Mystery Thriller OTT: రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ – అంద‌మైన అమ్మాయి క‌థ‌…

Best Web Hosting Provider In India 2024

Mystery Thriller OTT: రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ – అంద‌మైన అమ్మాయి క‌థ‌…

Nelki Naresh HT Telugu
Published Apr 05, 2025 01:12 PM IST

OTT: తెలుగు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గ‌ర్ల్ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ విడుద‌లైంది. నిహాల్ కోదాటి, ద్రిషిక చంద‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీకి ర‌విప్ర‌కాష్ బోడ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ
మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ

తెలుగు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గ‌ర్ల్ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్రవారం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌లైంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట్‌తో ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గ‌ర్ల్ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ద్రిషిక చంద‌ర్ హీరోయిన్‌…

ఈ తెలుగు సినిమాలో నిహాల్ కోదాటి, ద్రిషిక చంద‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో మ‌ధునంద‌న్‌, దేవినాగ‌వ‌ల్లి, భార్గ‌వ్ పోలుదాస్‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు ర‌వి ప్ర‌కాష్ బోడ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సోష‌ల్ మీడియా వేధింపులు…

ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గ‌ర్ల్ మూవీ 2023లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియా వేధింపుల‌కు సంబంధించిన మెసేజ్‌కు థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు. కాన్సెప్ట్ బాగున్నా ద‌ర్శ‌కుడి అనుభ‌వ‌లేమి కార‌ణంగా ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గ‌ర్ల్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

మిస్సింగ్ కేసు…

ఫేమ‌స్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చ‌రిత్ర (ద్రిషిక చంద‌ర్‌)అదృశ్య‌మ‌వుతుంది. ఆమె మిస్సింగ్ కేసును ఐపీఎస్ ఆఫీస‌ర్ ఆదిత్య (భార్గ‌వ్ పోలుదాసు) చేప‌డ‌తాడు. ఆదిత్య ఇన్వేస్టిగేష‌న్‌లో విక్ర‌మ్ అనే అత‌డిని క‌లిసిన త‌ర్వాతే చ‌రిత్ర క‌నిపించ‌కుండాపోయింద‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.

ఆ త‌ర్వాత ర‌వితో (నిహాల్ కోదాటి) చ‌రిత్ర ప్రేమ‌లో ఉంద‌నే సంగ‌తి ఆదిత్య క‌నిపెడ‌తాడు. ఒక‌రినొక‌రు ప్రాణంగా ప్రేమించుకున్న ర‌వి, చ‌రిత్ర ఎందుకు విడిపోయారు? చ‌రిత్ర క‌నిపించ‌కుండా పోవ‌డానికి కార‌ణం ఏమిటి? చ‌రిత్ర మిస్సింగ్ కేసులోని నిజాల‌ను ఆదిత్య ఎలా బ‌య‌ట‌పెట్టాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఎవ‌రు మూవీతో ఎంట్రీ…

ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గ‌ర్ల్ మూవీకి గిడియ‌న్ క‌ట్ట మ్యూజిక్ అందించాడు. ఎవ‌రు మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడ‌య్యాడు నిహాల్ కోదాటి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో బ‌ట్ట‌ర్ ఫ్లై అనే సినిమా చేశాడు. ఎన్టీఆర్ దేవ‌ర‌, టుక్‌టుక్‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. ప్ర‌స్తుతం చైనా పీస్‌, శాంత‌ల‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తోన్నాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024