




Best Web Hosting Provider In India 2024

Hrithik Roshan on Jr NTR: ఎన్టీఆర్‌పై హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. వార్ 2 రిలీజ్ డేట్‍పై మరింత క్లారిటీ
Hrithik Roshan on Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు హృతిక్ రోషన్. ప్రశంసలు కురిపించారు. వార్ 2 సినిమా రిలీజ్ డేట్‍పై కూడా మరోసారి క్లారిటీ ఇచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో వార్ 2 చిత్రం రూపొందుతోంది. ఆ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. ఈ సినిమాతోనే డైరెక్ట్ బాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఈ స్పై యాక్షన్ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్‍లో ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హృతిక్.
ఎన్టీఆర్.. నా ఫేవరెట్ కోస్టార్
తన ఫేవరెట్ కో-స్టార్ ఎవరో చెప్పాలని ఓ ఈవెంట్‍లో హృతిక్ రోషన్‍కు ప్రశ్న ఎదురైంది. టక్కున జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పేశారు హృతిక్. “జూనియర్ ఎన్టీఆర్.. నా ఫేవరెట్ కో-స్టార్. అతడు ఓ అద్భుతం. మంచి టీమ్‍మేట్. గొప్ప వ్యక్తి. ఆ మూవీని మీరు చూసేందుకు నేను వేచిచూడలేకున్నా” అని హృతిక్ ప్రశంసలు కురిపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
రిలీజ్ డేట్‍పై మళ్లీ క్లారిటీ
ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన వార్ 2 చిత్రం విడుదలవుతుందని హృతిక్ రోషన్ చెప్పారు. ఈ విషయాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ గతంలోనే వెల్లడించింది. అయితే, ఆగస్టు 14నే తాజాగా రజినీకాంత్ ‘కూలీ’ కూడా ఫిక్స్ చేసుకుంది. దీంతో వార్ 2 వెనక్కి తగ్గుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆగస్టు 14నే వస్తుందని హృతిక్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.
వార్ 2 వస్తుండటంతో ఇండిపెండెన్స్ డే వీక్ కాకుండా వేరే వారంలో కూలీని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు గతంలో లీకులు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఆగస్టు 14నే రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటన వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వార్ 2, కూలీ పోటీ ఆసక్తికరంగా మారింది. కూలీ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. రజినీకాంత్‍తో పాటు నాగార్జున, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరి, బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాల పోటీ అలాగే ఉంటుందా.. ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది చూడాలి.
వార్ 2 సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే చిత్రీకరణ పూర్తి కానుంది. చెప్పిన తేదీకే విడుదలకు సిద్ధం చేసేందుకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పూర్తిగా ప్లాన్ చేసుకున్నారు. 2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు.
వార్ 2 మూవీలో యాక్షన్ సీక్వెన్సులు భారీ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ భారీ బడ్జెట్‍తో నిర్మిస్తోంది యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్. ఆదిత్య చోప్రా నిర్మాతగా ఉన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఉండనుంది. 2026లో ఈ సినిమా విడుదల కానుంది. కేజీఎఫ్ 1,2, సలార్ సినిమాలతో భారీ బ్లాక్‍బస్టర్స్ కొట్టిన నీల్.. ఎన్టీఆర్‌తో మూవీని మరింత భారీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై చాలా హైప్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూజ్ చేస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
సంబంధిత కథనం