




Best Web Hosting Provider In India 2024

Rashmika Diet Secret: రష్మిక బర్త్ డే స్పెషల్.. గ్లామర్ కోసం ఈమె ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడుతుందో తెలుసా?
Rashmika Mandanna Diet Secret: రష్మిక మందన్నా ఏళ్ల తరబడి అంతే అందాన్ని మెయింటైన్ చేయడానికి కారణం ఆపిల్ సైడర్ వెనిగర్ అంట. ఏప్రిల్ 5 ఆమె బర్త్ డే సందర్భంగా బ్యూటీ, డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం రండి.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తోన్న రష్మిక మందన్నా ఏప్రిల్ 5న తన 29వ పుట్టినరోజును జరుపుకుంటోంది. వెజిటేరియన్ డైట్ ఎక్కువగా ఫాలో అయ్యే ఈ నటి ప్రతి రోజూ ఉదయం కచ్చితంగా ఒక లీటర్ నీటిని తాగేస్తుందట. అంతే కాదు, అందులో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా కలుపుకుని తాగుతుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇది ఆమె జీర్ణక్రియ, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. రష్మిక మందన్నా బర్త్ డే సందర్భంగా ఆమె తీసుకునే రోజువారీ ఆహారం, వ్యాయామం, సింపుల్ బ్యూటీ రొటీన్ గురించి తెలుసుకుందామా..
రష్మిక మార్నింగ్ ఫంక్షన్ ఏంటి?
మంచి ఆరోగ్యం కోసం మీరు అనుసరించే మార్నింగ్ రొటీన్ గురించి అడిగినప్పుడు, “ఆరోగ్యం కోసం ఉదయం నిద్రలేవగానే చాలా నీరు తాగుతాను. పొద్దున్నే దాదాపు ఒక లీటర్ నీళ్లలో నా డైటీషియన్ చెప్పినట్లుగా ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగుతాను. ఓ మై గాడ్, అది… ఎలా తాగుతానో కూడా నాకు తెలియదు. కానీ నీరుతో పాటు తప్పకుండా అది తీసుకుంటాను. నేను శాకాహారిగా మారాను, ముఖ్యంగా ఎగ్జిటేరియన్. అందుకే వర్కవుట్స్ తర్వాత గుడ్లు తింటాను” అని చెప్పిందామె.
రష్మిక రోజులో ఏం తింటుంది?
తన రోజువారీ డైట్ వివరాలను పంచుకున్న రష్మికా.. “నాకు ఇష్టమైన అల్పాహారం ఆవకాడో టోస్ట్, కానీ నా డైటీషియన్, నన్ను దానిని తీసుకోవద్దని సూచించారు. మధ్యాహ్న భోజనానికి, నేను సౌతిండియన్ వంటలే తింటాను. కానీ అన్నం ఎక్కువగా తినను. నాకు చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే, అన్ని కూరలను మిక్స్ చేసి, వాటిని అలా తినడం ఇష్టం. ఎందుకంటే, వాటిలో ఉండే కూరగాయల్లో ఒక్కొక్క దానిలో ఒక్కో రుచి ఉంటుంది. అవి తింటే నాకు ప్రత్యేకంగా అనిపిస్తాయి. చాలా మంది ఈ విషయంలో నన్ను వింతగా చూస్తారు కూడా. చాలా సార్లు డిన్నర్ తేలికగా ఉంటుంది. కానీ, నా స్నేహితులతో పాటు బయటకు వెళితే మాత్రం, దాదాపు మంచి విందు భోజనం లాగించేస్తాను” అని డైట్ గురించి చెప్పారు రష్మిక.
ఏమేం ఇష్టమంటే..
తనకు చీట్ మీల్స్ లేకపోయినా, ప్రతిరోజూ డెజర్ట్ను కచ్చితంగా తీసుకుంటానని తెలిపింది రష్మిక. టమోటాలు, బంగాళాదుంపలు, దోసకాయ, క్యాప్సికమ్ వంటి కొన్ని కూరగాయలంటే తనకు అలెర్జీ అని అంటోంది రష్మిక. కానీ, స్వీట్ పొటాటో తినడం అంటే ఆమెకు చాలా ఇష్టమని చెబుతున్నారు.
రష్మిక తన వర్కవుట్స్, బ్యూటీ రొటీన్ను షేర్ చేస్తూ
రోజులో ఏ సమయంలో వర్కవుట్ చేస్తారని అడగిన ప్రశ్నకు, షూటింగుల కారణంగా సాయంత్రం వర్కౌట్ చేయడానికి ఇష్టపడతానని చెప్పింది. ప్రతిరోజూ వర్కవుట్స్ చేస్తానని రష్మిక తెలిపింది. ఆమె చర్మ సంరక్షణ విషయానికొస్తే, దానిని సరళంగా ఉంచడానికి ఇష్టపడతానని చెప్పింది. ఆమె తన ముఖాన్ని తరచూ శుభ్రపరచుకుంటూ ఉంటుందట. దాని వల్ల మొఖంపై ఏర్పడే తేమ పోతుందని తెలిపింది. ప్రతిరోజూ ఉదయం ఆమె బయటకు వెళ్ళే ముందు సన్స్క్రీన్ కచ్చితంగా అప్లై చేసుకుంటుందట.
సంబంధిత కథనం