఎవరు?
ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ పై ఐపీఎల్ 2025లో తమ జట్టు విజయం సాధించిన తర్వాత లాంగర్ ఆనందం వ్యక్తం చేశాడు. అదే సమయంలో వాయిస్ రికార్డు కోసం టేబుల్ పై ఉంచిన ఫోన్లలో ఒక ఫోన్ మోగింది. అమ్మ నుంచి కాల్ వచ్చింది. ఆ ఫోన్ తీసుకున్న లాంగర్.. ‘‘ఎవరి అమ్మ’’ అని అడిగాడు. కాల్ లిప్ట్ చేసి మాట్లాడాడు.
“అమ్మా.. అర్ధరాత్రి 12:08 అయింది. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను” అని ఆ రిపోర్టర్ తల్లితో లాంగర్ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.
మయాంక్ 95 శాతం
ఐపీఎల్ 2025లో నాలుగు మ్యాచ్ లాడిన లక్నో సూపర్ జెయింట్స్ రెండు గెలిచి, రెండు ఓడింది. ఆ టీమ్ కు పేసర్ల గాయాలు పెద్ద సమస్యగా మారాయి. మోసిన్ ఖాన్ గాయంతో సీజన్ కు దూరమయ్యాడు. ఆకాశ్ దీప్ కోలుకుని వచ్చాడు. కానీ గత సీజన్ లో మెరుపు పేస్ తో సంచలనంగా మారిన మయాంక్ యాదవ్ మాత్రం ఇంకా టీమ్ కు అందుబాటులోకి రాలేదు. అతణ్ని లక్నో రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. మయాంక్ ఫిట్ నెస్ పై లాంగర్ అప్ డేట్ ఇచ్చాడు. మయాంక్ 95 శాతం వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని తెలిపాడు.
అందుకే చర్చ
“నాకు తెలిసిన విషయం ఏమిటంటే, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో మయాంక్ యాదవ్ చాలా కష్టపడుతున్నాడు. అతను నిన్న (గురువారం) బౌలింగ్ చేసిన కొన్ని వీడియోలను చూశా. అతను 90 నుండి 95 శాతం వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. గతేడాది మాయంక్ ప్రభావం చూశాం. అతని కంటే వేగంగా బౌలింగ్ చేసిన బౌలర్ భారత్ లో లేడు. అందుకే ఇంత చర్చ జరుగుతోంది” అని లాంగర్ విలేకరుల సమావేశంలో చెప్పాడు.
గాయాల నుంచి క్రికెటర్లు బెటర్ గా కోలుకునేలా జాతీయ క్రికెట్ అకాడమీ మెరుగ్గా పని చేస్తోందని లాంగర్ అన్నాడు. అవేశ్ ఖాన్, అకాశ్ దీప్ ఎన్సీఏలో కోలుకుని తిరిగి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో చేరారని లాంగర్ పేర్కొన్నాడు.
Best Web Hosting Provider In India 2024
Source link